దేవశయని ఏకాదశి 2025

Author: K Sowmya | Updated Thu, 03 Jul 2025 09:26 AM IST

ఈ ఆస్ట్రోసేజ్ ఏఐ యొక్క ఆర్టికల్ లో దేవశయని ఏకాదశి 2025 ఉపవాసం గురించి, దాని ప్రాముఖ్యత, వ్రత కథ, పూజ విధి మరియు కొన్ని నివారణలతో పాటు ప్రతీదీ తెలుసుకుంటాము. సనాతన ధర్మంలో ఏకాదశి తీతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మరియు వాటిలో 2025 దేవశయని ఏకాదశి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. దేవశయని ఏకాదశి ఆశాఢ శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిలో వస్తుంది మరియు దీనిని హరిశయని ఏకాదశి లేదంటే యోగ నిద్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు.


కాల్‌లో ఉత్తమ జ్యోతిష్కు ల నుండి మీ జీవితంపై కుజుడు సంచారం ప్రభావాన్ని తెలుసుకోండి!

విష్ణువు క్షీర సాగరంలో యోగా నిద్రలోకి వెళ్లి నాలుగు నెలలు విశ్రాంతి తీసుకునే ఈరోజు నుండి చాతుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈరోజున ఉపవాసం, పూజ మరియు భక్తిని పాటించడం వల్ల పాపాల నుండి విముక్తి లభించడమే కాకుండా, మోక్షానికి మార్గం సుగమం అవుతుంది. ఈ ఉపవాసం ఒక వ్యక్తికి నిగ్రహం, విశ్వాసం మరియు సేవ యొక్క పాటాన్ని నేర్పుతుంది.

2025 దేవశయని ఏకాదశి: ఉపవాసం పాటించే తేదీలు

వేద క్యాలెండర్ ప్రకారం ఆశాడ మాసంలోని శకల పక్షం ఏకాదశి తిథి జులై 05న సాయంత్రం 07:01 గంటలకి ప్రారంభం అయ్యి మరుసటి రోజు అంటే జులై 06న రాత్రి 09:17 గంటలకి ముగుస్తుంది. సనాతన ధర్మంలో సూర్యోదయ తీతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జులై 06న దేవశయని ఏకాదశి పాటిస్తారు. ఈరోజు నుండి చాతుర్మాసం ప్రారంభం అవుతుంది.

ఆశది ఏకాదశి పరణ ముహూర్తం: జులై 0705:28 am నుండి 08:15 am వరకు.

సమయం: 2 గంటల 46 నిమిషాలు

కాల సర్ప యోగా - కాల సర్ప యోగా కాలిక్యులేటర్

చాతుర్మాసం వ్యవధి

మత విశ్వాసాల ప్రకారం ఆశాఢ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి రోజున శ్రీమహావిష్ణువు క్షీర సాగర్ లో నిద్రపోతాడు. దీనితో చాతుర్మాసం ప్రారంభమవుతుంది మరియు కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున శ్రీ హరి క్షీర సాగర్ నుండి మేలుకుంటాడు. దేవశయని ఏకాదశిని ఈ తేదీన జరుపుకుంటారు. ఈసారి చాతుర్మాసం జులై 06 నుండి ప్రారంభం అయ్యి నవంబర్ 01న ముగుస్తుంది.

2025 దేవశయని ఏకాదశి ప్రాముఖ్యత

దేవశయని ఏకాదశి 2025 సనాతన ధర్మంలో అపారమైన ఆధ్యాత్మిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున విష్ణువు క్షీర సాగరంలోని యోగ్నిద్రలోకి వెళ్లి నాలుగు నెలలు విశ్రాంతి తీసుకుంటాడు, దీనిని చాతుర్మాసం అంటారు. ఈ సమయం సాధన, తపస్సు మరియు మతపరమైన క్రమశిక్షణను సూచిస్తుంది. ఈరోజున విష్ణువుని ఉపవాసం ఉండి పూజించడం ద్వారా, సాధకుడు పాపాల నుండి విముక్తి పొందుతాడు, కర్మల నుండి శుద్ది పొందుతాడు అలాగే మోక్షాన్ని పొందుతాడు. తమ ప్రాపంచిక కోరికలను అధిగమించి స్వయం సంక్షేమం వైపు పయనించాలి అనుకునే భక్తులకి ఈరోజు ప్రత్యేకమైనది.

దేవశయని ఏకాదశి నుండి వివాహం, గృహప్రవేశం, క్షౌరము మొదలైన శుభ కార్యాలను కూడా నాలుగు నెలల పాటు నిలిపివేస్తారు. ఈ సమయం ఆధ్యాత్మికత, భక్తి మరియు స్వీయ నియంత్రణకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం పాటించడం ద్వారా ఒక వ్యక్తి జీవితం సమతుల్యంగా, ప్రశాంతంగా మరియు ధర్మబద్దంగా మారుతుంది.

వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025 !

దేవశయని ఏకాదశి మతపరమైన ప్రాముఖ్యత

2025 దేవశయని ఏకాదశి దీనిని ఆశాఢ శుక్ల ఏకాదశి అని కూడా పిలుస్తారు, దీనిని సనాతన ధర్మంలో చాలా పవిత్రమైనది మరియు ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈరోజు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లాడాన్ని సూచిస్తుంది మరియు ఇది చాతుర్మాసం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈరోజున విష్ణువు క్షీర సాగరంలోని శేషనాగులో నిద్రపోతాడు. ఆయన నాలుగు నెలలు నిద్రలో ఉండి కార్తీక శుక్ల ఏకాదశి రోజున మేలుకుంటాడు. ఈ సమయాన్ని చాతుర్మాసం అంటారు. చాతుర్మాసం సాదన, ఉపవాసం, నిగ్రహం, సేవ మరియు తపస్సు కోసం సమయం. వివాహం, గృహప్రవేశం, క్షవరం వంటి శుభ కార్యాలు ఈ సమయంలో నిర్వహించబడవు.

2025 దేవశయని ఏకాదశి: ఉపవాస సమయంలో పూజ

విష్ణువుకి దేవశయని ఏకాదశిని అంకితం చేయబడింది. ఈరోజున భక్తులు పూర్తి భక్తితో ఉపవాసం ఉండి, నియమాలను పాటిస్తారు మరియు విష్ణువును నిద్రపుచ్చుతారు. దేవశయని ఏకాదశి పూజ పద్దతిని తెలుసుకుందాము.

దశమి నుండి సాత్విక ఆహారం తిని రాత్రికి ఒకసారి మాత్రమే తినండి. రాత్రి బ్రహ్మచర్యాన్ని అనుసరించండి మరియు మీ మనస్సులో విష్ణువుని స్మరించుకోండి.

సూర్యోదయానికి ముందుగానే లేచి, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. ఇంట్లో పూజా స్థలాన్ని గంగాజలం లేదంటే స్వచ్చమైన నీటితో శుభ్రం చెయ్యండి.

దీని తరువాత ఉపవాసం ఉండాలని ప్రతిజ్ఞ చెయ్యండి. విష్ణువు విగ్రహం లేదంటే చిత్రపటాన్ని నీటితో శుభ్రం చేసుకోండి. పసుపు రంగు దుస్తులు, పువ్వులు, తులసి ఆకులు, గంధం, ధూపం కర్రలు మరియు దీపాలను సమర్పించండి.

విష్ణు సహస్రనామం లేదంటే విష్ణు చాలీసా, శ్రీ హరి స్తోత్రం, విష్ణు సహస్రనామం పారాయణం చెయ్యండి.

రాత్రిపూట దేవుడి కథ వినండి, భజనలు మరియు కీర్తనలు చెయ్యండి.

మరుసటి రోజు ద్వాదశి తిథి రోజున బ్రాహ్మణులకి భోజనం నైవేద్యం పెట్టి, దక్షిణ ఇచ్చి ఉపవాసం విరమించండి.

మీ కెరీర్ గురించి ఆందోళన చెందుతున్నారా, ఇప్పుడే కాగ్నిఆస్ట్రో రిపోర్ట్ ఆర్డర్ చేయండి !

2025 దేవశయని ఏకాదశి: జానపద కథలు

దేవశయని ఏకాదశి ఉపవాసం యొక్క కథ చాలా పవిత్రమైనది మరియు బోధనాత్మకమైనదిగా పరిగణించబడుతుంది. పురణాల ప్రకారం పురాతన కాలంలో మాంధాత అనే మహానుభావుడు మరియు భక్తిపరుడైన రాజు పరిపాలించాడు. అతని రాజ్యంలో ప్రజలు సంతోషంగా మరియు సంతృప్తి చెందారు, కానీ ఒకసారి భయంకరమైన కరువు వచ్చింది. చాలా సంవస్త్రాలుగా వర్షం లేకపోవడం వల్ల, ప్రజలు ఆకలి మరియు దాహంతో బాధపడటం మొదలయ్యింది. రాజు చాలా ప్రయత్నాలు చేశాడు, యజ్ఞాలు చేశాడు, కానీ ప్రయోజనం లేకపోయింది.

తర్వాత అతను మహర్షి అంగీర వద్దకు వెళ్లి తన ఆందోళనను వ్యక్తం చేశాడు. ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున దేవశయని ఏకాదశి 2025 ఉపవాసం ఉండాలని మహర్షి అంగీర సలహా ఇచ్చాడు. రాజు పూర్తి ఆచారాలతో ఈ ఉపవాసం, రాత్రిపూట మేలుకుని విష్ణువు భక్తిలో మునిగిపోయాడు. అతని రాజ్యంలో భారీ వర్షం కురిసింది మరియు కరువు ముగిసింది.

ఈ ఉపవాసం ప్రకృతి వైపరీత్యాలను తొలగించడమే కాకుండా, పాపాలను కూడా తొలగిస్తుంది మరియు జీవితంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును తెస్తుంది. ఈరోజు నుండి విష్ణువు నాలుగు నెలలు యోగ నిద్రలోకి వెళ్తాడు, దీనిని చాతుర్మాసం అంటారు. ఈ ఏకాదశి చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది.

దేవశయని ఏకాదశి: చేయవలసినవి మరియు చేయకూడనివి

ఈ పవిత్రమైన రోజున విష్ణువు నుండి శుభ ఫలితాలు మరియు ఆశీర్వాదాలు పొందడానికి కొన్ని పనులు చెయ్యడం అవసరం, మరికొన్నింటికి దూరంగా ఉండాలి. ఈరోజున ఏమి చెయ్యాలో మరియు ఏమి చెయ్యకూడదో తెలుసుకుందాము.

చెయ్యాల్సినవి

ఈరోజున ఉదయమే స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, ఆచారాల ప్రకారం విష్ణువుని పూజించండి.

నీళ్లు లేదా పళ్ళని తింటూ ఉపవాసం చెయ్యండి.

తులసిని పూజించడం మరియు తులసి ఆకులు అర్పించడం చాల పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

రాత్రిపూట భక్తితో మేలుకుని ఉండటం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

బ్రాహ్మణులకి మరియు పేదలకు ఆహరం, ఆహరం, బట్టలు లేదంటే డబ్బుని దానం చెయ్యండి.

చెయ్యకూడనివి

ఈరోజున బియ్యం లేదంటే ధాన్యాలు తినడం నిషిద్దం. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి మరియు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి.

ఈ రోజున మాంసం మరియు మద్యం నివారించండి. వాటిని తినడం వల్ల పాపం జరుగుతుంది.

అబద్దం చెప్పకండి స్వచ్చమైన ఆలోచనలు కలిగి ఉండటం ఈరోజు చాలా అవసరం.

ఈరోజున రాత్రిపూట తులసిని తాకకండి.

ఈ ఉపవాసం బ్రహ్మచర్యాన్ని అనుసరించడానికి ప్రేరేపిస్తుంది.

తిట్టడం, అపవాదు చెప్పడం, దోగాతనం వంటి ఖండించదగిన లేదంటే అపవిత్రమైన పనులను చేయవొద్దు.

మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకునేటప్పుడు మీకు కావలసిన విధంగా ఆన్‌లైన్ పూజను జ్ఞానమున్న పూజారి చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందండి!!!

దేవశయని ఏకాదశి: రాశిచక్రం వారీగా నివారణలు

మేషరాశి

ఈరోజున విష్ణువుకి ఎర్ర చందన తిలకం చేసి, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు మరియు పనిలో విజయం పొందుతారు.

వృషభరాశి

వృషభరాశిలో జన్మించిన స్థానికులు ఈరోజున ఆవులకి పచ్చిమేత తినిపించి, విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి. కుటుంబ ఆనందం మరియు ఆర్టిక లాభాలు లభిస్తాయి.

మిథునరాశి

ఈరోజున మిథునరాశిలో జన్మించిన స్థానికులు తులసి మొక్క దెగ్గర పసుపు పువ్వులు అర్పించి దీపం వెలిగించాలి. మీరు మధురమైన మాటను కలిగి ఉంటారు మరియు కమ్యూనికేషన్ సంబంధిత కార్యకలాపాలో విజయం సాదిస్తారు.

కర్కాటకరాశి

కర్కాటకరాశిలో జన్మించిన వారికి ఈరోజున బియ్యం మరియు పాలు దానం చెయ్యండి. విష్ణువుకి పాలతో అభిషేకం చెయ్యండి, ఇలా చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

సింహరాశి

ఈరోజున విష్ణువుకి కుంకుమపువ్వు కలిపిన నీటితో స్నానం చేయించి, సూర్యుడికి నీరు సమర్పించండి. దీనివల్ల గౌరవం పెరుగుతుంది మరియు కొత్త ప్రాణాళికలలో విజయం లభిస్తుంది.

కన్యరాశి

ఈరోజున పేదవారికి అన్నం పెట్టండి మరియు ఓం నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించండి, దీనివల్ల కెరీర్ మెరుగుపడుతుంది కుటుంబంలో సామరస్యం కనిపిస్తుంది.

తులారాశి

ఈరోజున ఆవు నెయ్యితో దీపం వెలిగించి, విష్ణువుకి తెల్లటి పువ్వులు సమర్పించండి. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది మరియు మానసిక సమతుల్యత కాపాడబడుతుంది.

వృశ్చికరాశి

వృశ్చికరాశి స్థానికులు దేవశయని ఏకాదశి 2025రోజున పేదవారికి బట్టలు దానం చెయ్యాలి మరియు విష్ణువుకి బెల్లం నైవేద్యంగా పెట్టాలి, అందువల్ల పాఠ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది మరియు నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి.

ధనుస్సురాశి

ఈరోజున రంగు దుస్తులు ధరించి, దేవాలయంలో అరటిపండ్లు దానం చెయ్యండి, అందువల్ల గురువు ఆశీస్సులు మీకు లభిస్తాయి మరియు మీ అదృష్టం పెరుగుతుంది.

మకరరాశి

మకరరాశి స్థానికులు ఈరోజున వృద్ద బ్రహ్మణుడికి ఆహారం మరియు దక్షిణ ఇవ్వాలి. విష్ణు చాలీసా పారాయణం చెయ్యండి. కార్యాలయంలో స్థిరత్వం లభిస్తుంది మరియు స్థానికులు అప్పుల నుండి విముక్తిని పొందుతారు.

కుంభరాశి

ఈరోజున పేడ పిల్లలకి విద్యా సామగ్రిని దానం చెయ్యండి మరియు విష్ణువుకి పంచామృతం సమర్పించండి, దాని ద్వారా విద్య మరియు మేధో కార్యకలాపాలలో విజయాన్ని సాదిస్తారు.

మీనరాశి

దేవశయని ఏకాదశి 2025సమయంలో మీనరాశిలో జన్మించిన స్థానికులు ఈరోజున గంగా జలాన్ని నీటిలో కలిపి స్నానం చేసి, పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చెయ్యాలి, అందువల్ల ఆధ్యాత్మిక పురోగతి మరియు కుటుంబ శ్రేయస్సు కొనసాగుతుంది.

జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !

మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!

తరచుగా అడుగు ప్రశ్నలు

1.2025 దేవశయని ఏకాదశి ఉపవాసం ఎప్పుడు?

జులై 06, 2025న.

2.దేవశయని ఏకాదశిని ఎందుకు జరుపుకుంటారు?

దేవశయని ఏకాదశిని విష్ణువు మరియు లక్ష్మీదేవికి అంకితం చేస్తారు.

3.నాలుగు ముఖ్య ఏకాదశులు ఏవి?

నిర్జల ఏకాదశి, మోక్షద ఏకాదశి, కామిక ఏకాదశి మరియు దేవుతని ఏకాదశి.

Talk to Astrologer Chat with Astrologer