Talk To Astrologers

ఉత్తరాషాఢ నక్షత్రం ఫలాలు

The symbol of Uttaraashadha Nakshatra మీరు కల్చర్ తెలిసివారు, స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు మరియు మృదువుగా మాట్లాడతారు. మీ ముఖంపైనే అమాయకత్వాన్ని చూడవచ్చు. మీ సామాజిక పరిస్థితి చాలా బాగుంటుంది మరియు మీకు డాంభికాలను పెద్దగా ఇష్టపడరు. బట్టలు విషయానికి వచ్చినప్పుడు, మీరు సాధారణంగా ఉండడానికి ఇష్టపడతారు మీరు ఆధ్యాత్మికంగా ఉంటారు మరియు ఇతరులను గౌరవిస్తారు. మీ స్వభావం అనుమానాస్పదంగా ఉంటుంది. అందువల్లనే ఒక్క సమావేశంలోనే మిమ్మల్ని అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. మీ కళ్లలో ప్రకాశం ఉంటుంది మరియు ముఖంపై పుట్టుమచ్చ ఉండవచ్చు. మీరు ప్రతి పనిని నిజాయితీగా చేస్తారు మరియు మీ ఆలోచనల పట్ల మీరు స్పష్టంగా ఉంటారు. మీరు ఎన్నడూ ఇతరులను మోసగించడం లేదా ఏదైనా సమస్యను సృష్టించడం చేయరాదు. మీరు చక్కటి హృదయాన్ని కలిగి ఉండటం వల్ల, అనేకసార్లు మీరు తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటారు. మీరు ఎవరినీ సులభంగా నమ్మరు, అయితే, నమ్మడం ప్రారంభించినట్లయితే, వారి కోసం మీరు ఏదైనా చేయగలుగుతారు. మీరు సులభమైన జీవితాన్ని ఇష్టపడతారు మరియు ఎలాంటి నిర్ణయాన్ని కూడా వేగంగా తీసుకోరు. మీరు ఎవరినైనా విశ్వసించినట్లయితే, వారి వద్ద నుంచి మీరు సూచనలను తీసుకుంటారు. మీకు ఎవరిపైనైనా కోపం వచ్చినట్లయితే, మీరు పరుష పదాలను ఉపయోగించరు,అలానే మీ అసంతృప్తిని మీ పోటీదారులకు మీరు చూపించరు. మీకు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఉంటుంది. జపం, తపం, వ్రతం మొదలైనవి మిమ్మల్ని జీవితంలో విజయపథంలోనికి తీసుకెళతాయి. ఒక్కసారి మీరు ఆధ్యాత్మిక పథంలోనికి నడవడం ప్రారంభించిన తరువాత, అన్నిబంధాలు మరియు వైవాహిక జీవితం పట్ల విముఖత కనిపించవచ్చు. కష్టపడి పనిచేయడమే కాకుండా, మీరు నిరంతరం పని చేయడానికి ఇష్టపడతారు. విద్య లేదా పని ఇలా ఏవిషయంలోనైనా మీరు ఇతరుల కంటే ముందుంటారు. మీ బాల్యం నుంచి మీరు మీ కుటుంబం యొక్క బాధ్యతలను చేపడతారు. అయితే, మీరు యువకులుగా ఉన్నప్పుడు చక్కటి సంతోషాన్ని పొందుతారు. మీరు అన్ని సమస్యలకు సిద్ధంగా ఉంటారు. ఏదైనా సంబంధం ఏర్పరుచుకోవడానికి ముందు, ఆ వ్యక్తి గురించి మీరు బాగా తెలుసుకుంటారు, లేనిపక్షంలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనవచ్చు. 38 సంవత్సరాల వయస్సు తరువాత, మీరు ప్రతిచోటా కూడా విజయం సాధిస్తారు. మీ జీవితభాగస్వామికి బాధ్యత మరియు ప్రేమ ఉంటాయి, అయితే అతడి/ఆమె ఆరోగ్యం మీకు ఆందోళన కలిగించవచ్చు. కళ్లు మరియు పొట్టకు సంంధించిన ఆరోగ్య సమస్యలు మీకు ఆందోళన కలిగించవచ్చు. అందువల్ల, ఈ దిశగా మీరు అలర్ట్‌గా ఉండండి. మీకు ఆకర్షణీయమైన చూపులుంటాయి, అయితే, మీరు స్వభావరీత్యా మొండివారు. అనవసరమైన వాదనలకు దిగరాదు. మీరు బాగా చదువుకుంటారు మరియు టీచింగ్ లేదా బ్యాంకింగ్ రంగాల్లో మీరు అపరిమితైన విజయాన్ని సాధిస్తారు.

విద్య మరియు ఆదాయం

మీకు అనుకూలమైన వృత్తులు లెక్చరర్ లేదా బోధకుడు; యాజకుడు; వ్యాఖ్యాత; జ్యోతిష్కుడు; న్యాయవాది; జడ్జి; ప్రజా సేవకుడు; మనస్తత్వం; సైనిక-సంబంధిత పని; పశుసంరక్షణ; కుస్తీ; బాక్సర్; జూడో; కరాటే; అథ్లెట్; గురువు; సెక్యూరిటీ విభాగం; అంగరక్షకుడు; ఆధ్యాత్మికం, వైద్యురాలు; రాజకీయం; వ్యాపార; బ్యాంకింగ్; మొదలైనవి

కుటుంబ జీవితం

మీ కుటుంబ జీవితం బాగుంటుంది అయితే, మీ జీవితభాగస్వామి నుంచి మీరు నిరంతరం సమస్యలు ఎదుర్కొనవచ్చు. జీవితభాగస్వామి చక్కటి స్వభావం కలిగి ఉండి, సామాజికంగా ఉంటారు. మీ పిల్లలు చక్కటి విద్యను పొందుతారు, అయితే, వారిద్వారా కొన్ని విజయాలు సాధించే అవకాశం ఉంది.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer