కన్యారాశిలో రెండు ముఖ్యమైన సంచారములు - ప్రభావములు
రాబోయే సెప్టెంబర్ నెలలో కన్యారాశిలో పెద్ద అల్లకల్లోలం ఉంటుంది.వాస్తవానికి, ఈ సమయంలో, బుధుడు కన్యారాశిలో తిరోగమన స్థితిలో ఉంటాడు, మరొక వైపు ఈ రాశిలో సూర్యుడు-శుక్ర కలయిక ఉంటుంది.కాబట్టి, ఈ సంయోగం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది, సూర్యుడు-శుక్ర కలయిక ద్వారా ఏ యోగం ఏర్పడుతుంది మరియు మరిన్ని.
అలాగే, సూర్యుడు, శుక్రుడు మరియు తిరోగమన బుధుల కలయిక ఏ రాశిలోని స్థానికులకు శుభప్రదంగా ఉంటుందో మరియు ఈ సమయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకుందాం.అన్నింటిలో మొదటిది,ఈ సంయోగం సెప్టెంబర్ లో జరిగే సమయాన్ని తెలుసుకుందాం.
బుధుడు తిరోగమనం, కన్యారాశిలో సూర్య-శుక్రులు
అనింటిలో మొదటిది, మేము కన్యారాశిలో తిరోగమన బుధుడు గురించి మాట్లాడినట్టు అయితే, అది 10 సెప్టెంబర్,2022 న జరుగుతుంది.ఈ సమయంలో, మేధస్సు మరియు ప్రసంగం యొక్క లభాదాయక గ్రహం, బుధుడు కన్యారాశిలో ఉదయం 8:42 గంటలకు తిరోగమనం చేస్తాడు.సాధారణంగా, బుధుడు తిరోగమనం కారణంగా, స్థానికుల తెలివితేటలు మరియు ప్రసంగం పై భారీ ప్రభావం చూపుతుంది.
దీని తర్వాత, సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తాడు.జ్యోతిష్యశాస్త్రంలో, సూర్యుడు ఆత్మ, తండ్రి, ప్రభుత్వ ఉద్యోగం మరియు మరిన్నిటింకి శ్రేయోభిలాషిగా పరిగణించబడ్డాడు.మేము ఈ సంచార సమయాల గురించి మాట్లాడినట్టు అయితే, 17 సెప్టెంబర్ 2022 శనివారం ఉదయం 7:11 గంటలకు సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తాడు.
దీని తర్వాత, చివరికి, సెప్టెంబర్ 24 న, శుక్రుడు కన్యారాశిలో సంచరిస్తాడు.జ్యోతిష్య శాస్త్రంలో, శుక్రుడు ఆనందం, విలాసం, అందం మరియు మరెన్నో దాతగా పరిగణించబడ్డాడు.
కాబట్టి, మనం ఈ చాలా ముఖ్యమైన శుక్ర సంచార వ్యవధి గురించి మాట్లాడినట్టు అయితే, అది 24 సెప్టెంబర్ 2022 శనివారం రాత్రి 8:51 గంటలకు జరుగుతుంది.
కన్యారాశిలో సూర్య-శుక్ర సంయోగం
కన్యారాశిలో ఈ సంయోగం కూడా చాలా ముఖ్యమైనది, ఎందుకంటే జ్యోతిష్యశాస్త్రంలో ఇది ఒక ప్రత్యేక సంయోగం, ఇక్కడ రెండు గ్రహాలు కలిసి ఉండటం శుభప్రదం కానీ ప్రభావాలు అశుభం.ఎందుకంటే ఏదైనా గ్రహం సూర్యుని దగ్గరికి వచ్చినప్పుడు దాని దహనం వల్ల అది శుభ ఫలితలాను ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోతుంది.అదేవిధంగా, శుక్రుడు సూర్యునితో కలిసినప్పుడు దాని ఫలితాలు క్షీణించబడతాయి.వివాహిత జంటలకు సూర్య-శుక్ర సంయోగం కూడా అనుకూలమైనదిగా పరిగణించబడదు.
సూర్య-శుక్ర సంయోగం నుండి యోగం ఎర్పడటాన్ని “ యుతి యోగం” అంటారు.మేము ఇంతకు ముందు కూడా మీకు వివరించినట్టుగా, ఈ కలయిక వివాహిత జంటలకు తగినదిగా పరిగణించబడదు.అటువంటి పరిస్థితులలో, వారి జాతకాలలో సూర్య-శుక్ర కలయిక ఉన్న స్థానికుల వారి వైవాహిక జీవితంలో అనేక సవాళ్ళను మరియు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.వారు వివాహం చేసుకోకపోతే వారి వివాహంలో జాప్యం జరుగుతుంది మరియు కొన్నిసార్లు వారు శుక్రుడికి సంబంధించిన వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్ద్రుష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం
సూర్య శుక్ర సంయోగం: అర్థం & నివారణలు
ఒకవైపు, శుక్రుడు ప్రేమ, అందం మరియు కళాత్మక యొక్క శ్రేయోభిలాషిగా పరిగణించబడుతున్నాడు, మరోవైపు, సూర్యుడు ఆత్మ, తండ్రి మరియు మరెన్నో దాతగా పరిగణించబడుతుంది.కాబట్టి, రెండు గ్రహాలు కలిసి వచ్చినప్పుడు స్థానికుల జీవితంలోని వివిధ దశల పై వేర్వేరు ప్రభావాలు ఉంటాయి.
అయితే, ఈ సంయోగం వారి వ్యక్తిత్వాన్ని మేరుగుపరచాలనుకునే స్థానికులకు నిరూపితమైన విగ్రహం కావొచ్చు.మరోవైపు, ఈ సంయోగం కారణంగా, స్థానికులు తమ సంబంధాలలో శాంతి మరియు సామరస్యాన్ని కాపాడుకోవడానికి కష్టపడవలసి వస్తుంది.
- సూర్య-శుక్ర కలయిక వల్ల స్థానికుల మధ్య పరస్పర అవగాహన లోపం ఎర్పడవొచ్చు.
- ఇది కాకుండా, జీవితంలోని వివిధ రంగాలలో హెచ్చు తగ్గులు సంభవించే అవకాశం ఉంది.
- ఈ సంయోగంలో శుక్రుడి కంటే సూర్యుడు మరింత ప్రభావవంతంగా ఉంటాడు, కాబట్టి సంభందంలో అహం లేదా ఇతర సమస్యలకు బలమైన అవకాశం ఉంది.
- దీనితో పాటు, సూర్య-శుక్ర సంయోగం జీవితంలో సవాళ్ళను ఎలా గెలవాలో నేర్పుతుంది.మరోవైపు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలను బలోపేతం చేయడానికి మీ అహాన్ని దూరంగా ఉంచడం ఎంత ముఖ్యమో కూడా ఈ సమయంలో మీరు అర్థం చేసుకుంటారు.
మీ కెరీర్ గురించి చింతిస్తున్నారా, ఇప్పుడే కాగ్నిఆస్ట్రో నివేదికను ఆర్డర్ చేయండి!
సూర్య-శుక్ర సంయోగానికి త్వరిత నివారణలు
- మీ తండ్రి ని గౌరవించండి.
- తాజాగా తయారు చేసిన చపాతీలను ఆవులకు అందించండి.
- సూర్య నమస్కారం చేయండి మరియు సూర్యునికి నీటిని సమర్పించండి.
- సకల ఆచారాలతో దుర్గ మాతను పూజించండి.
- ఏదైనా బంగారు ఆభరణాన్ని ధరించండి.
- ఇది కాకుండా, మీరు కోరుకుంటే, మీరు స్వచ్చమైన వెండి ఉంగరాన్ని కూడా ధరించవొచ్చు.
- పాలు, కొబ్బరి దానం చేయండి .
సూర్య-శుక్ర కలయిక ప్రభావం
మేము అన్ని రాశిచక్ర గుర్తుల పై సూర్య-శుక్ర సంయోగం యొక్క ప్రభావం గురించి మాట్లాడినట్టు అయితే.
మేషం: ఈ సమయంలో మీ ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి.
వృషభం: జాగ్రత్తగా ఉండండి! మీ జీవితంలో ఏదైనా పెద్ద విషాద వార్త రావొచ్చు.
మిథునం: మీరు ప్రభుత్వం నుండి ప్రయోజనాలను పొందవొచ్చు మరియు ఈ ప్రయోజనం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
కర్కాటకం: ఈ కాలంలో మీరు మీ అధికారంలో పెరుగుదలను చూస్తారు.
సింహం: ఉద్యోగ పరంగా సమయం అనుకూలంగా ఉంటుంది.ఈ సమయంలో, మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కన్య: మీ జీవితంలో పెద్ద మరియు ఆకస్మిక మార్పు ఉండవొచ్చు.
తుల: వ్యాపారస్తులకు సమయం చాలా బాగుంటుంది.మీరు మీ వ్యాపారంలో అభివృద్దిని చూస్తారు.
వృశ్చికం:ఈ సమయం శత్రువులను జయించడానికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
ధనుస్సు:ఈ కాలంలో, మీ కీర్తి, పెరుగుదల మరియు మీ పిల్లల వైపు నుండి సంతోషం కోసం బలమైన యోగాలు ఏర్పడతాయి.
మకరం: ఈ సమయం మీ రోజువారి జీవనశైలికి అనుకూలంగా ఉంటుంది, అయితే కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు మరియు వివాదాలు కనిపించవొచ్చు.
కుంభం:మీ ఆగిపోయిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.
మీనం: మీరు కొన్ని శుభ కార్యాలకు డబ్బు ఖర్చు చేయవొచ్చు.
జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి:ఆస్ట్రోసేజ్ ఆన్లైన్ షాపింగ్ స్టోర్
ఆస్ట్రోసేజ్ తో కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు!