మకర సంక్రాంతి 2022 - మకర సంక్రాంతి విశిష్టత - Makar Sankranti 2022

హిందూ మతంలో మకర సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను మన దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.సంక్రాంతి పండుగ వేళ అనేక సంఘటనలు ఉన్నాయి. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. ధనస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించే రోజు. ఇదే రోజున కేరళ రాష్ట్రంలోని శబరిమలలో అయ్యప్పస్వామి ఆలయ ప్రాంతంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది.

మిగిలిన ప్రాంతాల్లో రైతుల చేతికి పంట చేతికొచ్చిన సందర్భంగా రైతులందరూ ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇదిలా ఉండగా.. 2022 సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్తం ఎప్పుడు, అసలు ఈ పండుగను జరుపుకునేందుకు గల ముఖ్యమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

సంక్రాంతి ఎప్పుడంటే.. మకర సంక్రాంతి హిందూ మతంలోని ప్రధాన పండుగలలో ఒకటి. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వారి వారి విశ్వాసాల ప్రకారం జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగను 2022 సంవత్సరంలో జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. శుభ ముహుర్తం మధ్యాహ్నం 2:43 నుండి సాయంత్రం 5:45 గంటల వరకు ఉంటుంది. అంతకు ముందు జనవరి 14వ తేదీన భోగీ పండుగ జరుపుకుంటారు.

పురాణాల ప్రకారం.. మకర సంక్రాంతి పండుగ వేళ సూర్యభగవానుడు తన కుమారుడైన శని ఇంటికి వెళతాడని చెబుతారు. అదే సమయంలో, శని మకరం మరియు కుంభరాశికి అధిపతిగా పరిగణించబడతారు. ఈ పండుగ తండ్రీ కొడుకుల కలయికతో ముడిపడి ఉంటుంది. దీనికి సంబంధించిన అనేక పౌరాణిక కథనాలు కూడా ఉన్నాయి. ఓ పురాణం ప్రకారం, ఈ పండుగను రాక్షసులపై విష్ణువు సాధించిన విజయంగా కూడా జరుపుకుంటారు. ఈరోజున శ్రీ మహావిష్ణువు అసురులను జయించి, మందర పర్వతంపై వారి తలలను పాతిపెట్టాడని చెబుతారు.

ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో సమస్య ఉంటే, ఇప్పుడే కాల్ చేయండి.జ్యోతిష్యులతో ఫోన్‌లో మాట్లాడండి.

ఉత్తర దిశలో పయనం. సంక్రాంతిని ఉత్తరాయణంగా పిలుస్తారు. ఎందుకంటే ఈరోజు నుండి సూర్యుడు దక్షిణయానం నుండి ఉత్తరయానంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా రైతుల పంట చేతికొస్తుంది. అయితే ఈ పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోపేరుతో జరుపుకుంటారు. ఉత్తర భారతంలోని ప్రజలందరూ సంక్రాంతి పండుగను మాఘీ అని పిలుస్తారు. మధ్య భారతంలో సుకరాత్ అని పిలుస్తారు. గుజరాత్ లో అయితే గాలిపటాలను ఎగురవేసి సంబురాలు జరుపుకుంటారు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు స్నానం మరియు దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మకర సంక్రాంతి రోజున తలస్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీంతో పాటు ఈ పవిత్రమైన రోజున దానం చేస్తే తాము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. సంక్రాంతి రోజున పసుపు బియ్యం లేదా ఉన్ని దుస్తులను దానం చేస్తే పుణ్య ఫలం వస్తుందని పండితులు చెబుతారు.

సంక్రాంతి వేళ పల్లెటూళ్లు.. పట్టణాల్లో ఉదయాన్నే రంగు రంగుల ముగ్గులతో ప్రతి ఒక్క లోగిలి ముంగిట పండుగ శోభను తెచ్చేస్తారు. ఈరోజున ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

అధునాతన ఆరోగ్య నివేదిక మిమ్మల్ని ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది!

ఈ సంక్రాంతి, మీ రాశిచక్రం ప్రకారం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

మేషరాశి : మేషరాశి వారు తమ కుడి చేతితో ఒక జత లవంగాలు, నువ్వులు, బెల్లం కలిపి అగ్నికి సమర్పించాలి.

వృషభరాశి : వృషభ రాశి వారు తమ కుడి చేతితో అగ్నికి ఒక పిడికెడు బియ్యం మరియు ఒక పిడికెడు పంచదార మిఠాయిని సమర్పించాలి.

మిథునరాశి: మిథున రాశి వారు తమ కుడిచేతితో నిప్పుకు కొంత మొత్తం గోధుమలను తప్పనిసరిగా సమర్పించాలి.

కర్కాటకరాశి: కర్కాటకరాశి వారు అగ్నికి ఒక పిడికెడు బియ్యం మరియు ఒక పిడికెడు ఖీల్-బటాషే సమర్పించాలి.

సింహరాశి: సింహ రాశి వారు అగ్నికి కుడిచేతితో గోదుమలు, సమర్పించాలి.

కన్యరాశి: కన్యా రాశి వారు తమ కుడిచేతితో అగ్నికి ఒక పిడికెడు వేరుశెనగ, రెండు లవంగాలు, సమర్పించాలి.

తులారాశి: తులారాశి వారు తమ కుడిచేతిని ఉపయోగించి మంటకు ఒక పిడికెడు జొన్నలు, రెండు లవంగాలు సమర్పించాలి.

వృశ్చికరాశి : వృశ్చిక రాశి వారు ఒక పిడికెడు శనగపప్పు, ఒక పిడికెడు రేవరి, రెండు లవంగాలను అగ్నికి కుడిచేతితో సమర్పించాలి.

ధనుస్సురాశి : ధనుస్సు రాశి వారు ఒక పిడికెడు పప్పు, ఒక ముద్ద పసుపు, రెండు లవంగాలు, ఒక బాటాషాను అగ్నికి కుడిచేతితో సమర్పించాలి.

మకరరాశి: మకర రాశి వారు ఒక పిడికెడు నల్ల ఆవాలు, రెండు లవంగాలు, జాజికాయలను అగ్నికి కుడిచేతితో సమర్పించాలి.

కుంభరాశి : కుంభ రాశి వారు కుడిచేతితో అగ్నిలో ఒక పిడికెడు శెనగపప్పు, రెండు లవంగాలు సమర్పించాలి.

మీనరాశి : మీన రాశి వారు ఒక పిడికెడు పసుపు ఆవాలు, మూడు కుంకుమపువ్వులు, మూడు పసుపు ముద్దలు, ఒక పిడికెడు రేవరి కలిపి అగ్నికి సమర్పించాలి.

పవిత్రమైన సంక్రాంతి ​పండుగకు ఆధ్యాత్మిక మరియు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఆవు పాలను మరిగించి ఎంత ఎక్కువ ఉడకబెట్టినా అంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. పాలు మరింత ఎక్కువగా ఉడకబెట్టడంతో, ఒక వ్యక్తి యొక్క మనస్సు కూడా శుద్ధి చేయబడుతుందని మరియు అతను సంపన్నమైన జీవితంతో ఆశీర్వదించబడుతుందని నమ్ముతారు.

జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్

ఆస్ట్రోసేజ్తో కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు!

Talk to Astrologer Chat with Astrologer