జూన్ 2025 సంగ్రహలోకణం

Author: K Sowmya | Updated Fri, 16 May 2025 05:04 PM IST

గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జూన్ నెల సంవత్సరంలో ఆరవ నెల, ఇది శక్తి, మార్పు మరియు వృద్దికి చిహ్నం. ఈ ఆర్టికల్ లో జూన్ 2025 సంగ్రహలోకణంగురించి పూర్తి వివరాలను తెలుసుకుందాము. ఈ నెలలో సూర్యుడు మిథునరాశిలో సంచరిస్తాడు , ఇది మానసిక కార్యకలాపాలు, కొత్త ఆలోచనలు మరియు కమ్యూనికేషన్ యొక్క ప్రవాహాన్ని పెంచుతుంది. జోతిష్యశాస్త్ర దృక్కోణం పరంగా జూన్ నెల చర్చలు, ఆత్మపరిశీలన మరియు భావోద్వేగ అవగాహనకు చాలా ముఖ్యమైనది. ఈ నెలలో గ్రహాలు స్థానం మరియు ప్రభావం కారణంగా, ఒక వ్యక్తి తన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచగలడు. జూన్ 2025 లో మొత్తం 30 రోజులు ఉంటాయి మరియు ఇది ఉత్తర అర్ధగోళంలో మొదటి వేసవి నెల. జూన్ నెల పేరు లాటిన్ పదం 'జూనో' నుండి ఉద్భవించింది, ఆమె రోమన్ పురాణాలలో వివాహం, సంతానోత్పత్తి మరియు కుటుంబ జీవితానికి దేవత.


చాలా మంది స్థానికులు ఈ నెల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటారు. ఈ నెల గురించి ప్రజల మనస్సులోకి అనేక రకాల ప్రశ్నలు వస్తాయి, వారి కెరీర్ ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుంటుందా లేదా? కుటుంబంలో ఆనందం ఉంటుందా లేదా ఉద్రిక్తత ఉంటుందా? మొదలైన వాటి గురించి జూన్ 2025 నాటి ఈ ప్రత్యేక ఆర్టికల్ లో ఈ ప్రశ్నలన్నింటికీ మీరు సమాధానం పొందుతారు. అలాగే, జూన్‌లో ఏ తేదీన ఏ గ్రహాలు సంచరిస్తాయి మరియు జూన్‌లో ఏ తేదీలలో బ్యాంకు సెలవులు ఉంటాయి మరియు వివాహ ముహూర్తాలు ఏమిటి అనే సమాచారం కూడా ఈ ఆర్టికల్ లో ఇవ్వబడింది. ఇంకా ముందుకు సాగి జూన్ 2025 సంగ్రహలోకణం ఆర్టికల్ చదివి పూర్తి వివరాలను తెలుసుకుందాము.

కాల్‌లో ఉత్తమ జ్యోతిష్కు ల నుండి మీ జీవితంపై కుజుడు సంచారం ప్రభావాన్ని తెలుసుకోండి!

జూన్ 2025లో జన్మించిన స్థానికుల వ్యక్తిత్వ లక్షణాలు

మొండివారు: జూన్ నెలలో జన్మించిన వ్యక్తులు చాలా మొండివారు. ఈ వ్యక్తులు తమ సొంత నిబంధనల ప్రకారం జీవించడానికి ఇష్టపడతారు, వారు తమ స్నేహితులలో బాగా ప్రాచుర్యం పొంది ఉంటారు. వారి వ్యక్తిత్వం ఏమిటంటే వారు ప్రజలను సులభంగా తమ వైపుకు ఆకర్షిస్తారు.

సహాయం చేస్తారు: జూన్‌లో జన్మించిన వ్యక్తులు స్వభావరీత్యంగా చాలా దయగలవారు మరియు సహకారులు. వారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.

వారు ఉత్సుకత కలిగి ఉంటారు: ఈ వ్యక్తులు ఉత్సుకత స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు ఏదో ఒక ఆలోచన లేదంటే మరొకటి వారి మనస్సులో ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటుంది. వారు కొత్తగా ఏదైనా నేర్చుకోవడంలో సమయాన్ని వృధా చేయరు మరియు వారి ఉత్సుకత కారణంగా వారు సాహసోపేతంగా మారతారు.

వారు శృంగారభరితంగా మరియు భావోద్వేగంగా ఉంటారు: ఈ నెలలో జన్మించిన వ్యక్తులు స్వభావరీత్యా చాలా శృంగారభరితంగా ఉంటారు. వారు సులభంగా భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకుంటారు మరియు బలమైన సంబంధాలను ఏర్పరచుకుంటారు.

వారు స్వేచ్ఛను ఆరాధిస్తారు: ఈ స్థానికులు స్వేచ్ఛను ఇష్టపడతారు మరియు ప్రయాణం, మార్పు మరియు అన్వేషణ వారి ఆనందానికి ముఖ్యమైనవి.

అదృష్ట సంఖ్య: 3 మరియు 6

అదృష్ట రంగు: పసుపు, లేత ఆకుపచ్చ, ఆకాశ నీలం, క్రీమ్ మరియు వెండి.

అదృష్ట రత్నం: ముత్యం మరియు చంద్ర రాయి.

అదృష్ట పువ్వులు: గులాబీ, లావెండర్ మరియు లిల్లీ.

అదృష్ట రోజులు: బుధవారం, శుక్రవారం మరియు సోమవారం.

పాలక గ్రహాలు: బుధుడు మరియు చంద్రుడు.

జూన్ 2025 ఆశ్లేష నక్షత్రంలోని శుక్ల పక్షంలోని ఆరవ రోజున ప్రారంభమవుతుంది. జూన్ 2025 పూర్వ ఫల్గుణి నక్షత్రంలోని శుక్ల పక్షంలోని ఆరవ రోజున ముగుస్తుంది.

వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025

2025 జూన్ ఉపవాసాలు మరియు పండుగల జాబితా

తేదీ

రోజు

పండుగలు మరియు ఉపవాసాలు

06 జూన్, 2025

శుక్రవారం

నిర్జల ఏకాదశి

08 జూన్, 2025

శుక్రవారం

ప్రదోష వ్రతం (శుక్ల)

11 జూన్, 2025

శుక్రవారం

జ్యేష్ట పౌర్ణమి వ్రతం

14 జూన్, 2025

శుక్రవారం

సంకష్ట చతుర్థి

15 జూన్, 2025

శుక్రవారం

మిథున సంక్రాంతి

21 జూన్, 2025

శుక్రవారం

యోగిని ఏకాదశి

23 జూన్, 2025

సోమవారం

మాసిక శివరాత్రి

23 జూన్, 2025

సోమవారం

ప్రదోష వ్రతం (కృష్ణ)

25 జూన్, 2025

శుక్రవారం

ఆశాడా అమావాస్య

27 జూన్, 2025

శుక్రవారం

జగగన్నాథ్ రత యాత్ర

జూన్ 2025 ముఖ్యమైన పండుగలు మరియు ఉపవాసాలు

నిర్జల ఏకాదశి: ఈ రోజున విష్ణువు మరియు లక్ష్మీ దేవిని పూజిస్తారు. నిర్జల ఏకాదశి రోజున నీరు లేకుండా ఉపవాసం ఉండటం ఆచారం, ఇది అన్ని ఏకాదశులలో అత్యంత కష్టమైనది కానీ పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

జ్యేష్ఠ పౌర్ణమి వ్రతం: ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం మరియు ఉపవాసం ఉండటం చాలా ముఖ్యం. ఈరోజున సత్యనారాయణ కథ మరియు పూజలు కూడా చేస్తారు.

సంకష్ట చతుర్థి: ఈ రోజున గణేశుడిని పూజిస్తారు. సాయంత్రం చంద్రుడికి నీరు అర్పించిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమిస్తారు.

ఆషాఢ అమావాస్య: ఈరోజు పూర్వీకులకు నీరు అర్పించడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శ్రద్ధ చేయడం, దానధర్మాలు చేయడం మరియు పవిత్ర నదిలో స్నానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.

జగన్నాథ యాత్ర: ఒరిస్సాలోని పూరి రాష్ట్రంలో జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది. ఈ సమయంలో జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర తమ రథం పైన కూర్చుని మొత్తం నగరాన్ని చుట్టి వస్తారు. ఇంకా ముందుకు సాగి బ్యాంక్ సెలువులు మరియు రాశిచక్రాల యొక్క జాబితాని జూన్ 2025 సంగ్రహలోకణం ఆర్టికల్ లో తెలుసుకుందాము.

2025 జూన్ బ్యాంక్ సెలవుల జాబితా

తేదీ

రోజు

సెలువులు

రాష్ట్రం

07 జూన్, 2025

శుక్రవారం

బక్రీద్/ ఈద్ - ఉల్ - ఆజా

చండీగఢ్, డామన్ & డయ్యూ, దాద్రా, అరుణాచల్ ప్రదేశ్ & నాగర్ హవేలీ, సిక్కిం మొదలైన రాష్ట్రాలలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాలలో జాతీయ సెలవు.

08 జూన్, 2025

శుక్రవారం

బక్రీద్/ ఈద్ - ఉల్ - ఆజా సెలువు

జమ్ము & కాశ్మీర్

11 జూన్, 2025

శుక్రవారం

గురు కబీర్ జయంతి

పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గడ్

12 జూన్, 2025

గురువారం

గురు హరగోబింద జయంతి

జమ్ము & కాశ్మీర్

14 జూన్, 2025

శుక్రవారం

పహిలి రాజా

ఒరిస్సా

15 జూన్, 2025

శుక్రవారం

రాజా సంక్రాంతి

ఒరిస్సా

15 జూన్, 2025

శుక్రవారం

వై ఏం ఏ రోజు

మిజోరం

27 జూన్, 2025

శుక్రవారం

రత యాత్ర

ఒరిస్సా

30 జూన్, 2025

సోమవారం

రేమనా ని

మిజోరం

2025 జూన్ వివాహ ముహూర్తాల జాబితా

తేదీ మరియు రోజులు

నసఖ్యతరం

తిథి

ముహూర్త సమయం

02 జూన్ 2025, సోమవారం

మాఘ

సప్తమి

08:20 AM నుండి 08:34 PM వరకు

03 జూన్ 2025, మంగళవారం

ఉత్తరఫాల్గుణి

నవమి

12:58 pm నుండి 05:44 am వరకు

04 జూన్ 2025, శుక్రవారం

ఉత్తరఫాల్గుణి మరియు హస్త

నవమి, దశమి

05:44 AM నుండి 05:44 AM వరకు

05 జూన్ 2025, గురువారం

హస్త

దశమి

05:18 am నుండి 09:14 am వరకు

07 జూన్ 2025, శుక్రవారం

స్వాతి

ద్వాదశి

09:40 am నుండి 11:18 am వరకు

08 జూన్ 2025, శుక్రవారం

విశాక స్వాతి

త్రయోదశి

12:18 PM నుండి 12:42 PM వరకు

చదవండి: ఈరోజు అదృష్ట రంగు !

2025 జూన్ ముండన ముహూర్తాల జాబితా

తేదీ

సమయం

5 జూన్ 2025

08:51-15:45

6 జూన్ 2025

08:47-15:41

8 జూన్ 2025

10:59-13:17

15 జూన్ 2025

17:25-19:44

16 జూన్ 2025

08:08-17:21

20 జూన్ 2025

05:55-10:12

12:29-19:24

21 జూన్ 2025

10:08-12:26

14:42-18:25

26 జూన్ 2025

14:22-16:42

27 జూన్ 2025

07:24-09:45

12:02-18:56

జూన్ 2025: గ్రహణాలు మరియు సంచారాలు

మిథునరాశిలో బుధుడి సంచారం: జూన్ 6న ఉదయ 09:15 గంటలకు బుధుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు.

సింహారాశిలో కుజుడు సంచారము: జూన్ 7న మధ్యాహ్నం 01:33 గంటలకు, కుజుడు చంద్రుని రాశి సింహంలోకి ప్రవేశిస్తాడు.

మిథునరాశిలో బృహస్పతి దహనం: జూన్ 2025 సంగ్రహలోకణంప్రకారం జూన్ 9 న సాయంత్రం 4:12 గంటలకు గ్రహం మిథునరాశిలో దహనము చెందుతుంది.

మిథునరాశిలో బుధుడు ఉదయిస్తాడు: జూన్ 11 న ఉదయం 11:57 గంటలకు బుధుడు మిథునరాశిలో ఉదాయిస్తాడు.

మిథునరాశిలో సూర్య సంచారం: జూన్ 15న ఉదయం 06:25 గంటలకు సూర్యుడు మిథునరాశిలో ప్రయాణిస్తాడు.

కర్కాటకరాశిలో బుధుడు సంచారం: జూన్ 22న రాత్రి 9:17 గంటలకు కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు.

వృషభరాశిలో శుక్ర సంచారం: శుక్రుడు మధ్యాహ్నం 01:56 గంటలకు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు.

కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!

జూన్ అవలోకనం: రాశిచక్రం వారీగా అంచనాలు

మేషరాశి

ఈ సమయంలో మీరు మీ పనిలో చాలా బిజీగా ఉంటారు. పని విషయంలో మీరు వేరే నగరానికి లేకపోతే దేశానికి వెళ్లాల్సి రావచ్చు. కార్యాలయంలో మంచి విజయం మరియు ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో విద్యార్థులకు సమస్యలు ఉండవచ్చు. మీ విద్యలో తరచుగా అంతరాయాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు విద్యార్థులను ఇబ్బంది పెట్టవచ్చు. మీకు మీ తల్లితో విభేదాలు ఉండవచ్చు. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య అపార్థం ఏర్పడే అవకాశం ఉంది. మీ స్నేహితుల సలహా తీసుకోవడం ద్వారా మీరు మీ సంబంధాన్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. ఆదాయంలో స్థిరమైన పెరుగుదల ఉంటుంది. వ్యాపారం నుండి కూడా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూన్ 2025 సంగ్రహలోకణం ప్రకారం ఈ నెలలో మేషరాశి వారికి ఛాతీ బిగుతు లేదంటే మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆరోగ్య చికిత్స కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు.

పరిహారం: మీరు గురువారం రోజున అరటి చెట్టుకు నీరు పెట్టాలి.

వృషభరాశి

జూన్ నెలవారి జాతకం 2025 ప్రకారం వృషభరాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయని భావిస్తున్నాము. రాహువు ప్రభావం కారణంగా మీరు మీ పనిని పెద్దగా పట్టించుకోరు మరియు దీని కారణంగా మీరు మీ కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సమయంలో విద్యార్థులు తమ చదువుల పైన పూర్తి శ్రద్ద చూపుతారు. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్ధులు ఏదయినా చేయాల్సిన సమయం ఇది. మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతిని పొందుతారు. కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు మీ ప్రేమను పరీక్షించుకోవాల్సి రావచ్చ. మీ ప్రేమికుడిని నిజంగా ప్రేమిస్తే మీరు ఈ ఇబ్బందులు మరియు పరీక్షలను దాటగలుగుతారు. భార్యాభర్తలు మధ్య సంబంధం బలంగా ఉంటుంది. ఈ నెలలో మీకు తగినంత డబ్బు ఉంటుంది. ఈ నెలలో వృషభరాశి వారికి గుండెల్లో మంట, బిగుతు మరియు ఒకరకమైన రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశమ ఉంది.

పరిహారం: శుక్రవారం రోజున పేదలకు దానం చేయండి.

మిథునరాశి

ఈ నెలలో బృహస్పతి మిథునరాశి వారిని కష్టపడి పనిచేసేవారిగా చేస్తాడు. ఈ నెలలో మీ వ్యాపార పరిస్థితి కూడా బాగుంటుంది. ఈ నెల ప్రేమ సంబంధాల పరంగా అనుకూలతను తెస్తుంది. ఈ సమయంలో ఉద్యోగులు మరియు వ్యాపారవేత్తలు ఇద్దరూ విజయం సాధిస్తారు. విద్యార్థులు చదువుల పైన దృష్టి పెడతారు. మీరు ప్రయత్నించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య దూరం ఉండవచ్చు. మీరు మీ తోబుట్టువుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జూన్ 22 తర్వాత కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఈ నెల ప్రేమ సంబంధాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరిద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలని భావిస్తారు. మీరు మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఈ నెలలో మీ ఖర్చులు పెరుగుతాయి. మీకు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి మరియు మీ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ నెలలో మీరు ఆరోగ్యంగా ఉంటారు.

పరిహారం: బుధవారం రోజున నపుంసకుల ఆశీర్వాదాలు తీసుకోండి.

కర్కాటకరాశి

ఈ సమయంలో మీరు ఎవరితోనూ కోపంగా మాట్లాడకూడదు. మీరు వ్యాపార సంబంధిత ప్రయాణాలకు వెళ్లవచ్చు. విద్యా రంగంలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు ఆప్యాయత పెరుగుతుంది. జూన్ 07 తర్వాత కుటుంబంలో తగాదాలు ఉండవచ్చు. మీరు మరియు మీ భాగస్వామి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ ఆదాయం పెరుగుతుంది. జూన్ 2025 సంగ్రహలోకణం సమయంలో మీరు ఈ నెలలో మీ ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మీరు ద్రవ మరియు పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలని సలహా ఇస్తారు. ఈ సమయంలో జాగ్రత్తగా వాహనం నడపండి.

పరిహారం: గురువారం రోజున గోధుమ రంగు ఆవుకు తినడానికి ఏమైనా ఇవ్వండి.

సింహారాశి

జూన్ నెలలో మీ స్వభావం పెరగవచ్చు. మీరు మీ పని రంగంలో మంచి విజయం సాధించవచ్చు. మీ ఆదాయంలో పెరుగుదలను మీరు చూస్తారు. వ్యాపారవేత్తలు ఈ నెలలో శని మిమ్మల్ని పరీక్షించవచ్చు. దీని కారణంగా, మీరు నిరంతరం కష్టపడి పనిచేయాలి. మీరు విద్యా రంగంలో బాగా రాణిస్తారు. మీ కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. ఈ నెలలో మీ భాగస్వామితో మీ సంబంధం బలంగా మరియు లోతుగా మారుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జూన్ నెలవారీ జాతకం 2025 ప్రకారం మీరు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు.

పరిహారం: శుక్రవారం రోజున శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పటించండి.

మీ జాతకచక్రం శని నివేదిక ఆధారంగా ఖచ్చితమైన సమాచారాన్ని పొందండి!

కన్యరాశి

ఈ నెల కన్యరాశి వారికి సగటుగా ఉంటుంది. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్థుల పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్థులు తమ పనిని పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీరు కోరుకున్న స్థానానికి బదిలీ చేయబడవచ్చు. ఈ నెలలో విద్యార్థులు విద్యా రంగంలో అంతరాయాలను ఎదుర్కోవచ్చు. మీరు మీ విద్య పైన దృష్టి పెట్టలేరు. కష్టపడి పనిచేయడం ద్వారా మీరు కోరుకున్న విజయాన్ని పొందే అవకాశం ఉంది. జూన్ 2025 సంగ్రహలోకణం సమయంలో మీ కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. కుజుడు కారణంగా మీ ప్రేమ సంబంధంలో ఉద్రిక్తత భయం ఉంది. మీ ఊహించని ఖర్చులు పెరగడాన్ని మీరు చూడవచ్చు. మీ పైన ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ నెల అంతా మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

పరిహారం: వీధి కుక్కలకి తిండి పెట్టండి.

తులారాశి

మీరు కార్యాలయంలో ఎవరితోనైనా గొడవ పడవచ్చు లేదంటే చిన్న వాదనకు దిగవచ్చు, ఈ వాదన మీ పని పైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. మీకు పని ఒత్తిడి కూడా ఉండవచ్చు. ఈ సమయంలో విద్యార్థులు ఏకాగ్రత సమస్యను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ నెలలో మీ కుటుంబ సంబంధాలలో విభేదాలు వస్తాయనే భయం ఉంది. ఈ నెలలో మీరు మీ ప్రేమికుడితో మీ మనసులోని మాటను చెప్పుకోవడానికి సంకోచించవచ్చు. సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడంలో మీకు మీరే సహాయం చేసుకుంటారు. మీ ఆదాయం పెరిగే సంకేతాలు ఉన్నాయి. మీరు మీ ఆహారం మరియు అలవాట్ల గురించి జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మీకు కడుపు సమస్యలు ఉండవచ్చు.

పరిహారం: ఈరాశి వారు శుక్రవారం నపుంసకులకు ఏదైనా బహుమతిగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.

వృశ్చికరాశి

జూన్ నెల వృశ్చికరాశి వారికి ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. ఈ నెలలో మీరు మీ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువులో కొన్ని అంతరాయాలను ఎదుర్కోవచ్చు. మీరు మీ ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం లేకపోవడం ఉండవచ్చు. మీరు మీ తండ్రి ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. ప్రేమ సంబంధంలో ఉన్నవారు మళ్లీ మళ్లీ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఆదాయంలో స్థిరమైన పెరుగుదల సంకేతాలు ఉన్నాయి. మీకు సంపద లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్య సమస్యలను విస్మరించకూడదు.

పరిహారం: ఈ నెలలో మంచి ఫలితాలను పొందడానికి శుక్రవారం రోజున శని దేవుడి ఆలయంలో మినపప్పుని దానం చెయ్యండి.

ధనుస్సురాశి

ధనుస్సురాశి వారు వ్యాపారంలో మరియు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. మీపై పని ఒత్తిడి కూడా పెరగవచ్చు. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ నెలలో విద్యార్థులు పదేపదే ఏకాగ్రతను కోల్పోవచ్చు. మీకు శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో అసమతుల్యత సంకేతాలు ఉన్నాయి. మీ ప్రేమికుడితో మీకు కొంత వాదన ఉండవచ్చు. వైవాహిక సంబంధాలలో ఉద్రిక్తత మరియు సంఘర్షణ పెరగవచ్చు. మీరు కుటుంబ ఆస్తి నుండి సంపద మరియు ఆనందాన్ని పొందవచ్చు. మీ ఆదాయంతో మీరు ఆస్తిని పెంచుకోవచ్చు. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

పరిహారం: గురువారం రోజున అరటిపండు మరియు రావి చెట్టును నాటండి.

మకరరాశి

ఈ నెలలో మీరు సోమరితనానికి దూరంగా ఉండటం మంచిది. వ్యాపారం మరియు వైవాహిక సంబంధాలలో ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంది. మీ ప్రవర్తనలో కోపం కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు మీ కార్యాలయంలోని ప్రతి పనిని బాగా చేస్తారు. ఈ సమయంలో మీకు కొత్త ఉద్యోగ అవకాశం లభించవచ్చు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు తమ భాగస్వామితో చెడు సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. మీరు విద్యలో ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీరు ప్రేమ సంబంధంలో ఉనట్టు అయితే, ఈ నెల ప్రారంభంలో మీకు బాగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సోమరితనం చెందవద్దని మీకు సలహా ఇవ్వబడింది. జూన్ 2025 సంగ్రహలోకణం ప్రకారం ఈ నెల మొత్తం మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం: శుక్రవారం రోజున చిన్నారులకు తెల్లని రంగు ఏదైనా బహుమతిగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి.

కుంభరాశి

ఈ నెల మీకు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. ఈ నెలలో మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ నెలలో మూడవ వారంలో మరింత అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ నెలలో మీ ఇంటికి కొన్ని శుభవార్తలు రావచ్చు. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ప్రేమ పెరుగుతుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ నెలలో మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం: శుక్రవారం సాయంత్ర నల్ల నువ్వులను దానం చేయండి.

మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకునేటప్పుడు మీకు కావలసిన విధంగా ఆన్‌లైన్ పూజను జ్ఞానమున్న పూజారి చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందండి!!!

మీనరాశి

జూన్ నెలవారీ జాతకం 2025 ప్రకారం ఈ నెలలో మీరు మీ ఖర్చులు విషయం చాలా తెలివిగా ఉండాలి. మీ కృషి మరియు అవగాహనతో మీరు ఈ రంగంలో పేరు సంపాదిస్తారు, ఇతర కార్యకలాపాల కారణంగా మీరు చదువు పైన దృష్టి పెట్టడంలో ఇబ్బంది పడవచ్చు. మీ ఇంటి వాతావరణం సామరస్యపూర్వకంగా ఉంటుంది మరియు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. జూన్ 2025 సంగ్రహలోకణం ప్రకారం ఈ నెల ప్రేమ సంబంధాల పరంగా కష్టమైన సవాళ్లతో నిండి ఉంటుంది. మీ ఆదాయంలో కొంతవరకు పెరుగుదల సంకేతాలు ఉన్నాయి. మీకు కడుపు మరియు పెద్ద ప్రేగులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు.

పరిహారం: మీరు చేపలకి తిండి పెట్టండి.

జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !

మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!

తరచుగా అడుగు ప్రశ్నలు

1. జూన్ నెలలో బుధ గ్రహం ఏ రాశిలో ఉదయిస్తాడు?

మిథునరాశి.

2. జూన్ లో జగన్నాథ యాత్ర ఎప్పుడు జరగబోతుంది?

27 జూన్, 2025.

3. జూన్ నెలలో జన్మించిన వారి అదృష్ట సంఖ్య ఏంటి?

అదృష్ట సంఖ్యలు 3 మరియు 6.

Talk to Astrologer Chat with Astrologer