మేషరాశిలో శుక్ర సంచారం 10 ఏప్రిల్ 2021 - రాశి ఫలాలు
శుక్రుడు అందం, ప్రేమ,సృజనాత్మకతకు అధిపతి.ఇది భావద్వేగాలతో కూడుకుని కూడుకుని ఉన్న శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు.ఈ సంచారం మీ జీవితంలో అనేక మార్పులకు కారణము అవుతుంది మరియు మీయొక్క కోర్కెలను నెరవేర్చుకొనుటకు సహాయ పడుతుంది.
ప్రపంచంలోని ఉత్తమ జ్యోతిష్కులతోకనెక్ట్ అవ్వండి @ ఆస్ట్రోసేజ్ వర్తా
శుక్రుని యొక్క స్థానము అగ్ని,శక్తి, ఇష్టం మరియు ఆతృత అందిస్తుంది. ఈ సంచారం మీకు కొత్త అవకాశములను అందించుటలో సహాయపడుతుంది మరియు మిమ్ములను సృజనాత్మకత వైవు నడిపిస్తుంది.శుక్రుని యొక్క ఈ సంచారం 10 ఏప్రిల్ 2021 ఉదయం 06:14నిమి మొదలై 04 మే 2021 మధ్యాహ్నం 13:09 నిమి ముగుస్తుంది. ఈ సంచారం వివిధ రాశులపై ఎటువంటి ప్రభావము చూపెడుతుంది తెలుసుకుందాము.
ఈ అంచనాలు చంద్రఆధారపడి ఉంటాయి. మీ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: మూన్ సైన్ కాలిక్యులేటర్
మేషరాశి ఫలాలు
శుక్రుడు 2వ ఇల్లు కుటుంబం, ధనము మరియు 7వ ఇల్లు వివాహ సంబంధాలను, జీవిత భాగస్వామి, మరియు సమాజము యొక్క స్థానానికి అధిపతి.శుక్రుడు మేషరాశిలో ప్రవేశము 1వ ఇంటిలో జరుగుతుంది. తద్వారా, మీరు అన్నింటిలో ఉత్సహాము మరియు ఆసక్తిని చూపుతారు. మీరు కుటుంబంపట్ల, తోటివారితో,సహుద్యోగులతో మంచిగా మరియు ఆప్యాయముగా ఉంటారు. తద్వారా మీయొక్క బంధము మరింతగా బలపడుతుంది. ప్రేమికుల మధ్యలో ఆనందము మరియు ప్రేమ వికసిస్తుంది. వివాహితుల మధ్య సంబంధము మరింతగా దృఢమవుతుంది.ఒంటరి స్థానికులు ఈ సమయములో వారియొక్క ప్రియమైనవారిని కలుసుకునే అవకాశము ఉన్నది.సమాజములో మీయొక్క పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి మరియు అందరి యొక్క మన్ననలు పొందుతారు. వృత్తిపరముగా మీకు మంచి అనుకూల సమయముగా చెప్పవచ్చు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది తద్వారా ఆర్ధిక లాభాలను గడిస్తారు. ముఖ్యముగా మీడియా, సృజనాత్మకత మరియు సినిమా రంగాల్లో పనిచేస్తున్నవారికి మరింత అనుకూలముగా ఉంటుంది. ఆరోగ్యపరముగా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చును. కాబట్టి తగు జాగ్రత్త అవసరము.
పరిహారము: శుక్రవారం ఉపవాసము ఉండి,తెలుపు వస్తువులు బియ్యం, పంచదార మొదలగునవి అవసరమైనవారికి దానము చేయండి.
వృషభరాశి ఫలాలు
వృషభరాశికి శుక్రుడు అధిపతి. కావున, ఈ సంచారం ఖచ్చితముగా ప్రభావమును చూపుతుంది.ఈ రాశివారికి కొన్ని మార్పులు కూడా సంభవిస్తాయి. ఈ సమయములో మీరు మీ ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. పండ్లు మరియు బలవద్దకమైన ఆహారము తీసుకొనుట ద్వారా మీయొక్క ఆరోగ్యమును పెరుగుపర్చుకోవాలి. వృత్తిపరంగా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశము లభిస్తుంది. వివాదాలకు మరియు చర్చలకు దూరముగా ఉండండి. లేకపోతే మీయొక్క శత్రువులు మిమ్ములను ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు ఉన్నవి. వ్యక్తిగత జీవితపరముగా మీరు మీయొక్క కుటుంబముతో గడిపే అవకాశము ఉన్నది. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.ఇది మీయొక్క బంధాన్ని దృఢపరుస్తుంది.మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశము ఉన్నది.12వ ఇల్లు ఖర్చులకి సంబంధించినది కనుక మీరు మీయొక్క పరిధి దాటి ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడండి.లెకపోతే, ఇబ్బందులు తప్పవు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత కష్టపడవలసి ఉంటుంది. తద్వారా మీయొక్క కలలను నిజం చేసుకోగలుగుతారు.
పరిహారము: శుక్రవారము భగవంతుడిని పూజించుటవలన మీరు మరిన్ని అనుకూల ఫలితాలను పొందుతారు.
మిథునరాశి ఫలాలు
మిథునరాశిలో జన్మించిన స్థానికులకు శుక్రుని యొక్క సంచారమువలన అనుకూల ఫలితాలను పొందుతారు. వృత్తిపరముగా మీయొక్క ఆలోచనలు పనిచేసి మంచి ఫలితాలను పొందుతారు. మీయొక్క ఉన్నతాధికారుల మన్నన్నలు పొందుతారు.కానీ, సృజనాత్మకతలో కొన్నిఇబ్బందులను ఎదురుకుంటారు. ప్రమోషన్ మరియు ఇంక్రెమెంట్లకొరకు ఎదురుచూస్తున్న వారు అనుకూల ఫలితాలను పొందుతారు.ఎగుమతి మరియు దిగుమతుల వ్యాపారము చేసేవాళ్ళు విదేశీ వ్యవహారములనుండి మంచి లాభాలను పొందుతారు. మీరు వ్యాపారము ప్రారంభించాలి అనుకుంటే ఈసమయము అనుకూలముగా ఉంటుంది మరియు అనుకూల లాభాలను పొందుతారు.వ్యక్తిగత జీవితము పరముగా, మీరువివాహితులు అయితే, సంతానము వలన మీరు ఆనందముగా ఉంటారు.వారితో మీరు ఉల్లాసముగా గడుపుతారు.తద్వారా మీయొక్క సంబంధం మరింత దృఢమవుతుంది.విద్యార్థులకు అనుకూలముగా ఉంటుంది.వారియొక్క శక్తి సామర్ధ్యాలు వృద్ధి అవుతాయి మరియు వారియొక్క రంగాల్లో వృద్ధి సాధిస్తారు.
పరిహారము: ప్రతిరోజు ఉదయాన్నే మహాలక్ష్మి అష్టకమును పఠించండి.
కర్కాటకరాశి ఫలాలు
కర్కాటకరాశి వారికి ఈ శుక్ర సంచారము మిశ్రమ ఫలితాలను అందిస్తుంది.వృత్తిపరంగా మీరు కొన్ని ఎత్తుపల్లాలను ఎదురుకొనవలసి ఉంటుంది.మీరు మీయొక్క పనిలో మరింత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. తద్వారా మాత్రమే మీరు మీయొక్క పనులను పూర్తి చేయగలరు. సహుద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో మీకుకొన్ని గొడవలు జరిగే అవకాశమున్నది.కావున జాగ్రత్త అవసరము.ముఖ్యముగా ఆడవారితో జాగ్రతగా వ్యవహరించట చెప్పదగిన సూచన.వారు మీనుండి సహాయ సహకారములు పొందే అవకాశము ఉన్నది. ఆర్థికపరంగా, పెట్టుబడులు వాయిదా వేయుటద్వారా మీరుకొంత అసంతృప్తికి లోనవుతారు.ఏవైనా రుణాలను తిరిగి చెల్లించుటలో ఇబ్బందులను ఎదురుకుంటారు.వ్యక్తిగతముగా మీయొక్క జీవితభాగస్వామితో మీరు వాగ్వివాదానికి దిగవద్దు.అంతేకాకుండా, మీయొక్క బంధువులతో మీరు ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవద్దు.లేనిచో, గొడవలు జరిగే అవకాశమున్నది.ఆందోళన మరియు అలసట మిమ్ములను భాదిస్తుంది.తద్వారా, మీయొక్క ఆరోగ్యము దెబ్బతినే అవకాశమున్నది.యోగ మరియు ధ్యానము చేయుట చెప్పదగిన సూచన.
పరిహారము: శుక్రుని హోరా సమయములో శుక్రుని మంత్రము జపించుట మీకు అనుకూలముగా ఉంటుంది.
సింహరాశి ఫలాలు
శుక్రుని యొక్క సంచారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలను అందిస్తుంది.వృత్తిపరంగా శుక్రుని యొక్క సంచారం 3వ మరియు 10వ ఇంట ఉండుటవలన మీయొక్క కష్టానికి తగిన ప్రతిఫలము పొందుతారు. తద్వారా మంచి ఫలితాలను మరియు విజయాలను పొందుతారు. పెద్దవారిని కలవటం మరియు వారి స్నేహాన్ని పొందుటద్వారా మీరు అభివృద్ధి చెందుతారు. గవర్నమెంట్ ఉద్యోగులు వారు కోరుకున్న చోటికి ట్రాన్ఫర్లు పొందుతారు.వ్యాపారపరంగా మీరు మీయొక్క వ్యాపారాన్ని విస్తరించుటకు మీకు అనుకూల సమయముగా చెప్పవచ్చును.వ్యాపార పరంగా ప్రయాణములు మీకు అనుకూలముగా ఉంటాయి. మీరు మంచి లాభాలను పొందగలరు. మీడియా,జర్నలిజం, సినిమా సంస్థల్లో పనిచేస్తున్నవారికి అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. వ్యక్తిగతముగా మీకు మీయొక్క తోబుట్టువులనుండి సహాయ సహకారములు లభిస్తాయి. సమాజములో మీయొక్క పేరు ప్రఖ్యాతలు వృద్ధి చెందుతాయి. కొత్త పరిచయాలను మరియు స్నేహితులను పెంచుకోవడానికి మంచి సమయముగా చెప్పవచ్చును.మీసంతానము యొక్క వృద్ధి మీకు మరింత ఆనందమును కలిగిస్తుంది.ఒంటరి స్థానికులు వారియొక్క ప్రియమైనవారిని కలుసుకుంటారు. తండ్రిగారి ఆరోగ్యముపట్ల మరింత జాగ్రత్తగా ఉండుట మంచిది.ఆరోగ్యపరంగా మీరు అనుకూలముగా ఉంటుంది.
పరిహారము: నుదుటి మీద గంధమును ధరించుటవలన మరిన్ని అనుకూల ఫలితాలు పొందగలరు.
కన్యారాశి ఫలాలు
కన్యారాశి వారికి శుక్రుని యొక్క సంచారము జీవితములో ఎత్తుపల్లాలు చూపెడుతుంది.కావున మీయొక్క బంధాలను జాగ్రత్తగా పరిరక్షించుకోవటం చెప్పదగిన సూచన.మీయొక్క జీవితభాగస్వామితో సౌమ్యంగా మాట్లాడట మరియు గొడవపెట్టుకోకుండా ఉందట మంచిది.లేనిచో సంబంధములలో మీకు ఇబ్బంది కలుగుతుంది.కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మీకు ఆందోళన కలిగిస్తాయి.వారికి అధిక మొత్తములో ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది.వృత్తిపరంగా అనుకూలముగా ఉంటుంది.మీయొక్క పనిచేసే సంస్థలో మీయొక్క మాట చెల్లుబాటు అవుతుంది మరియు గౌరవము లభిస్తుంది.వ్యాపారస్తులు వారి వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు.ఆర్ధికపరంగా మీకు అత్యంత అనుకూల సమయముగా చెప్పవచ్చు. మొండి బకాయిలు తిరిగి పొందుతారు.పూర్వీకుల ఆస్తినుండి కూడా లాభాలను పొందుతారు.ఆరోగ్యపరంగా కళ్ళు, ఉదరం, ఊబకాయం సమస్యలను ఎదురుకునే అవకాశము ఉన్నది.కావున టీవీ మరియు మొబైల్ వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి.ఆహారపు అలవాట్లను మార్చుకోండి.మొత్తానికి ఈ సంచారం మిమ్మలిని మీరు తెలుసుకోవడానికి మరియు మిలో దాగిఉన్న శక్తిని తెలుసుకొనుటకు మీకు ఉపయోగపడుతుంది.
పరిహారము: ఆడవారికి అలంకరణ వస్తువులను దానము చేయండి.
తులారాశి ఫలాలు
తులారాశిలో శుక్రుడు ముఖ్యమైన పాత్రను పాత్రను పోషిస్తాడు.ఎందుకంటే తులారాశికి శుక్రుడు అధిపతి. అందువలన ఈ సంచారం చాలా ముఖ్యమైనది మరియు ప్రభావతమైనది.ఈ సంచార సమయములో మీయొక్క సంబంధములు దెబ్బతినే అవకాశము ఉన్నది. వ్యక్తిగతముగా మీరు మీయొక్క సంబంధములతో ఆనందముగా ఉంటారు. ఒంటరి స్థానికులకు అనుకూల సమయముగా చెప్పవచ్చును. అత్తమావలతో మీయొక్క సంబంధములు మరింత దృఢముగా ఉంటాయి. అయినప్పటికీ, మీరు వివాహేతర సంబంధములపట్ల మొగుడుచుపె అవకాశము ఉన్నది. కావున జాగ్రత్త వహించండి. వృత్తిపరంగా మీయొక్క శక్తి సామర్ధ్యములువలన అనుకూల ఫలితాలను పొందుతారు.మీ ఉన్నతాధికారుల నుంచి ప్రయోజనాలను పొందుతారు.భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయాణాలు మీకు లాభాలను తెచ్చి పెడతాయి.దీర్ఘకాలిక వ్యాధులనుండి మీరు ఈసంచార సమయములో తొందరగా కోలుకుంటారు.
పరిహారము: వెండితోగాని లేదా బంగారముతో చేయబడిన ఓపాల్ రాయిని శుక్రవారం ధరించండి.
వృశ్చికరాశి ఫలాలు
చెలాయిస్తారు.వారితో మీరు సంధి చేసుకునే అవకాశములు ఎక్కువగా కనిపిస్తున్నాయి.కార్యాలయాల్లో
వృశ్చికరాశి వారికి ఈ శుక్ర సంచారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది.వృత్తిపరంగా, ఈ సంచార సమయములో కఠిన సమయమును ఎదురుకొనవలసి ఉంటుంది.మీయొక్క శత్రువులు మీపై ఆధిపత్యాన్ని అనవసర విషయాలలో జ్యోక్యం చేసుకోవద్దు.లేనిచో మీయొక్క పేరు దెబ్బతినే అవకాశము ఉన్నది. భాగస్వామ్య వ్యాపారవిషయాల్లో ఇద్దరి మధ్య జరిగే అవకాశమున్నది.అనవసర ప్రయాణములు మానుకొనుట చెప్పదగిన సూచన.లేనిచో, లాభాలకు బదులు ఖర్చులు పెరుగుతాయి.ఈ సమయములో కొత్త వ్యాపారాలకు దూరముగా ఉండుట చెప్పదగిన సూచన.వ్యక్తిగతముగా, మీఆరోగ్యముపట్ల తగు జాగ్రత్త తీసుకొనుట చెప్పదగిన సూచన.మీ జీవిత భాగస్వామితో సమన్వయ లోపంవలన మీయొక్క బంధం దెబ్బతినే అవకాశము ఉన్నది.కావున, వారితో ఆచితూచి మాట్లాడుట చెప్పదగిన సూచన.ఆరోగ్యపరముగా మీరు కళ్ళు,ఉదరం, మూత్ర సంబంధిత సమస్యలను ఎదురుకునే అవకాశము ఉన్నది.కావున మీరు ఆరోగ్యకరమైన ఆహారమును తీసుకొనుట చెప్పదగిన సూచన.
పరిహారము: రోజు సూర్యోదయ సమయములో శ్రీసూక్తం పఠించుట మంచిది.
ధనుస్సురాశి ఫలాలు
ధనస్సురాశి వారికి ఈ శుక్ర సంచారం అనుకూలముగా ఉంటుంది.వృత్తిపరముగా శుక్రుడు 11వ ఇంటిలో సంచారం మీకు ధనము వివిధ ఉపములలో అందుతుంది. చాలా కాలంనుండి ఎదురుచూస్తున్న ప్రొమోషన్ లేదా ఇంక్రిమెంట్లు పొందే అవకాశము ఉన్నది. సమాజములో మీయొక్క స్థాయి పెరుగుతుంది.వ్యక్తిగత జీవితపరంగా, మీయొక్క ఉపాధ్యాయులు, మీకంటే పెద్దవారు మీకు కావాల్సినంత సహాయ సహకారములు అందిస్తారు.కుటుంబములో కొత్తవారి ప్రవేశము ఆనందాన్ని కలిగిస్తుంది.ఈ సంచారములో ఒంటరి స్థానికులు వారియొక్క భాగస్వామిని కలుసుకంటారు.వివాహితులు వారియొక్క జీవితభాగస్వామితో ఆనందకర సమయాన్ని గడుపుతారు.తద్వారా బంధాన్ని మరింత దృఢపరుచుకుంటారు. స్నేహితులు అండగా ఉంటారు.ఆరోగ్యపరంగా అనుకూలముగా మరియు నిలకడగా ఉంటుంది.ఈ సమయములో మంచి ఆహారమును తీసుకుంటారు.విలాసాలకు ఖర్చుపెడతారు.ఇదిమీకు ఆనందాన్ని కలిగిస్తుంది.పోటీపరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు విజయాలు పొందుటకు మంచిఅవకాశ సమయముగా చెప్పవచ్చు.
పరిహారము: అనుకూల ఫలితాలు పొందుటకు పరశురామ కథను చదవండి లేదా వినండి.
మకరరాశి ఫలాలు
శుక్రుడు మకరరాశికి యోగకారక గ్రహం.కావున ఈ సంచారం మకరరాశివారికి ప్రభావంతమైన ఫలితాలను అందిస్తుంది. ఇది మీయొక్క 4వ ఇంట సంచరిస్తుంది. ఇది మీకు ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తుంది. వృత్తిపరంగా, మీకు మంచి అనుకూల ఫలితాలు అందుతాయి.తద్వారా మీరు ఆనందముగా ఉంటారు. మీరు మీయొక్క ఉద్యోగాలలో ఉన్నత స్థానాలను అందుకోగలరు. ఆర్ధికపరంగా, మీరు పెట్టిన పెట్టుబడుల్లో మంచి లాభాలను అందుకుంటారు. తద్వారా మీయొక్క ఆర్థికస్థితి మరింత దృఢమవుతుంది. వ్యవసాయము ద్వారా కొన్ని లాభాలను ఆందుకోగలరు. వ్యక్తిగతముగా, ఆనందముగా గడుపుతారు.మీయొక్క జీవితభాగస్వామి మరియు పిల్లలతో ఆనందకర సమయమును గడుపుతారు.ఇది మీయొక్క కుటుంబాన్ని దృఢపరుస్తుంది.సమాజములో మీపేరు మరియు హోదా పెరుగుతుంది.కొత్త స్నేహితులను ఏర్పరచుకుంటారు.విలాసాలకు మరియు సౌకర్యాలకు ఖర్చుచేయటం అనుకూలిస్తుంది.స్థిరాస్తి లేదా కొత్త వాహనమును కొనుగోలు చేస్తారు.ఆరోగ్యపరంగా మీకు అత్యంత అనుకూల సమయముగా చెప్పవచ్చు.మీరు ఉత్సాహముగా మరియు శక్తివంతముగా ఉంటారు.
పరిహారము: శుక్రయంత్రాని రోజు ఉదయాన్నే పూజించుట చెప్పదగిన సూచన.
కుంభరాశి ఫలాలు
కుంభరాశివారికి శుక్ర సంచారం 4వ మరియు 9వ ఇంట జరుగుతుంది. వ్యక్తిగత జీవితము అనుకూలంగా ఉంటుంది. మీయొక్క ప్రియమైంవారితో కలిసి మీరు విహారయాత్రకు వెళ్ళవచ్చు. మీ కుటుంబముతో ఉన్న సంబంధాలు మరింత దృఢపడతాయి. సామాజికంగా ఈ సంచారం మీకు అనుకూలముగా ఉంటుంది. అంతేకాకుండా మీరు కొత్త పరిచయాలు మరియు స్నేహితులను పొందుతారు. కుటుంబ పరంగా అనుకూలముగా ఉంటుంది. కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నవి. ఆధ్యాత్మికంగా మీరు ముందుంటారు. దానధర్మాలు చేస్తారు. వృత్తిపరంగా ఉన్నతశిఖరాలకు చేసురుకునే అవకాశము ఉన్నది. మీయొక్క శక్తి సామర్ధ్యాలు మరియు తెగింపును మరియు ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. ఆర్థికపరంగా అనుకూలముగా ఉంటుంది. వ్యాపారములో మంచి లాభాలను అందుకుంటారు. ఒంటరి స్థానికులు వారియొక్క ప్రియమైనవారిని కలుసుకునే అవకాశము ఉన్నది. ఆరోగ్యపరంగా అనుకూల సమయముగా చెప్పవచ్చును.
పరిహారము: స్పటిక మాలను ధరించుటద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చును.
మీనరాశి ఫలాలు
రాశిచక్ర వృత్తం మీనం యొక్క చివరి సంకేతం కోసం, శుక్రుడు మీ మూడవ మరియు తొమ్మిదవ గృహాలకు పాలక ప్రభువు అవుతుంది. ఈ సంచార వ్యవధిలో, మీ రెండవ ఇంట్లో దాని ఉనికి గమనించబడుతుంది. రెండవ భావాను ఆర్థిక లాభాల గృహంగా కూడా పిలుస్తారు, అందువల్ల మీరు ఈ రవాణా ప్రభావంలో ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలను పొందుతారు. దీని అర్థం మీరు ఆర్థిక బహుమతులు పొందడమే కాక, విజయవంతమైన సంపదను కూడబెట్టుకోగలుగుతారు. పర్యవసానంగా, మీ ద్రవ్య నేపథ్యం మెరుగుపడుతుంది మరియు బలోపేతం అవుతుంది. ఈ వ్యవధిలో, మీరు సున్నితమైన రుచికరమైన పదార్ధాలను ఆస్వాదించటం మరియు క్రొత్త విషయాలను ప్రయత్నించడం కనిపిస్తుంది, ఇది ఖచ్చితంగా మీ ఆహార జాబితాలో ఉంటుంది. మీ కుటుంబంలో కూడా అనుకూలమైన సంఘటన జరగవచ్చు మరియు మీ ఇంట్లో సంస్థ శుభప్రదమైన పనితీరును సృష్టిస్తుంది. కుటుంబ సభ్యుల వివాహ వేడుక జరుగుతుంది. మీ కుటుంబం చాలా మంది అతిథులను ఆహ్వానిస్తుంది. మొత్తంమీద చెప్పాలంటే, దేశీయ రంగంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది, అందువల్ల మీ కుటుంబం యొక్క ఇమేజ్ కూడా క్రమంగా సమాజంలో మెరుగుపడుతుంది. మీరు అకస్మాత్తుగా సంపదను సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్న తోబుట్టువులు మీకు ఆర్థిక సహాయం అందిస్తారు. కొంతమంది స్థానికులకు పూర్వీకుల ఆస్తికి కూడా అనుమతి ఇవ్వవచ్చు. అలాగే, ఒక నిర్దిష్ట ఆస్తి లాభాలకు మార్గం సుగమం చేస్తుంది మరియు మీ కుటుంబం యొక్క సామూహిక బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
పరిహారము: చిన్నారి ఆడపిల్లలకు తెల్లటి తీపి పదార్ధములను ఆహారముగా నివేదించండి.