Rasi Phalalu 2012 - Telugu Astrology 2012 - Telugu Horoscope 2012
మేషం | వృషభం | మిథునం | కర్కాటకం |
సింహం | కన్య | తుల | వృశ్చికం |
ధనుస్సు | మకరం | కుంభం | మీనం |
మేషం (చు, చే, చో, లా, లి, లు, లే, ఒక, టేక్)
జనవరి - కొత్త సంవత్సరంలో ఏదైనా ముఖ్యమైన పని చేయబోయే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీరు తింటున్న ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండడంతోపాటు వ్యాయామం చేయడం తప్పనిసరి. మీ మిత్రుల సహాయం లేకుండా గమ్యాన్ని చేరడం కష్టం, అందువల్ల వారితో సత్సంబంధాలు కొనసాగించండి. దైవ ప్రార్ధనవల్ల మనశ్శాంతి కలగడంతోపాటు కష్టాలు దూరమవుతాయి.
ఫిబ్రవరి- ఈ మాసం అత్యంత జాగరూకత వహించాలి. మీ శత్రువు మీకు హాని కలిగించడంలో సఫలమయ్యే అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు రావచ్చు. నెలాఖరులో ఆర్ధికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. అయితే మీరు కలిసే ఒక వ్యక్తి మీకు జీవితంలో దిశానిర్దేశం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది.
మార్చి- మీ నూతన గృహనిర్మాణం పూర్తవుతుంది. వ్యాపారం సాఫీగా సాగుతుంది. రాజకీయరంగంలో మీ ప్రాబల్యం పెరుగుతుండి. శత్రువులు మీకు ఎటువంటి అవకాశం ఇవ్వరు, వారిదే పైచేయిగా ఉండే అవకాశం. ఎటువంటి న్యాయపరమైన విభేదాలలోను చిక్కుకోకుండా జాగ్రత్త వహించండి. కొన్ని ప్రత్యేక రంగాల్లోని వ్యాపారులకు లాభాలు కలిసివస్తాయి.
ఏప్రిల్- ఈ మాసం విజయం మీదే. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మీ స్నేహబాంధవ్యాలకు అన్ని రకాలుగా కలిసి వచ్చే మాసం. చిరకాల మిత్రుడ్ని అకస్మాత్తుగా కలుసుకుంటారు. ఆ కలయిక మీకు లాభం చేకూర్చుతుంది. దీర్ఘకాలంగా మిమ్మల్ని బాధపెట్టే అనారోగ్యం దూరమవుతుంది. ఎవరికీ అప్పు ఇవ్వకండి, ఇస్తే తిరిగి పొందడం చాలా కష్టం.
మే- ఈ మాసం మీకు అంత ఆశాజనకంగా ఉండదు. ఏవైనా పనులు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి, ముఖ్యంగా మహిళలకు. ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళి దైవ ప్రార్ధన, ధ్యానం చేయండి. దీనివల్ల నెలాఖరునాటికి సమస్యలు కొంతవరకు తగ్గుతాయి.
జూన్- మీకిక సమస్యలు దూరమైనట్లే. గతంలో చేసిన పనులవల్ల మీకు లాభం చేకూరుతుంది. మీరు నూతన కార్యక్రమాలు ప్రారంభించవచ్చు. స్నేహితులు మీకు అండగా ఉంటామని నిరూపిస్తారు, అయితే ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. లేకపోతే భవిష్యత్తులో బాధపడవలసి వస్తుంది. కుటుంబంలో స్వల్ప సమస్యలు ఎదురవుతాయి. ఆర్ధిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి.
జులై- ఇది మీకు సంతోషకరమైన సమయం. విందులు, వినోదాలకు సిద్దంగా ఉండండి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభ్యం. అత్తగారింట్లో ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు అత్యంత లాభదాయకమైన సమయం. మీరు చేసే పనికి సమాజంలో మీపై ప్రశంసల జల్లు కురుస్తుంది. మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్దులకు కూడా అనుకూలమైన సమయం.
ఆగస్టు- ఇంటికి నూతన శిశువుకు ఆహ్వానం పలికే అవకాశాలు. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి. పాత సమస్య కొత్త రూపంలో వస్తుంది. స్నేహితులతో కలిసి నూతన వ్యాపారం ప్రారంభించే అవకాశం. ఉద్యోగులు తమ ఉద్యోగంలో అత్యున్నత విజయం సాధిస్తారు.
సెప్టెంబర్- ఇతరులు మిత్రులుగా మారినా, శత్రువులుగా మారినా దానికి కారణం మీ మాటలే, అందువల్ల మాట్లాడేముందు జాగరూకత వహించండి. ఈ మాసం మహిళలకు కలసివస్తుంది. పొంచిఉన్న శత్రువులను ఒక కంట కనిపెడుతుండడం ఎంతో అవసరం. అందరికీ అధిక శ్రమ తప్పదు, ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. విద్యార్ధులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
అక్టోబర్- ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభంలో అంతా శుభమే జరిగినా, నెలాఖరులో కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. దూరప్రయాణాలు లాభదాయకమే కానీ, అందుకు ఎంతో ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా సఫలం కాలేరు.
నవంబర్- లాభమూ ఉండదు, నష్టమూ ఉండదు. ఈ మాసమంతా సాఫీగా సాగిపోతుంది. ఇంటికి శుభకరమైన వస్తువులు ఖరీదు చేస్తారు. ప్రయాణాలకు, విందు, వినోదాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు. శత్రువుల విషయంలో జాగ్రత్త.
డిసెంబర్- ఈ మాసం ఆకస్మిక ధన లాభం. మీకు శిరోభారంగా మారిన పాత అప్పులను పూర్తిగా తీర్చివేస్తారు. మీరు చేయాలనుకుని చేయలేని పనులన్నీ ఈ నెలలో వాస్తవరూపం దాల్చుతాయి. ఇది మీ విజయాలలో ఒక అత్యుత్తమమైనదిగా మిగిలిపోతుంది.
వృషభం (ఇ, ఉ, ఎ, ఒ, వా, వీ, వూ, వే, వో)
జనవరి - ఈ మాసం ఒక ప్రాముఖ్యమైన విషయం జరిగే అవకాశం. రాజకీయాలపై ఆసక్తి మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచుతుంది. సంగీతం, సాహిత్య కళల్లో మీకున్న అభిరుచి వల్ల మీరు అత్యంత లాభాలను పొందుతారు. మాసం రెండో భాగంలో అయ్యే అధిక ఖర్చులు మీ పొదుపుపై అత్యధిక ప్రభావం చూపిస్తాయి. ఒక వెండి గిన్నెలో నిండుగా పారుతున్న నదీజలాలను పోసి ఉంచితే మీకు లాభం చేకూరుతుంది.
ఫిబ్రవరి - ఈ మాసంలో 'సంచరించే గ్రహాల' వల్ల మధ్యంతర ఫలితాలు ఉంటాయి. లలిత కళల్లో అభిరుచి పెరుగుతుంది. ఇంటికి బంధువుల రాకతో ఆనందోత్సాహాలతో గడుపుతారు. తలపెట్టిన కార్యాల్లో విజయం సాధించినా అందుకు ఎంతో శ్రమపడవలసి ఉంటుంది. జీవితంలో సత్ఫలితాలు సాధించడానికి సహోద్యోగులు, ప్రముఖ అధికారులతో సత్సంబంధాలు ఎంతో అవసరం. మీ నైపుణ్యంతో పరిస్థితులను నేర్పుగా అదుపులో ఉంచగలుగుతారు.
మార్చి - కుటుంబసభ్యుల సహకారం మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటారు. విద్యార్దులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యాపారులకు అన్నింటా విజయమే.
ఏప్రిల్ - అదృష్టం మీ తలుపు తట్టే సమయం, సిద్దంగా ఉండండి. ఉద్యోగులు, వ్యాపారులకు తమ వృత్తులలో అభివృద్ధి, ప్రయాణావకాశాలు. అయితే దానివల్ల త్వరగా అలసిపోతారు. ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. విద్యార్దులు ఏకాగ్రతకోసం అధికంగా శ్రమపడవలసి వస్తుంది.
మే - ఈ మాసం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు అత్యంత లాభాలను ఆర్జించిపెడతాయి. భావోద్వేగాలు మంచిదే అయినా, మరీ అధికంగా ఉండకుండా అదుపులో ఉంచుకోవాలి. సుఖశాంతులు, ధన లాభానికి సంకేతం. మోకాళ్ళ నొప్పులు, ఎముకల పెళుసు వల్ల శస్త్రచికిత్సలకు అవకాశం. వ్యాపారం లేదా ఉద్యోగంలో మార్పులవల్ల కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చు.
జూన్ - జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ప్రయాణాలు చేసేముందు దైవ నామస్మరణ తప్పనిసరి. వాహనాలు నడిపేటప్పుడు మెళకువ అవసరం. తినే ఆహారంపై దృష్టి ఉంచండి. ఈ మాసంలో ఒక శుభవార్త వింటారు.
జులై - అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. పోటీలో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మహిళల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నడుమునొప్పి వచ్చే అవకాశం. మీ వృత్తిలో విజయంతో లాభాలు ఆర్జిస్తారు. స్వల్ప అనారోగ్యం. విద్యార్ధులు మంచి ఫలితాలు సాధిస్తారు.
ఆగస్టు - మీ జీవితంలో ఉరకలువేసే నూతన ఉత్సాహానికి ఆహ్వానం. సోదర, సోదరీమణుల సహకారంతో మీ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. వ్యాపారులు తమ వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్థులు తమ విజయాలకోసం నూతన మార్గాల్లో పయనిస్తారు.
సెప్టెంబర్ - వాతావరణంలో మార్పులవల్ల అనారోగ్యానికి గురవుతారు. దూరపు బంధువుల రాక. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సమస్యల్లో చిక్కుకుంటారు. లాటరీవల్ల ధనలాభం.
అక్టోబర్ - మీకు వ్యతిరేకంగా ఎవరో కుట్రలు పన్నుతున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మీకు హానికరం తప్పదు. మీ చుట్టూ ఏదో శుభకార్యానికి రంగం సిధ్ధమవుతోది. ప్రతి పనికి మీరు చాలా శ్రమపడవలసి ఉంటుంది, అయితే దానికి తగ్గ ఫలితం దక్కుతుంది.
నవంబర్ - గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఏ పనైనా హడావిడిగా చేయడం మానుకోండి, లేదంటే సమస్యలు తప్పవు. మీరు మాటలను నియంత్రించుకోవడం అవసరం. అనవసరమైన వాగ్వాదాలకు దిగవద్దు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. మీరు చేస్తున్న ఖర్చుపై దృష్టి సారించండి.
డిసెంబర్ - ఈ మాసంలో అన్ని రకాలుగా అభివృధ్ధి గోచరిస్తుంది. ఆర్ధికంగా కూడా అభివృధ్ధి ఉంటుంది. కొనుగోళ్ళకు సమయం అనుకూలం. దీర్ఘకాలపు లాభాలు ఆర్జించే పనులకు శ్రీకారం. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వైవాహిక జీవితంలో తీపి-చేదు అనుభవాలు ఉంటాయి. విద్యార్ధులు బాగా శ్రమపడాలి.
మిథునం (కా, కీ, కు, ఘ, ఛ, కే, కూ, హా)
జనవరి - ఇది కొంచెం కష్టకాలం. జీవితంలో జరుగుతున్న విషయాలపై ఆసక్తి ఉండదు. కష్టపడడానికి బదులు పనులు జరగడంలేదన్న చింత మీ మనసులో గూడు కట్టుకుని ఉంటుంది. మీకు నమ్మకమైన వ్యక్తివల్ల మోసపోయే అవకాశాలు.
ఫిబ్రవరి - పరిసరాలు ఆనందకరంగా ఉంటాయి. ఇతరుల సమస్యలలో అనవసరంగా తలదూర్చవద్దు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మీరు తలపెట్టిన కార్యాలలో విజయం సాధించలేకపోతే, మీకు నమ్మకమైన వ్యక్తుల సలహాలను స్వీకరించి పనులు చేపట్టడం మేలు.
మార్చి - మీకు మంచిరోజులు రానున్నాయి. ఒక శుభవార్త మీ జీవితంలో ఆనందోత్సాహాలను తెస్తుంది. పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోండి. నూతన ఆర్ధికావకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. గృహంలో శాంతి నెలకొంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులు లాభాలు గడిస్తారు.
ఏప్రిల్ - జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరగనున్నాయి. స్నేహితులు మీకు అండగా ఉంటారు. విద్యార్ధులు అధికంగా శ్రమించాలి. న్యాయపరమైన సమస్యలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ మాసం స్థిరాస్థులపై ఎటువంటి పెట్టుబడులు పెట్టవద్దు.
మే- కష్టపడి పనిచేస్తే విజయం మీదే. నూతన మార్గాలలో విజయావకాశాలు లభిస్తాయి. వాతావరణంలో మార్పులువల్ల అనారోగ్యానికి గురవుతారు. తల్లిదండ్రులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. వినోదాలకోసం అధికంగా ఖర్చు చేస్తే, నెలాఖరులో ఆర్ధిక సమస్యలు తప్పవు.
జూన్ - కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. విహారయాత్రలకు వెళ్ళేందుకు ప్రయత్నించండి. శత్రువులు మీకు హాని చేసేందుకు ప్రయత్నిస్తారు. గృహంలో కొత్త సంతోషాలకు మార్గాలు. మొత్తంగా ఈ మాసం సంతృప్తికరంగా ఉంటుంది.
జులై - మీరు ఎంతోకాలంగా ఎదురుచూసే అవకాశం మీ తలుపు తడుతుంది. గతంలోని న్యాయ పరమైన సమస్య పరిష్కారమవుతుంది. మీరు కోరుకున్నవన్నీ లభ్యమవుతాయి. వ్యాపారంలో అభివృధ్ధి.
ఆగస్టు - మీ జీవితంలో నూతన మార్పులకు అవకాశం. మీకు సమాజంలో గౌరవ మర్యదలు లభిస్తాయి. మీ పనికి ఉన్నతాధికారులనుంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. పిల్లలు సహకరిస్తారు, వ్యాపారంలో అభివృధ్ధి.
సెప్టెంబర్ - ఇది కేవలం ప్రణాళికలకు మాత్రమే కాదు ఆచరిచడానికి మంచి సమయం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం. జీవితంలో సంతోషానికి మార్గాలు అనేకం, చేతులుచాచి వాటిని ఆహ్వానించండి. ఏకాగ్రతతో పనిచేస్తే సత్ఫలితాలు పొందుతారు.
అక్టోబర్ - మీ జీవితంలో కొత్తదనం చోటుచేసుకోనుంది. ఆదాయానికి నూతన ద్వారాలు తెరుచుకుంటాయి. స్థిరాస్థులపై పెట్టుబడులతో లాభాలను ఆర్జిస్తారు. పిల్లలకు మీ ఆసరా అవసరం, వారికి సమయం కేటాయించండి.
నవంబర్ - ఈ మాసం అన్నిరకాలుగా మధ్యస్థంగా ఉంటుంది. ఆర్ధికపరంగా అంత అనుకూలమైన మాసం కాదు. మానసిక శాంతి లభించదు. కుటుంబంలో ఒక దుర్వార్త వినే సూచనలు.
డిసెంబర్ - ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఇది అత్యంత అనుకూలమైన సమయం. నెలాఖరులో ఒక శుభవార్త వింటారు. చిరకాల మిత్రుని కలుసుకుంటారు. ఖాళీగా కూర్చోవద్దు. విదేశీ ప్రయాణాలకు అవకాశం.
కర్కాటకం ( హీ, హూ, హే, డా, డీ, డూ, డే, డో)
జనవరి - ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. మీ వయసువారితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అభివృధ్ధి. మీరు పనిచేస్తున్న కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు పన్నుతుంటారు, జాగ్రత్త. స్నేహం ప్రేమకు దారితీసే అవకాశం. శాంతంగా ఉంటే అంతా శుభమే జరుగుతుంది.
ఫిబ్రవరి - ఈ మాసం మీకు శుభకరంగా ప్రారంభమవుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రేమికులకు కలసివచ్చే మాసం.
మార్చి - సేవకు కొంత సమయాన్ని కేటాయించండి, లాభం చేకూరుతుంది. స్వల్ప అనారోగ్యాలు తప్ప ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆర్ధిక పరిస్థితి సామాన్యం. ప్రేమ సంబంధ విషయాల్లో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి.
ఏప్రిల్ - మీ ఆధిపత్య ధోరణివల్ల శత్రువులు పెరిగే అవకాశం. ప్రస్తుతం కొత్తగా ఎటువంటి పనులను చేపట్టవద్దు. మీ ప్రవర్తన ఉన్నతాధికారులకు ఆగ్రహం కల్పిస్తుంది.
మే - బంధువులను ఆహ్వానించేందుకు సిధ్ధం కండి. విద్యార్ధులకు అనుకూలమైన సమయం. స్థిరాస్థులపై పెట్టుబడులకు మంచి తరుణం. ఉన్నతాధికారితో అనవసర వాగ్వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పెట్టుబడులకోసం నూతన ప్రణాళికలు వేస్తారు.
జూన్ - అన్నింటా సత్ఫలితాలతో ఆనందోత్సాహాలలో తేలియాడతారు. ఆదాయంలో అభివృధ్ధి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. స్నేహితుల సహకారం లభిస్తుంది. భార్య ఆరోగ్యం ఆందోళనకు గురిచేస్తుంది. దూరప్రయాణాలవల్ల అలసటకు గురవుతారు. ఎప్పటికీ జరగలేని పనులకు ప్రణాళికలు వేయకండి.
జులై - అన్నీ సవ్యంగా సాగిపోతాయి. ఉరికే అటు ఇటు తిరగడం మానేయండి. విద్యార్ధులకు చదువుపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సుదీర్ఘ కాలం నుంచి ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు మెండు.
ఆగస్టు - చిరకాల మిత్రుల కలయికతో మీ జీవితం నూతన వర్ణాలతో శోభిల్లుతుంది. బయటి ఆహారానికి దూరంగా ఉండండి. లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. కుటుంబసభ్యుల సహకారం పుష్కలంగా లభిస్తుంది. విద్యార్ధులకు మంచి కాలం.
సెప్టెంబర్ - కుటుంబ సభ్యులతో గొడవపడితే సాఫీగా సాగిపోతున్న పనులు ఆగిపోయే అవకాశముంది. అవసరమైన వారికి సహాయం చేయడంవల్ల మీ మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మోకాలి నొప్పితో బాధపడతారు. వ్యాపారంలో లాభాలు తగ్గుతాయి.
అక్టోబర్ - శత్రువులు మిమ్మల్ని అధిగమించడానికి ప్రయత్నించడంతో మీరు ఆందోళనకు గురవుతారు. విలాసవంతమైన వస్తువుల కోసం అత్యధికంగా ఖర్చు చేస్తారు. మీ కోపమే మీ శత్రువు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీ కోపం మీకే అనర్ధాలు తెచ్చిపెడుతుంది, అందువల్ల కోపాన్ని జయించండి. మీ వైవాహిక జీవితంలో చెలరేగిన అనుమానాలు హానికరమైనవని రుజువు చేస్తాయి. మీ జీవిత భాగస్వామితో చర్చించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.
నవంబర్ - ఈ మాసం ప్రారంభంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 15వ తేదీ అనంతరం ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితుల సహకారం మీరు ముందుకు సాగేందుకు ప్రేరణనిస్తుంది. పిల్లలవల్ల ఆనందం, చిరకాల మిత్రునివల్ల సహాయం పొందుతారు. శత్రువులు మౌనంగా ఉంటారు.
డిసెంబర్ - స్థిరాస్థి, వాహన కొనుగోళ్ళు అత్యంత లాభదాయకంగా ఉంటాయి. పూర్తికాక ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమై త్వరితగతిన పూర్తవుతాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యంవల్ల సమస్యలను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులు సహకరిస్తారు.
సింహం (మా, మి, మూ, మో, టా, టీ, టూ, టే)
జనవరి - మాసం ప్రారంభంలో కొత్త పనులేమీ చేపట్టకండి. మొదటి పక్షం రోజులవరకు వ్యాపారులకు అనేక సమస్యలు ఎదురవుతాయి. దూరప్రయాణం అత్యంత లాభసాటిగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు తమ సహొద్యోగులవల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.
ఫిబ్రవరి - ఈ మాసం సామాన్యంగా ప్రారంభమవుతుంది. ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. పనులపై ఆసక్తి ఉండదు. వ్యాపారులకు అంతంతమాత్రంగానే ఉంటుంది. ప్రభుత్వోద్యోగులకు ఉన్నతాధికారులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం.
మార్చి - మీ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది, అత్యాశలకు పోవద్దు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు బాగా ఆలోచించండి. వాహనం నడిపేటపుడు అప్రమత్తత అవసరం. ఎదుటివ్యక్తులను ప్రేమించడంలోనే అంతా దాగి ఉందని గుర్తించండి, ఇతరులకు మీ ప్రేమను పంచడం నేర్చుకోండి.
ఏప్రిల్ - మీ దూరపు బంధువును కలుసుకుంటారు. వాతావరణ మార్పులవల్ల వచ్చే అనారోగ్యాలపట్ల అప్రమత్తంగా ఉండండి. వైద్యుని సంప్రదించడం మంచిది. మీ భాగస్వామి మీకు సహకరిస్తారు. పోటీలకు భయపడకుండా ఆస్వాదించడం నేర్చుకోండి, దానివల్ల వచ్చే ఆనందాన్ని అనుభవించండి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది.
మే - ఈ మాసం సాదాసీదాగా గడిచిపోతుంది. మీకు పనిచేయడానికి మనస్కరించదు. కొన్ని శారీరకమైన బాధలు కొనసాగుతాయి. న్యాయపరమైన సమస్యలలో వ్యతిరేకత ఎదురవుతుంది. ఒక శుభవార్త వింటారు. సరైన దృక్పధంతో పనిచేస్తే సత్ఫలితాలు లభిస్తాయి.
జూన్ - ఏదైనా పత్రంపై సంతకం చేసేముందు జాగ్రత్తగా పరిశీలించండి. ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వైద్యుని అవసరం వస్తుంది.
జులై - సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది, కెరియర్ కూడా దివ్యంగా సాగుతుంది. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ఆర్ధిక పరిస్థితుల్లో ఎగుడుదిగుడులు, కుటుంబ వ్యవహారాల్లో అసంతృప్తి. ఉద్యోగంలో మార్పులు, రిస్కులకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులు, స్నేహితులపై ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే పరిస్థితులు మరింత క్లిష్టంగా తయారవుతాయి. ఈ నెల బ్రహ్మచారులకు తమ భాగస్వాముల ఎంపికలో కాలం కలిసిరాదు. అయితే వారితో సమావేశానికి తమను తాము సంసిధ్ధులు కావచ్చు, గ్రహాలు మీకు హఠాత్తుగా అద్భుతాలు చూపించే అవకాశముంది.
ఆగస్టు - మీ సృజనాత్మకతకు విమర్శకుల ప్రశంసలందుకుంటారు. లగ్జరీ సామాను కోసం ఖర్చు చేస్తారు. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి.
సెప్టెంబర్ - మీ అభివృధ్ధిపై మీ శత్రువుల కన్నుపడుతుంది. మీ ఆగ్రహం వారి పనిని సులభం చేస్తుంది. రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు. పిల్లల విషయంలో ఆందోళన చెందుతారు. కుటుంబ జీవితంలొ ఒడుకుదుడుకులుంటాయి. జాగ్రత్త వహించండి.
అక్టోబర్ - ఈ మాసం సాధారణంగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయం మీకు కలసివస్తుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేస్తారు. మీరు పోగొట్తుకున్న ఆస్తి తిరిగి పొందుతారు. మీ జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది.
నవంబర్ - మీకు మనశ్శాంతి లభిస్తుంది. ప్రశాంతంగా జీవనం గడుపుతారు. మీ పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు.
డిసెంబర్ - మీ జీవితంలో అనందకరమైన మార్పులు వస్తాయి. పాత విషయాలను మర్చిపోయి జీవితంలో ముందుకు సాగండి. ఈ కొత్త మార్పులను ఆస్వాదించండి. విద్యకోసం ఖర్చు చేస్తారు. మీ జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది.
కన్య (టో, పా, పీ, పూ, ష, ణ, ఠ, పే, పో)
జనవరి - అనేక ఒడిదుడుకులు ఉంటాయి. అదృష్టపు గడియారం ఆగి ఆగి నడుస్తుంది. మీరు సాధించాలనుకున్న వాటికి ఆటంకాలు ఎదురవుతాయి. స్నేహితులు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటారు. స్తబ్దతతో కూడిన మీ భాగస్వామి ప్రవర్తనవల్ల మనశ్శాంతి కోల్పోతారు. ప్రభుత్వోద్యోగులకు వారి ఉన్నతాధికారులతో సంబంధాలు దెబ్బతింటాయి. ఆరోగ్య పరిస్థితి కూడా అంతంతమాత్రమే.
ఫిబ్రవరి - ఈ మాసం ప్రారంభం ఆశాజనకంగా ఉండదు. పిల్లలవల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్ధికపరంగా కూడా సమస్యలు ఎదురవుతాయి. నెలాఖరులో పరిస్థితులలో కొంత అభివృధ్ధి కనిపిస్తుంది. జీవితంలో ఆనందాన్ని నింపేలా దూరప్రాంతాలనుంచి ఒక శుభవార్త వింటారు. విద్యార్ధులు తమ చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలి.
మార్చి - గ్రహాల దృష్టివల్ల అదృష్టం మీ తలుపు తడుతుంది. అయితే విజయం సాధించాలంటే మీరు కఠినంగా శ్రమించవలసి ఉంటుంది. మీ ప్రయత్నం అభినందనీయమే అయినా, అదే సమయంలో మీపై శత్రువుల బలం కూడా పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తికావడానికి కొంత సమయం పడుతుంది. మీ ప్రయత్నాలు ఆపకుండా వాటిపై దృష్టి సారించండి.
ఏప్రిల్ - విదేశీ ప్రయాణాలకు అవకాశం. నూతన రాబడులు. సత్ప్రవర్తనవల్ల మీరు అనేక సమస్యలనుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. మీ పిల్లలు ఇంటికి శుభవార్తలు తెస్తారు. విద్యార్ధులకు సాధారణంగా ఉంటుంది.
మే - స్థిరాస్థులపై పెట్టుబడులకు మంచి సమయం. మీరు విజయాలబాట పట్టనున్నారు. నూతన పరిచయాలు కలసివస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అందమైన ప్రదేశాలను సందర్శిస్తారు. ప్రియమైన వ్యక్తులకోసం సమయం వెచ్చిస్తారు.
జూన్ - ఆధ్యాత్మికత, ధార్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు ఒక ఆధ్యాత్మిక ప్రాంతాన్ని సందర్శిస్తారు. కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టేముందు అన్ని పత్రాలలోని వివరాలను కూలంకషంగా పరిశీలించండి. నూతన బాధ్యతలు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఈ నెలాఖరులో బంధువులు రాకతో కళకళ.
జులై - విద్యార్ధులు ఒక శుభవార్త వింటారు. ఇనుప వ్యాపారులకు అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులకు వేతనం పెరిగే అవకాశం. అయితే పెరుగుతున్న ధరలకు అది సమానమవుతుంది. మీ పిల్లలకోసం అధిక సమయం కేటాయిస్తారు. మీ సోదరి లేదా సోదరుని నుంచి శుభవార్త వింటారు.
ఆగస్టు - కొందరివద్ద చిక్కుకుపోయిన సొమ్ము తిరిగి పొందుతారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. ఆనందోత్సాహాలు పెరుగుతాయి. పిల్లలవల్ల సమస్యలు ఎదురుకావచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
సెప్టెంబర్ - రాజకీయ సంబంధాలవల్ల మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. భవిష్యత్తుకు నూతన ప్రణాళికలు వేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ శత్రువులు ప్రయత్నిస్తారు, అప్రమత్తంగా ఉండండి. తల్లిదండ్రులు సహకరిస్తారు. పిల్లల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. విద్యార్ధులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది.
అక్టోబర్ - మీ జీవితంలో నూతన మార్పులు కానవస్తాయి. మీ దారిలో కొన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. గృహంలో సుఖశాంతులు నెలకొంటాయి. ప్రయాణాలవల్ల లాభం చేకూరుతుంది.
నవంబర్ - మీ సన్నిహితుల్లో ఒకరు విశ్వాసఘాతుకానికి పాల్పడతారు. ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశం. వివాహ సంబంధ విషయాల్లో అడ్డంకులు. మీ కోపమే మీ శత్రువని గుర్తించండి. మద్యపానీయాలకు దూరంగా ఉండండి.
డిసెంబర్ - దాంపత్య జీవనానికి సమయం కేటాయించండి. స్నేహితులతో కలిసి వ్యాపారం ప్రారంభించినవారు అత్యధిక లాభాలను ఆర్జిస్తారు. సమయం ప్రాముఖ్యతను గుర్తించడం ముఖ్యం. సామాజిజ వ్యవహారాలపై దృష్టి సారించడం అవసరం. భావోద్వేగాలు అధికమైతే సమస్యలు ఎదురవుతాయి. మీ తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
తుల (రా, రీ, రూ, రే, రో ,తా, తీ, తూ, తే)
జనవరి - జీవితంలో ముందుకు సాగాలంటే మీకు సహాయ సహకారాలు అవసరం. ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తితో వ్యక్తిగత పరిచయం మీకు కలిసివస్తుంది. వ్యాపారావకాశాలకు అవకాశాలున్నా అప్రమత్తత అవసరం. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్త.
ఫిబ్రవరి - నూతన గృహం కొనుగోలు చేస్తారు. మానసిక సమస్యలు దూరమవుతాయి. ఆర్ధికపరమైన అభివృధ్ధి. శత్రువులపై కన్నేసి ఉంచండి. మాతృ సంబంధమైన దుర్వార్త వింటారు.
మార్చి - వ్యాపారులకు మంచికాలం. కొత్త ఒప్పందాలవల్ల లాభం. రవాణాకు సంబంధించిన వ్యాపారులకు అదృష్టం కలసి వస్తుంది. రాబడి పెరిగినా ఖర్చులూ అధికమే. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి.
ఏప్రిల్ - మీ పేరుప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ఇరుగు పొరుగువారి సహకారం లభిస్తుంది. ఆర్ధికాభివృధ్ధి. ఆద్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నవారికి అనుకూల ఫలితాలు. అవివాహితులు ప్రేమలో పడతారు. దానధర్మాలవల్ల లాభపడతారు.
మే - మిల్లు లేదా కంపెనీకి యజమాములకు సమ్మె సమస్య ఎదురవచ్చు. ఉద్యోగులు సమస్యలనుంచి బయటపడతారు. ఆదాయ వ్యయాలమధ్య సమతుల్యం కష్టతరం. జీవితంలో కొత్తదనానికై తాపత్రయపడతారు.
జూన్ - ఏదైనా కొత్తపని ప్రారంభించేముందు అన్నివైపులా ఆలోచన అవసరం. న్యాయపరమైన విషయాలకు దూరంగా ఉండండి. అప్పులిచ్చేముందు ఆలోచించండి లేదా ఆ సొమ్మును జీవితంలో తిరిగి పొందలేరు.
జులై - వాతావరణం మీకు అనుకూలంగా ఉండదు. కాలేయ సంబంధ సమస్యలకు అవకాశం. బయటి ఆహారాన్ని త్యజించండి. పొరుగింటివారితో వాగ్వివాదాలకు అవకాశం. కొందరు మిమ్మల్ని పరిశీలిస్తుంటారు, అందువల్ల పూర్తి నిబద్దతతో పని చేయండి. మీ కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది.
ఆగస్టు - మీ ఆగ్రహం మీకు వ్యక్తిగతమైన హాని చేస్తుంది. మీరు మాట్లాడేముందు మీ మాటలను ఎల్లప్పుడూ పరీక్షించుకోండి. మీ మాటలవల్ల మీ భాగస్వామితో మనస్ఫర్ధలు. ప్రమాదం జరిగే అవకాశాలు మెండు. అత్యంత జాగరూకత అవసరం.
సెప్టెంబర్ - ఒక కుటుంబ శుభకార్యానికి హాజరవుతారు. మీనుంచి సహాయాన్ని ఆశించేవారిని నిరాశ పెట్టకండి. మీ పిల్లల ప్రవర్తన మీకు ఆనందం కలిగిస్తుంది. జీవితంపై ఆసక్తిని, ఉత్సాహాన్ని పెంచుకోండి. ఈ నెల 20వ తేదీ తర్వాత నుంచి మీకు ఆర్ధిక సమస్యలు ఎదురవుతాయి. శత్రువులవల్ల హాని కలిగే అవకాశం.
అక్టోబర్ - ఆగిపోయిన పనులు కొనసాగుతాయి. అనవసరమైన వాగ్దానాలు చేయవద్దు. మీ కష్టానికి తగ్గ ఫలితం లబిస్తుంది. ఈ ఏడాది రైతులకు కలసి వస్తుంది, లాభాలు ఆర్జిస్తారు. శత్రువులు మౌనంగా ఉంటారు. మీవల్ల మీ సన్నిహితులకు ఆనందం, సంతానానికి సంతృప్తి. మొత్తమ్మీద ఈ మాసం దివ్యంగా ఉంటుంది.
నవంబర్ - వ్యాపారులకు దివ్యమైన మాసం. అదృష్టం మీ వెంటే. అయితే ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పెద్దమొత్తంలో నష్టపోతారు. వ్యక్తిగత బాంధవ్యాలవల్ల ఆదాయానికి కొత్త దారులు. మహిళలు, వృధ్ధులు మోకాళ్ల నొప్పులతో బాధపడతారు.
డిసెంబర్ - కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. తొందరగా ఒక నిర్ణయానికి రాకండి. మీరు అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలవల్ల శత్రువులకు లాభం చేకూరే అవకాశం. నెలాఖరులో పరిస్థితుల్లో మార్పు. ఏడాది అంతంలో మీకు అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (నా, నీ, నూ, నే, నో, య, యీ, యూ)
జనవరి - కొత్త సంవత్సరం మీకు అద్భుతంగా ప్రారంభం కానుంది. మాసం చివర్లోని 15 రోజులు శుభకరంగా సాగుతాయి. మీ మనసు చెప్పిన మాట విని కష్టపడి పనిచేస్తే విజయం మీదే. దేవాలయాలకు విరాళాలివ్వడం మీకు మరింత శుభకరం. మీరు చేసే పనిలో మీరు తప్పక విజయం సాధిస్తారు. మీ భాగస్వామి ప్రవర్తన, సహకారం మీకు నూతన పథకాల ప్రారంభానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ఫిబ్రవరి - మీ మనసంతా ఉద్వేగం, ఉత్తేజంతో నిండిపోతుంది. మీరు ప్రారంభించిన పనులకు ఒక వాగ్వివాదంవల్ల ఆటంకం కలుగుతుంది. ఇతరులను నొప్పించకండి. ఏదైనా పని ప్రారంభించేముందు అన్నికోణాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంటికి బంధువుల ఆగమనం. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో అన్నీ శుభాలే జరుగుతాయి.
మార్చి - మీ పనులకు అభినందనలు లభిస్తాయి, అయితే అందుకు మీకు సహనం అవసరం. ఆరోగ్యంలో ఇబ్బందులు ఉండవు. మీ ఉన్నతాధికారితో సంబంధాలు మెరుగుపడతాయి. శత్రువులు వెనుకంజ వేస్తారు. పిల్లల విషయంలో ఒక శుభవార్త వింటారు. విద్యార్ధులకు అనుకూలమైన సమయం.
ఏప్రిల్ - విజయాలు కొనసాగాలంటే మీలో ఉన్న బద్దకాన్ని పారద్రోలాలి. మీ వైవాహిక జీవితం అనాసక్తిగా మారుతుంది. భాగస్వామి ఫిర్యాదులపై నిర్లక్ష్యం కూడదు. మీ నిర్లక్ష్య వైఖరితో శత్రువులు లాభపడతారు. ఆర్ధికపరంగా కూడా సామాన్యంగా ఉంటుంది.
మే - మీ జీవితంలో సంఘర్షణలు ప్రారంభం కానున్నాయి. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడపగలదు. స్థిరాస్థులపై పెట్టుబడికి ఇది అనుకూలమైన సమయం కాదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం, బయటి ఆహారానికి దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామి, పిల్లల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది.
జూన్ - ఎంత కష్టపడినా పనులు పూర్తవడం దుర్లభమే. కష్టానికి తగ్గ ఫలితం లభించదు. జీవిత భాగస్వామితో మీ ప్రవర్తన అనుకూలంగా ఉండదు. మీ తల్లిదండ్రులపట్ల జాగ్రత్త వహించండి. పిల్లల వల్ల కూడా ఆందోళన తప్పదు. శత్రువులు మీపై విజయం సాధించవచ్చు.
జులై - ఈ మాసం మీకు అశాంతిగా గడుస్తుంది. విద్యార్ధులకు కలిసిరాదు. సరైన జీవిత భాగస్వామి ఎంపికలో నిరాశ ఎదురవుతుంది. తండ్రి లేదా సోదరునితో వాగ్వివాదం జరిగే అవకాశం. వాహనదారులకు అప్రమత్తత అవసరం. మద్యపానం సేవించేటపుడు నిర్లక్ష్యం తగదు.
ఆగస్టు - సమయంలో మార్పు కానవస్తుంది. 15వ తేదీ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ పనితీరుపై ఉన్నతాధికారి సంతృప్తి చెందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కళ, సాంస్కృతిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నూతన గృహం లేదా నూతన వాహన కొనుగోలు. న్యాయపరమైన సమస్యలు సమసిపోతాయి. వ్యాపారులకు కలసివచ్చే కాలం.
సెప్టెంబర్ - అదృష్టం కలసివచ్చే మాసం. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. ఎల్లప్పుడూ స్నేహితులు మీ వెంటే ఉంటారు. అత్తగారింటి వైపునుంచి కూడా సహకారం లభిస్తుంది. ఆర్ధికపరంగా అద్భుతమైన కాలం. కంప్యూటర్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు అనుకూలిస్తుంది. శత్రువుల ప్రణాళికలు ఫలించవు.
అక్టోబర్ - ఈ మాసం సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉండవు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. మీ మాటలను గౌరవిస్తారు. ఆధ్యాత్మికత, దైవచింతనపై ఆసక్తి పెరుగుతుంది. ఉదయపు నడకను మీ దినచర్యలో భాగం చేయండి.
నవంబర్ - ఆగిపోయిన పనులు వెంటనే ప్రారంభమవుతాయి. విహార యాత్రలకోసం మీరు ఎంతోకాలంగా వేస్తున్న ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. కొందరు మీపై అభాండాలు వేసే ప్రమాదం ఉంది, అప్రమత్తంగా ఉండండి. అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. భవిష్యత్తులో అవి మీకు ఉపకరిస్తాయి.
డిసెంబర్ - మీ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ప్రణాళికలు పూర్తవుతాయి. కొత్త పనులను 15వ తేదీ అనంతరమే ప్రారంభించండి.
ధనుస్సు (ఏ, యో, భ, భీ, భూ, ఫా, డా, భే)
జనవరి - నూతన సంవత్సరంలో మొదటి మాసం మీకు అత్యంత ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. చేతులుచాచి ఆహ్వానించండి. ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు అత్యధిక లాభాలు ఆర్జిస్తారు. జీవితంలో కొత్త వెలుగులు ప్రవేశిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందమయమవుతుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. మీ చంచల మనస్తత్వాన్ని మార్చుకోకుంటే సమస్యలు తప్పవు.
ఫిబ్రవరి - పని చేయడానికి మనస్కరించదు. మనసు అశాంతికి గురవుతుంది. ఈ మాసమంతా మానసిక అలజడులు తప్పవు. విద్యార్ధులు అధికంగా శ్రమించాలి. వాగ్వివాదాలకు అవకాశం. శత్రువులు మీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయవచ్చు. అఫీసు రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
మార్చి - మాసంలోని మొదటి పక్షం రోజులు నిరాశాజనకంగా ఉంటాయి. పనులు ఆగిపోతాయి. ఎంత కష్టపడినా విజయం సాధించలేరు. న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకునే అవకాశం. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. 15వ తేదీ తర్వాత పరిస్థితులు అదుపులో ఉంటాయి. నూతన మార్గాలలో ఆదాయం కలసివచ్చే సూచనలు.
ఏప్రిల్ - విద్యార్ధులకు మంచి కాలం. కోరుకున్న ఫలితాలు లభిస్తాయి. శత్రువులు మీకు హాని కలిగించడానికి ప్రయత్నించినా విజయం సాధించలేరు. ఉద్యోగులకు అనుకూలమైన సమయం. మీ ప్రతిభ చూపే అవకాశం లభిస్తుంది, అందుకు సిధ్ధంగా ఉండండి. స్నేహితుల సహాయం లభిస్తుంది.
మే - సంతృప్తికరమైన మాసం. అన్నీ సాఫీగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్ళే సూచనలు. ఆర్ధికంగా సంతృప్తికరంగా ఉంటుంది. సంతాన విషయంలో ఆందోళనలు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి.
జూన్ - సృజనాత్మతకతకు మంచి సమయం. కళలు, సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి, స్నేహితుల సహకారం లభిస్తుంది. గృహంలో సుఖశాంతులు నెలకొంటాయి.
జులై - ఆర్ధిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పెట్టుబడులకు మంచి సమయం. విద్యార్ధులకు అదృష్టం కలసివస్తుంది. కొందరివద్ద చిక్కుకున్న నగదు తిరిగి లభిస్తుంది.
ఆగస్టు - బద్దకానికి మరోపేరు దరిద్రమని గుర్తుంచుకోండి. అన్నీ తేలిగ్గా తీసుకునే మీ మనస్తత్వంవల్ల పనులకు ఆటంకం. మీ ఈ ధోరణితో ఉన్నతాధికారుల ఆగ్రహనికి గురయ్యే అవకాశం. వాహనదారులకు అప్రమత్తత అవసరం. పెద్దలను అగౌరవపరచకండి.
సెప్టెంబర్ - మీ పిల్లల విషయంలో చిరకాలంగా బాధపెడుతున్న సమస్య సమసిపోతుంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయ పరిచయాలవల్ల లాభపడతారు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది.
అక్టోబర్ - అన్నీ సాఫీగా సాగిపోతాయి. చిన్న చిన్న విషయాలను వదిలేస్తే ఈ మాసంలో మీరు సత్ఫలితాలు పొందుతారు. మీ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. స్థిరాస్థులు, వాహనం కొనుగోలు చేయవచ్చు.
నవంబర్ - శత్రువులు హాని చేయడానికి సిధ్ధంగా ఉంటారు. జీవితంలో ఏదైనా పని తలపెట్టబోయేముందు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకోండి. మీమీద మీకున్న నమ్మకమే మీ విజయానికి తోడ్పడుతుంది. గృహంలో శుభకార్యాలకు అవకాశం. పని ప్రారంభించేముందు పెద్దల ఆశీర్వాదాలు కోరడం మరవద్దు.
డిసెంబర్ - విజయం మీ కోసం ఎదురుచూస్తోంది. మీరు చేయవలసిందల్లా సరైన అవకాశంపై దృష్టి సారించడమే. ప్రేమ సంబంధాలు స్థిరంగా ఉంటాయి. మీరు ఎవరికైనా ప్రమాణం చేసి ఉంటే దాన్ని నిలబెట్టుకోండి.
మకరం (భో, జా, జీ, ఖీ, ఖూ, ఖే, గో, గా, గీ)
జనవరి - ఈ ఏడాది ప్రారంభం దివ్యంగా ఉంటుంది. పాత అప్పులనుంచి విముక్తులవుతారు. అయితే గతంలోని న్యాయపరమైన సమస్యలవల్ల ఇబ్బంది కలగవచ్చు. చంచల మనస్సును నియంత్రించడం అవసరం. పిల్లలవల్ల శుభవార్త వింటారు. అత్తగారింటినుంచి కూడా ఒక శుభవార్త వస్తుంది. ఉద్యోగం మారే అవకాశం.
ఫిబ్రవరి - శారీరకంగా బాధపడతారు. మహిళలు, వృధ్ధుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ద అవసరం. జీవిత భాగస్వామినుంచి పూర్తి సహకారం లభిస్తుంది. నెలాఖరునాటికి పరిస్థితులు చక్కబడతాయి. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు.
మార్చి - సామాన్యమైన మాసం. ప్రముఖుల పరిచయంవల్ల లాభదాయకం. నిలిచిపోయిన సొమ్ము తిరిగి పొందుతారు. శత్రువులు మిమ్మల్ని అధిగమించాలని చూస్తారు, జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన పనులతో కాలం వృధా చేయవద్దు.
ఏప్రిల్ - మీకు అనుకూలమైన సమయం కాదు. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారతాయి. జరుగుతున్న పనులు నిలిచిపోతాయి. అన్నీ మీకు వ్యతిరేకంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం మీలో పెరుగుతుంది. స్నేహితుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. అనుకూలమైన ఫలితాలు రాకపోవడంతో విద్యార్ధులు కూడా నిరాశ చెందుతారు.
మే- మాసం ప్రారంభం అనుకూలంగా ఉండదు. ఒత్తిడివల్ల సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం. నెలాఖరులో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఖరీదైన వస్తువుల కొనుగోలు లాభదాయకం. మీపై శత్రువులు ప్రయత్నాలు విఫలమవుతాయి.
జూన్ - ఆర్ధిక లాభాలకు అవకాశం. అత్తగారింటినుంచి సహకారం. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్ళే సూచనలు. మీరు పడిన కష్టాలకు తగిన ఫలితాలను పొందనున్నారు. అయితే తొందర పడకండి, తర్వాత బాధపడవలసి వస్తుంది.
జులై - ఈ మాసం ఉన్నతాధికారులు, సహోద్యోగులనుంచి సహాయం లభించకపోవడమేకాక మీ కార్యాలయంలో పని ఒత్తిడితోపాటు అధిక పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే మీరు ధైర్యంగా ఉండి, మీ కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగి, మీ నైపుణ్యాన్ని చక్కగా ప్రదర్శించగలిగితే మీ ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీటన్నింటిని సులభంగా అధిగమించగలుగుతారు. ఉద్యోగానికి సంబంధించి మీ అభిప్రాయాలను మీ సహోద్యోగులముందు వెల్లడించకుండా జాగ్రత్త వహించండి. లేదా మీకంటే ముందే మీ సహోద్యోగులే వాటిని బయటపెట్టి మిమ్మల్ని నీరుగార్చే అవకాశముంది. ఈ మాసంలో కుటుంబంతో మీ సంబంధ బాంధవ్యాలు మెరింత మెరుగుపడతాయి. దీంతో మీ సామాజిక జీవితం కూడా ఇబ్బందులు లేకుండా ఆనందంగా సాగిపోతుంది.
ఆగస్టు - ఇది మీకు కొత్త విషయాలను నేర్చుకునే సమయం. మీకు అత్యంత కఠినమైన సమయం. దీనివల్ల మీకు ఎల్లప్పుడూ అండగా వుండే నిజమైన స్నేహితులెవరో తెలుస్తుంది. ఒత్తిడి అధికంగా ఉంటుంది. భక్తి కీర్తనలు, భజనలు మీకు శాంతి లభిస్తుంది. మాసంలోని చివరి వారంలో పరిస్థితులు మెరుగుపడతాయి. మనసును ఓర్పుగా, ప్రశాంతంగా ఉంచుకోగలిగితే మనశ్శాంతి లభిస్తుంది.
సెప్టెంబర్ - పరిస్థితులలో అభివృధ్ధి. అయితే కష్టపడితేనే విజయం లభిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. స్నేహితులు మీకోసం ఎండలో నీడలా ఉంటారు. నూతన వాహనం కొనుగోలు మీ జీవితంలో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది.
అక్టోబర్ - ఇది మీకు అద్భుతమైన మాసంగా చెప్పవచ్చు. జీవితంలో కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. మీ పనులకు ప్రశంసలు పొందుతారు. దూరపు బంధువువల్ల ఒక శుభవార్త వింటారు. మిమ్మల్ని ఓడించేందుకు శత్రువులు గట్టి ప్రయత్నం చేసినా విజయం సాధించలేరు.
నవంబర్ - కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగితే అన్నీ మీ నియంత్రణలో ఉంటాయి. శత్రువులు మీ కోపాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ గమ్యాన్ని నిర్ణయించుకుని ఆ దారిలో పయనించండి, విజయం మిమ్మల్నే వరిస్తుంది.
డిసెంబర్ - ఈ మాసం గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. గృహంలో వివాహ వేడుకలు జరిగే అవకాశం. మీ సమయాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకోవడం నేర్చుకోండి. పోటీ పరీక్షలకు సిధ్ధపడే విద్యార్ధులు విజయం సాధిస్తారు.
కుంభం (గూ, గే, గో, సా, సి, సు, సే, సో, ద)
జనవరి - ఈ మాసం నిరాశాజనకంగా ప్రారంభమవుతుంది. శత్రువులు మీకు వ్యతిరేకంగా పథకాలు పన్నుతారు, జాగ్రత్త. మీ ఉన్నతాధికారితో విభేదించే అవకాశాలున్నాయి. పిల్లల విషయంలో ఆందోళన చెందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
ఫిబ్రవరి - వేతనంలో ఒడుకుదుడుకులుంటాయి.ఒక వ్యక్తి మూర్ఖత్వం, మొండితనంవల్ల మీకు సమస్యలు ఎదురవుతాయి. మీ విలువైన వస్తువులు దొంగతనం లేదా పోగొట్టుకునే అవకాశాలున్నాయి, జాగ్రత్త. విజయం మీవైపే ఉంది, అందువల్ల కష్టపడి దాన్ని సాధించండి.
మార్చి - 15వ తేదీకి ముందు ఎటువంటి పనులను ప్రారంభించకండి. రెండవ పక్షంలో పరిస్థితులు మెరుగుపడతాయి. దూర ప్రాంతం నుంచి ఒక శుభవార్త వింటారు. ఆగిపోయిన సొమ్ము తిరిగి అందుతుంది. న్యాయపరమైన సమస్యలు మిమ్మల్ని ఆందోళనపరుస్తాయి. వ్యతిరేక ఆలోచనలు వున్నవారికి దూరంగా ఉండండి. విద్యార్ధులు విజయం సాధిస్తారు.
ఏప్రిల్ - మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ఒకరు ప్రయత్నిస్తారు. ఆదాయానికి కొత్త మార్గాల్లో దారులు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో అభివృధ్ధి సాధిస్తారు, అయితే మీరు కోరుకున్న విధంగా జరగదు. మీ జీవిత భాగస్వామి ఒక బలమైన స్తంభంలా మీ వెన్నంటే ఉంటారు.
మే- సమయం మీకు అనుకూలంగా ఉంది, దాన్ని ఉపయోగించుకుని లాభం పొందండి. విజయం కోసం మీరు కొత్త మార్గాలను అన్వేషించవలసి ఉంటుంది. పిల్లలవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో వాగ్వివాదంవల్ల బాధపడతారు. అధికారులతో సత్సంబంధాలు ఉపయోగపడతాయి. ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి.
జూన్ - విజయవంతంగా ప్రారంభించిన కార్యక్రమాలు విఫలం కావచ్చు. సాహిత్య రంగంలో ఉన్నవారికి మంచి సమయం. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నూతన ఉద్యోగాలకు అవకాశాం. విద్యార్ధులు ఉన్నత చదువులకోసం విదేశలకు వెళ్ళే అవకాశం.
జులై - సామాన్యమైన మాసం. క్షుణ్ణంగా చదవకుండా ఎటువంటి పత్రంపై సంతకం చేయవద్దు. బద్దకాన్ని వదిలించుకోండి. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు పొందండి. స్నేహితుల సహాయం మీకు అనేక లాభాలను తెచ్చిపెడుతుంది.
ఆగస్టు - దబ్బును ఉదారంగా ఇవ్వడం, ఉదారంగా పొందడం చేయవద్దు. మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. ఆదాయానికి నూతన ద్వారాలు తెరుచుకుంటాయి. ఆరోగ్య సమస్యలను తప్పించుకోవాలంటే బయటి ఆహారానికి దూరంగా ఉండండి. సూర్యోపాసనవల్ల లభం పొందుతారు.
సెప్టెంబర్ - ఈ మాసం మీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మీరు తీసుకోనున్న నిర్ణయాల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించదలచినవారు, స్నేహితుల సహాయం తీసుకోవడం లాభదాయకం.
అక్టోబర్ - భౌతిక సుఖాలు ఆనందాన్ని పెంపొందిస్తాయి. నూతన మార్గాల్లో ఆదాయాన్ని ఆర్జిస్తారు. ఉద్యోగం లేదా వ్యాపారం కోసం ప్రయాణలు చేస్తారు. గతంలోని ఆందోళనలు కనుమరుగవుతాయి. నూతన పరిచయాలవల్ల లబ్ది పొందుతారు.
నవంబర్ - ట్రాఫిక్ నిబంధనలను పాటించండి. వాహనాలను వేగంగా నడపడం ధైర్యమైన పని కాదని గుర్తుంచుకోండి. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. బంగారం కొనుగోలు దీర్ఘకాల లాభాలను తెచ్చిపెడుతుంది. మీ ప్రణాళికలను అమలు పరచడానికి అనుకూలమైన సమయం.
డిసెంబర్ - చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుంటే సమయం మీకు అనుకూలంగా ఉంది. సమాజంలో మీ గౌరవం ఇనుమడిస్తుంది. 15వ తేదీ తర్వాత సన్నిహితులతో వాగ్వివాదం జరిగే అవకాశముంది. నిర్ణయం తీసుకునేముందు ఎదుటివారు చెప్పేది శ్రద్దగా వినండి.
మీనం (దీ, టూ, థ, త్ర, దే, దో, చ, చీ)
జనవరి - ఈ ఏడాది మొదటి మాసంలో మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. మీ పెట్టుబడులకు తగ్గ ఆదాయం రాకపోవడంతో నిరాశకు గురవుతారు. మీ జీవిత భాగస్వామి మీతో దురుసుగా ప్రవర్తిస్తారు. మీ కోపం పరిస్థితిని ఇంకా జఠిలం చేస్తుంది. బయటి ఆహారానికి దూరంగా వుండండి.
ఫిబ్రవరి - మీ ప్రేమ వ్యవహారం వివాహ ప్రస్తావనకు దారితీస్తుంది. ముందు మీ తల్లిదండ్రులు చెప్పేది పూర్తిగా వినండి, లేకపోతే వారికి కోపం రావచ్చు. మీరు శాంతంగా వారికి నచ్చచెప్పగలిగితే వారు అర్ధం చేసుకుని ఒప్పుకునే అవకాశముంది. మీ ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రారంభించేముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. గాలిలో ఉన్న ప్రేమను ఉపయోగించుకోండి.
మార్చి - మీ పై అధికారితో వాగ్వివాదం జరిగే అవకాశం. మీ దురుసు ప్రవర్తన పరిస్థితులను మరింత కఠినతరం చేస్తుంది. ఉద్యోగంలో సమస్యలు తలెత్తుతాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. మీ భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని సమస్యల్లోకి నెడుతుంది.
ఏప్రిల్ - ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ కోపమే మీకు అనర్ధాలను తెచ్చిపెడుతుంది. దానివల్ల మీ పనులకు ఆటంకం కలిగే అవకాశముంది. మీ అసహనాన్ని అలుసుగా తీసుకుని ప్రజలు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. దేన్నైనా సాధించే విషయంలో మీ తొందరపాటు మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది.
మే - ఉద్యోగరీత్యా ఇది అనుకూలమైన సమయం. మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. పదోన్నతికి అవకాశాలు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్ధిక అభివృధ్ధి. సామాజిక కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొంటారు.
జూన్ - ఖర్చు విషయంలో జాగ్రత్త వహించండి. మీ నిర్లక్ష్యంవల్ల భారీ నష్టాలకు అవకాశం. విహారయాత్రలకు ప్రణాళికలు వేసుకుంటారు. అది మీకు అత్యవసరం కూడా. దానివల్ల మీరు విశ్రాంతి పొంది తిరిగి వచ్చిన అనంతరం ప్రశాంతమైన మనసుతో భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవచ్చు.
జులై - ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యంతో మీరు చేపట్టిన పనులకు ఆటంకం. అదృష్టం మీవైపే, పెండింగ్ లో ఉన్న అనేక పనులు పూర్తయ్యే అవకాశం. కుటుంబంలో ఒక శుభవార్తను ఆశించవచ్చు. కళ, సాంస్కృతిక కార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పెట్టుబడులకు మంచి సమయం.
ఆగస్టు - పనులలో పురోగతి. మాసంలో రెండవ పక్షంలో సమస్యలు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తుతాయి. అయితే మీరు సం యమనం పాటించి ప్రేమపూర్వక మాటలతో పరిస్థితులను చక్కదిద్దుతారు. పిల్లలవల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
సెప్టెంబర్ - మీ జీవన విధానంలో మార్పు వస్తుంది. మీ జీవనశైలిలో వచ్చిన ఈ అనుకూల మార్పును చూసి పలువురు దిగ్భ్రాంతికి గురవుతారు. ఉద్యోగంలో మీరు నూతన బాధ్యతలు పొందుతారు. దీనివల్ల కొందరు అసూయ పడడంతో అది మనస్పర్ధలకు దారితీసే అవకాశముంది. మీ విజయ పరంపర కొనసాగాలంటే మరింత కష్టపడి పనిచేయవలసి ఉంటుంది.
అక్టోబర్ - మీరు చేసే ప్రతి పనిని నాశనం చేయడానికి మీ శత్రువులు ప్రయత్నిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారు నష్టాల బారిన పడతారు. అయితే ఎన్ని ఇబ్బందులున్నా మీ ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అనవసరపు ఖర్చులను అరికట్టండి.
నవంబర్ - జీవితంలో ఆకస్మిక మార్పు వస్తుంది. మొదటి పక్షం రోజుల వరకు మీ అదృష్టం పూర్తిగా మీ వెన్నంటే ఉంటుంది. అదే సమయంలో అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు సంతోషాన్నిస్తుంది.
డిసెంబర్ - ఆర్ధికావకాశాలు పెరుగుతాయి. అభ్యర్ధులు పరీక్షలలో విజయం సాధిస్తారు. సవాలును స్వీకరించి దాన్ని సాధించడానికి ముందుకు కదులుతారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు సహకరిస్తారు.