మోక్షద ఏకాదశి 2021 - మోక్షద ఏకాదశి విశిష్టత మరియు పూజ విధానము - Mokshada ekadashi 2021 in Telugu
సాధారణంగా,ఏకాదశి దానాలు మొదలైన శుభకార్యాలను నిర్వహించడానికి అత్యంత ఫలప్రదంగా పరిగణించబడుతుంది. మోక్షదా ఏకాదశి వ్యక్తిగత పాపాలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజున,ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారు జీవితంలోని అన్ని కోరికలను నెరవేరుస్తారని నమ్ముతారు. ఇదిమార్గశీర్ష మాసంలో ప్రకాశవంతమైన శుక్లపక్షంలో వచ్చే 11వ చంద్ర దినం. మానవ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేసేందుకు శ్రీకృష్ణుడు భగవద్గీతను ప్రబోధించిన రోజు అదే.
ఎవరైనా గతంలో చేసిన పాపాలకు లేదా తప్పులకు పశ్చాత్తాపం చెంది, దాని నుండి బయటపడాలని కోరుకుంటే, మోక్షధ ఏకాదశి రోజు అత్యంత ప్రయోజనకరమైనది.మొత్తం 26 ఏకాదశిలు ఉన్నాయి మరియు అన్నింటిలో మోక్షధ ఏకాదశికి గొప్ప ప్రాముఖ్యత ఉంది.
ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో సమస్య ఉంటే, ఇప్పుడే కాల్ చేయండి.జ్యోతిష్యులతో ఫోన్‌లో మాట్లాడండి.
2021లో మోక్షద ఏకాదశి ఎప్పుడు?
మోక్షద ఏకాదశి డిసెంబర్ 14, 2021 (మంగళవారం)న వస్తుంది మరియు ఇది డిసెంబర్ 13, 2021 నుండి రాత్రి 9.32 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 14, 2021న రాత్రి 11.35 గంటలకు ముగుస్తుంది.మోక్షద ఏకాదశి నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపన్యాసం ఇచ్చాడు. దక్షిణాది రాష్ట్రాల్లో దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఇది అనుకూలమైన & పవిత్రమైన రోజుగా చెబుతారు.
అధునాతన ఆరోగ్య నివేదిక మిమ్మల్ని ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది!
మోక్షద ఏకాదశి పూజ నియమాలు:
- రోజు రాత్రి శ్రీకృష్ణుడిని ఆరాధించండి.
- ఏకాదశికి ముందు రోజు దశమి తిథి నాడు మధ్యాహ్నం సమయంలో ఆహారం తీసుకోండి.
- ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసం పాటించాలి.
- ఈ రోజున శ్రీకృష్ణునికి పూలతో పూజ చేయండి.
- ఈ రోజున శ్రీకృష్ణునికి దీపంతో పూజించి, ప్రసాదాన్ని సమర్పించండి.
- ఈ రోజు పేదలకు అన్నదానం చేయండి.
- అలాగే శ్రీకృష్ణుడిని తులసి ఆకులతో పూజించండి.
మోక్షద ఏకాదశి యొక్క జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత
ఈ రోజు డిసెంబర్ 14, 2021 (మంగళవారం) మేషరాశిలోని అశ్వినీ నక్షత్రంలో రాబోతోంది. ఇక్కడ, అశ్వినీ నక్షత్రం జ్ఞాన గ్రహంచే పాలించబడుతుంది, ఒక వ్యక్తికి మోక్షాన్ని (మోక్షం) ఇచ్చే కేతువు, మరియు ఇప్పుడు కేతువు అంగారకుడు పాలించే వృశ్చిక రాశిలో ఉంచబడ్డాడు. మేషం మరియు వృశ్చికం రాశులు రెండూ అంగారకుడిచే పాలించబడుతున్నాయని గమనించాలి.
బృహత్ జాతకంలో దాగి ఉన్న మీ జీవిత రహస్యాలన్నీ, గ్రహాల గమనం గురించిన పూర్తి సమాచారం తెలుసుకోండి.
మోక్షద ఏకాదశి నాడు యోగము
బుధుడికి విష్ణువు ప్రభువు. ఈ రోజున, బుధుడు వృశ్చికరాశిలో పన్నెండవ ఇంట అంటే అంగారకుడితో కలిసి ఉన్నాడు. ఇక్కడ, పన్నెండవ ఇల్లు మోక్షాన్ని సూచిస్తుంది.
మోక్షద ఏకాదశి నాడు విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి రాశి పరంగా చేయవలసిన పనులు:
మేషరాశి
- నరసిమహాస్వామిని ఆరాధించండి.
- వికలాంగులకు ఆహారాన్ని దానం చేయండి.
- "ఓం నమో నారాయణ" అని 27 సార్లు జపించండి.
వృషభరాశి
- శ్రీ సూక్తం పఠించండి..
- ఈ రోజు పేదలకు మిఠాయిలు దానం చేయండి.
- ఈ రోజున "ఓం హ్రీమ్ శ్రీ లక్ష్మీ భ్యో నమః" అని 15 సార్లు జపించండి.
మిథునరాశి
- ఉప్పు లేకుండా ఆహారం తీసుకోండి.
- "శ్రీ భాగవతం" పఠించండి.
- వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకోండి.
కర్కాటకరాశి
- ఉపవాసము చేయుట మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
- ఈ రోజున "ఓం నమో నారాయణ" అని 11 సార్లు జపించండి.
- మీ తల్లిగారి ఆశీస్సులు తీసుకోండి.
సింహరాశి
- ఈ రోజున ఉదయం ఆదిత్య హృదయం జపించండి.
- విష్ణు సహస్రనామం జపించండి.
- సూర్య భగవానుని పూజించండి.
కన్యారాశి
- భగవద్గీత పఠించండి.
- పేద ప్రజలకు పెసరపప్పు దానము చేయండి.
- "ఓం నమో భగవతే వాసుదేవాయ" అని 41 సార్లు జపించండి.
తులరాశి
- సౌందర్య లహరి స్మరించుకోండి.
- ఈ రోజున వికలాంగులకు పెరుగు అన్నం అందించండి.
- విష్ణువు మరియు లక్ష్మిదేవిని పూజ చేయండి.
వృశ్చికరాశి
- ఈ రోజున నరసింహస్వామిని ఆలయములో దర్శించుకోండి.
- శ్రీ మంత్రమును జపించండి.
- ఈ రోజున ఉపవాసం పాటించండి.
ధనుస్సురాశి
- బ్రాహ్మణునికి అన్నదానం చేసి వారి ఆశీస్సులు తీసుకోండి.
- నరసింహ స్వామిని పూజించండి.
మకరరాశి
- ఈ రోజు విష్ణువును ఆరాధించండి.
- "ఓం కేం కేతవే నమః" అని 7 సార్లు జపించండి.
- ఈ రోజు పేదలకు నువ్వులు దానం చేయండి.
కుంభరాశి
- విష్ణు సహస్రనామం జపించండి.
- "ఓం నమో భగవతే వాసుదేవాయ" అని జపించండి.
- వ్యాధిగ్రస్తులకు అన్నదానం చేయండి.
మీనరాశి
- శ్రీ సూక్తం జపించండి.
- విష్ణు సూక్తం జపించండి.
- పేదలకు భగవద్గీత పుస్తకములను దానం చేయండి.
జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్
ఆస్ట్రోసేజ్తో కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






