రాశి ఫలాలు 2020 (Rasi Phalalu 2020): సంవత్సర జాతకము
వైధిక జ్యోతీష్యశాస్త్రము అనుసరించి రాశి ఫలాలు 2020 చదవండి మరియు ఈ సంవత్సరము ఏ రాశివారికి ఎలా ఉందొ తెలుసుకొండి,మీ ఉద్యోగ,వ్యాపార,చదువు,కుటుంబజీవితం ఎలావుందో తెలుసుకోండి.విజయంసాధించటానికి ఇది సమయమా లేక ఇంకావేచిచూడాల? ఇలాంటి సమాధానములేని ప్రశ్నలన్నింటికీ రాశి ఫలాలు 2020 ఫలితాలు చదవండి.
అన్ని గ్రహాలు మరియు నక్షత్రాలు 12 రాశిచక్రాలుగా ఉంటుంది.ప్రతి రాశిచక్రం దాని విభిన్నపాలక ప్రభువులను కలిగి ఉంటుంది మరియు వార్గా చార్టులలోకూడా ఏదైనా ప్రత్యేక సంకేతంతో ఉంచిన ఏదైనా గ్రహం ఒక వ్యక్తికి భిన్నంగా ప్రభావితం చేస్తుంది.ఆ పరిస్థితిలో,ఆ నిర్దిష్ట సంవత్సరంలో సంభవించే గ్రహాల కదలిక మన జీవితంలో వివిధ దశలలో సానుకూలంగ లేక ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి. రాబోయ 2020సంవత్సరంలో మీజీవితంలో జరిగే విషయాలను మిము తెలియజేస్తాము.దీనికి చర్యలు లేదా నివారణలు అవసరము.మీ కోసము2020వ సంవత్సరంలో సంభవించే మార్పులు మరియు సవాళ్లు ఏంటి?ఈ సంవత్సరము అనుకూల ఫలితాలుపొందే గ్రహాలు ఏవి?ఈ వివరాలన్నింటినీ మీరు మా 2020 జాతకం ద్వారా ఆ ఆస్ట్రోసెజ్ వద్ద తెలుసుకొనగలరు.
రాశి ఫలాలు 2020 చదవటంద్వారా మీయొక్క పూర్తి భవిష్యత్తును మరియు సమస్యల పరిష్కార నివారణలును తెలుసుకొనుటకు పూర్తిగా చదవండి.
మేషరాశి రాశి ఫలాలు 2020: (Mesha Rasi Phalalu 2020)
జ్యోతీష్యం ప్రకారం రాశి ఫలాలు 2020 మేషరాశి వారికి 2వ అర్ధభాగంలో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు,కానీ ప్రథమార్ధంలో మాత్రం కొన్ని అనారోగ్య సూచనలు కలుగుతాయి.కాబట్టి ఆరోగ్యంపట్ల తగు జాగ్రత్త అవసరము. ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో మీరు సమస్యలు ఎదురుకుంటారు. కాబట్టి ఒక దృఢమైన బంధం మీ మధ్య ఏర్పరుచుకోవటం వలన మీరు ఈ సమస్యలనుండి మరియు వివాదాలను పరిష్కరించుకోవచ్చును.మీ యొక్క వృత్తి పరమైన సంబంధం మీ జీవితభాగస్వామితో మంచిగా ఉంటుంది.ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునే వారు వారి కోర్కెలు నెరవేరడానికి ఎక్కువ శ్రమ పడవల్సివస్తుంది.వైవాహిక జీవితం మాత్రం సుఖంగా సాఫీగా ఉంటుంది.మీ యొక్క సంతానం వలన మీకు మనశాంతి కలుగుతుంది.కుటుంబజీవితంలో కొన్ని పరీక్షలు ఎదురుకుంటారు.మీ తండ్రి గారి ఆరోగ్యము క్షీనిస్తుంది.మీరు ఈ స్థిరనివాసాన్ని మార్చుకుని బంధువులకి దూరంగా వెళతారు.ఒక శుభప్రదమైన కార్యక్రమం మీ ఇంట్లో జరుగుతుంది.విద్యార్ధులకి వారి కాష్ఠానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.విదేశాలనుండి కొన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు మరియు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.ఈ సమయంలో మీ బంధువులు మరియు సహుద్యోగులు మీకు సహాయసహకారాలు అందిస్తారు. మీ వృత్తిపరమైన జీవితంలో ఉన్నతస్థితికి చేరుకుంటారు.
వృషభరాశి రాశి ఫలాలు 2020: (Vrushabha Rasi Phalalu 2020)
వృషభరాశివారికి రాశి ఫలాలు 2020 ప్రకారం వీరికి ఆరోగ్యవిషయంలో ఎత్తుపల్లాల్లు చూస్తారు.మీరు మీ వృత్తిపరమైన జీవితాన్ని మరియు వ్యక్తిగతజీవితాన్నిసరిగ్గా చూసుకోవటంద్వారా శారీరక అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు.మీరు కండరాలు మరియు నరాల సంబంధిత వ్యాధులతో బాధపడతారు.మీ ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నవి మరియు మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది.ఇక వైవాహికజీవితంవారికి అనుకూలంగా ఉండదు మీ, ఇద్దరిమధ్య సంబంధం ప్రతికూలంగా మారుతుంది. మీ సంతాన విషయంలో కూడా సాధారణంగా ఉంటుంది.ప్రథమార్థంలో కుటుంబజీవితం కూడా అంత అనుకూలంగా ఉండదు.మీ తల్లితండ్రులు అనారోగ్యానికి గురిఅవుతారు.సెప్టెంబర్ నెల తరువాత మీకు అనుకూలంగా ఉంటుంది.విద్యార్థులకు అనుకూల సమయంగా చెప్పవచ్చు.ఉన్నతవిద్య అభ్యసించాలి అనుకునేవారు వారుకోరుకున్న విశ్వవిద్యాలయాలలో వారు అడ్మిషన్ పొందగలరు.ఆర్థికాభివృద్ధి చెందటంలో మీరు కొన్ని సమస్యలు ఏదురుకొనవలసి ఉంటుంది.కాబట్టి తగు జాగ్రత్త అవసరము.లేనిచో మీరు ఇబ్బందులకు గురికావాల్సిఉంటుంది.అయినప్పటికీ మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు.చివర్లో మీరు పరిస్థితులు అనుకూలంగా మారతాయి.
మిధునరాశి రాశి ఫలాలు 2020: (Mithuna Rasi Phalalu 2020)
మిధునరాశివారికి రాశి ఫలాలు 2020 ప్రకారము ఈ సంవత్సరము ప్రారంభంలో మీఆరోగ్యవిషయములో అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వైద్యులు చెప్పినవి తప్పకుండా పాటించాలి.ఆరోగ్యంపట్ల శ్రద్ద అవసరము,చిన్న సమస్య అయినప్పటికీ అలసత్వము ప్రదర్శించవద్దు.ప్రేమసంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉన్నవి,మీరు మీ జీవితభాగస్వామితో మంచి దృఢసంబంధాన్ని కలిగిఉంటారు. వైవాహికజీవితంవారు వారి జీవితభాగస్వామిపట్ల జాగ్రత్తగా ఉండాలి.మీఅత్తామావయ్యల నుండి మీరు ప్రయోజనాలు పొందుతారు.మీరు కుటుంబపరమైన మనిషి అయితే మీరు ఆధ్యాత్మికతపట్ల ఆకర్షితులు అవుతారు.ఆస్తికోసము కుటుంబంలో తగాదాలవలన మీరు మనశాంతిని కోల్పోతారు.విద్యార్ధులకి అంత అనుకూలంగా లేదు.వృత్తిపరమైన విద్యలో ఉన్నవారికి అనుకున్న ఫలితాలు వస్తాయి.మీరు ఈ సమయంలో కొత్తపనులు ఏమి ప్రారంభించకండి.
కర్కాటకరాశి రాశి ఫలాలు 2020: (Karkataka Rasi Phalalu 2020)
కర్కాటకరాశి వారికి రాశి ఫలాలు 2020 ప్రకారము ఈ సంవత్సరము వారి ఆరోగ్యంపట్ల తగు జాగ్రత్త అవసరము.ఆహారానియమాలు పాటించటం తప్పనిసరి.ఈ సమయంలో శారీరక రుగ్మతులకు గురిఅవుతారు.ప్రేమసంబంధిత విషయానికి వస్తే మీకు అనుకూలంగా ఉన్నది అనేక సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి దీనివలన వారు మీకు తగినవారుగా భావిస్తారు.ఇంకొకవైపు అనేక ఇతర సంబంధాల వలన మీసంబంధం మీద ప్రభావము చూపే అవకాశము ఉన్నది.అలంటి విషయాలు రాకుండా మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి.వైవాహిక జీవితంవారు కూడా కొన్ని ఎత్తుపల్లాలు చూస్తారు.అయినప్పటికీ అవిఅన్నీమీ ఇరువురియొక్క అవగాహనతో సమసిపోతాయి. మీ తల్లిగారి ఆరోగ్యం క్షీనిస్తుంది. విద్యార్థులు విజయము పొందటానికి కస్టపడి చదవవలసి ఉంటుంది.మీ ఆర్థికపరిస్థితి కూడా కుదుపులకు గురిఅవుతుంది.మీయొక్క ఖర్చులను తగ్గించి ధనమును పొదుపుచేయుట చెప్పదగిన సూచన.ప్రారంభం వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది.
సింహరాశి రాశి ఫలాలు 2020: (Simha Rasi Phalalu 2020)
సింహారాశివారికి రాశి ఫలాలు 2020 ప్రకారము ఈ సంవత్సరము వీరికి ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉన్నది.యోగ,ధ్యానం మరియు వ్యాయామం చేయుటద్వారా అనవసర కొవ్వుని తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండండి.ప్రేమసంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి,ఇది మీ బంధం విడిపోవటానికి దారితీస్తుంది.వైవాహిక జీవితంవారికి పరిస్థితులు మిములను ఒత్తిడికి గురిచేస్తాయి,కాబట్టి ఇద్దరిమధ్య గందరగోళం మరియు అవగాహ రాహిత్య పరిస్థితులను రానీయద్దు.సంవత్సర చివరిలో మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.మీ సంతానం వారు అనుకున్న ఆశయాలలో విజయము సాధిస్తారు.ద్వితీయార్ధంలో మీకు అనుకూలంగా ఉంటుంది.మీ కుంటుంబంలోనికి కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు.మీరు మీ కుటుంబం మంచిగా ఉండాలియాంటే మీరు కొన్ని విషయాలలో రాజీపడక తప్పదు. విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది,పోటీపరీక్షల్లో విజయము సాధిస్తారు.ఆర్థికాభివృద్ధికొరకు మీరు కష్టపడక తప్పదు.వృత్తిపరమైన జీవితంఈ సంవత్సరము అనుకూలంగా ఉన్నది.
కన్యారాశి రాశి ఫలాలు 2020: (Kanya Rasi Phalalu 2020)
కన్యారాశి వారికి రాశి ఫలాలు 2020 ప్రకారము ఈ సంవత్సరము అదృష్టము బాగా కలిసివస్తుంది.మీఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది.మీరు మీ ఆహారపు అలవాట్ల మరియు దినసరిచర్య పై కొంత జాగ్రత్త అవసరము.మీ ప్రియమైన వారితో మీయొక్క సంబంధం మరింత దృఢపడుతుంది,ఇది మీ ప్రేమజీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. వైవాహిక జీవితంలో ఉన్నవారికి వారి జీవితభాగస్వామి నుండి పూర్తి సహాయసహకారాలు అందుతాయి.మీరు మీజీవితభాగస్వామికి దూరంగా ఉండే అవకాశము ఉన్నది.అయినప్పటికీ ఇది మీకు మీఇద్దరి మధ్య ప్రేమను మరియు బంధాన్ని దృఢపరుచుకోడానికి దోహదపడుతుంది.కుటుంబజీవితానికి మరియు మీసంతానానికి మంచి అనుకూల సమయము.దీనివలన సంఘంలో మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి.విద్యార్థులు పెద్ద విజయాలను అందుకుంటారు.మీ ఆర్ధికపరిస్థితి కూడా బాగుంటుంది ఇది మీ మానసిక ఆనందానికి కారణము అవుతుంది.మీరు కొత్త వాహనాలను ఖరీదు చేస్తారు.వృత్తిపరంగా కూడా మీకుఅనుకూలంగా ఉన్నది.ఈ సంవత్సరం మీరు మీయొక్క నివాసాన్ని మారుస్తారు.మీరు కనుక బడాపరిశ్రమల్లో పనిచేస్తుంటే మీరు కొన్ని బహుమతులు కూడా అందుకుంటారు.మీ స్నేహితుల నుండి సహాయసహకారాలు అందుకుంటారు.
తులారాశి రాశి ఫలాలు 2020: (Thula Rasi Phalalu 2020)
తులారాశివారికి రాశి ఫలాలు 2020 ప్రకారము ఈ సంవత్సరము ఆరోగ్యవిషయములో అనుకూలంగా లేదు.మీ ఆరోగ్యము క్షీనిస్తుంది. మీరు అజీర్తి, తలనొప్పి, ఆటలమ్మ, కీళ్లనొప్పులు, ఒళ్ళునొప్పలతో బాధపడతారు.ఆరోగ్యకరమైనజీవితమే ఒక గొప్ప సంపద అని గుర్తుంచుకొని ఆరోగ్యవిషయములో జాగ్రత్తగా ఉండండి.ప్రేమసంబంధిత విషయాలు మీకు అనుకూలిస్తాయి.మీరు ఆనందంగా మరియు సంతోషంగా ఎలా జీవించాలో నేర్చుకుంటారు.మీ ప్రేమ మీ ప్రియమైనవారితో తీవ్రంగా ఉంటుంది.వైవాహికజీవితంవారికి ఈ సంవత్సర ప్రారంభంలో నిదానంగా ఉంటుంది.సంవత్సర మధ్యలో అనుకూలంగా ఉంటుంది.ఇంకొకవైపు మీ జీవితభాగస్వామి యొక్క ఆరోగ్యము క్షీనిస్తుంది.మీ సంతానం విజయాలు సాధించటానికి కష్టపడవలసి ఉంటుంది,అంతేకాకుండా వారికి వివాహము అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.కుటుంబజీవితానికి అనుకూల సమయము కాబట్టి మీరు మీకుటుంబంతో ఆనందంగా సమయము గడుపుతారు.విద్యార్థులకు అనుకూల సమయము కస్టపడి పనిచేయుట ద్వారా ఉద్యోగాలు సాధిస్తారు.ఆర్థికాభివృద్ధి సాధారణంగా ఉంటుంది.విదేశీప్రయాణాలు చేసే అవకాశము ఉన్నది. అనేక ఇతర మార్గాల నుండి డబ్బు సంపాదిస్తారు అయినప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి.మీరు ఏ విధమైన కొత్త పనిని ప్రారంభించకండి.
వృశ్చికరాశి రాశి ఫలాలు 2020: (Vruschika Rasi Phalalu 2020)
వృశ్చిక రాశివారికి రాశి ఫలాలు 2020 ప్రకారము ఈ సంవత్సరము ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉన్నది.మీరు మానసిక ఒత్తిడులు ఎదురుకున్నప్పటికీ వాటినుండి మీరు తొందరగా బయటపడతారు.ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నవి.మీరు ఒంటారివారు అయితే మీరు కొత్తవారిని కలుసుకుంటారు,మీరు విడిపోయినవారు అయితే తిరిగి వారు మీ జీవితంలోకి వస్తారు.మీరు పెళ్లిఅయినవారు అయితే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉన్నది. భవిష్యత్తు కొరకు మీ జీవితభాగస్వామితో కలసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబంలో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి,కాబట్టి మీరు సహనంతో వ్యవహరించటం చెప్పదగిన సూచన.మీ కుటుంబంలో పెళ్ళి లేదా పిల్లలు పుట్టడం వంటి శుభకార్యాలు జరుగుతాయి.కస్టపడటం ద్వారా విద్యార్థులు అనుకున్న విజయాలను అందుకుంటారు.ఆర్థికాభివృద్ధి బాగుంటుంది.మీకు ఆర్ధిక ప్రయోజనాలు కలిగే సూచనలు కూడా ఉన్నవి.మీరు మీ పూర్తి శక్తిసామర్ధ్యాలను వినియోగిస్తారు.మీరు మీవృత్తిపరమైన జీవితంలో అనేక అవకాశాలు పొందుతారు.
ధనుస్సురాశి రాశి ఫలాలు 2020: (Dhanusu Rasi Phalalu 2020)
ధనస్సురాశి వారికి రాశి ఫలాలు 2020 ప్రకారము ఈ సంవత్సరం కొన్ని చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఏదురుకుంటారు.ఈ సంవత్సరం ప్రేమకు సంబంధించి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నవి మరియు మీరు మరింత దగ్గరఅవుతారు.మీ ప్రియమైనవారు మీయొక్క ఆలోచలను మరియు భావాలను అర్ధంచేసుకుని దానికి తగ్గట్టు వ్యవహరిస్తారు.మీరు ఎవరికైనా మీప్రేమను వ్యక్తపరిస్తే మీకు అనుకూలంగా ఉంటుంది.వైవాహికజీవితంవారికి కూడా అనుకూలంగా ఉన్నది మరియు మీకు మరియు మీజీవిత భాగస్వామికి మధ్య సంబంధం దృఢపడుతుంది.మీ జీవిత భాగస్వామియొక్క ఆరోగ్యం మీద తగు జాగ్రత్త అవసరము.పిల్లలకోసం చూసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది.మీరు మీ స్థిరాస్థులనుండి ప్రయోజనాలు పొందుతారు.మీ కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది.మీ కుటుంబంలో కొత్తవ్యక్తి వచ్చే అవకాశము ఉన్నది.విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.మీయొక్క అద్భుతమైన ప్రదర్శనతో ఇతరుల మన్నన్నలు పొందుతారు.మీరు మీయొక్క సొంతవూరుకి బదిలీ చేయబడతారు.ఈ సంవత్సరము మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది.
మకరరాశి రాశి ఫలాలు 2020: (Makara Rasi Phalalu 2020)
మకరరాశి వారికి రాశి ఫలాలు 2020 ప్రకారము ఈ సంవత్సరము మీకు అంతా మంచిగా మరియుఅనుకూలంగా ఉంటుంది.ఆరోగ్య విషయంలో మాత్రం మీకు మిశ్రమఫలితాలు గోచరిస్తున్నాయి.మీరు చేసేపనిలో ఫలితాలకోసము మరింత ఎక్కువగా కృషిచేయవలసి ఉంటుంది,కొన్ని దీర్ఘకాలిక రోగాలను భరించవలసి ఉంటుంది.ప్రేమ వ్యవహారాల్లో సమయము మీకు అనుకూలంగా ఉన్నది, వివాహాలు కూడా జరిగేఅవకాశముఉన్నది.మీరు మీప్రియమైనవారి మనస్సు గెలుచుకుంటారు,కానీ వైవాహికజీవితంలో మాత్రం ఎత్తుపల్లాలు చూడకతప్పదు..ఎల్లపుడూ చేశే పనిమీద దృష్టిపెట్టాటమే కాకుండా మీ జీవితభాగస్వామికి కూడా సమయము కేటాయించండి.మీసంతానానికి సమయము అంత అనుకూలంగా లేదు,కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకుంటూవారిని ప్రోత్సహించండి.మీరు మంచి ఫలితాల కోసము కష్టపడవలసి ఉంటుంది.ఆర్ధికవిషయంలో మీకు అంత అనుకూలంగా లేదు.కాబట్టి మీయొక్క ఆర్ధిక పరిస్తిమీద మరియు మీరుచేసే అప్పులమీద దృష్టిసారించటంచెప్పదగిన సూచన. నిరుద్యోగులకు ఉద్యొగము వచ్చే అవకాశము పుష్కలంగా ఉన్నది.
కుంభరాశి రాశి ఫలాలు 2020: (Kumbha Rasi Phalalu 2020)
కుంభరాశి వారికి రాశి ఫలాలు 2020 ప్రకారము ఈ సంవత్సరము కొన్ని సవాళ్ళను ఎదురుకుంటారు,మరియు వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.మీరు మీఆరోగ్యం పట్ల శ్రద్ద వహించవలసి ఉంటుంది.ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వీటిలో కొన్ని మీకు ఆనందాన్ని ఆహ్లదాన్ని కలిగిస్తాయి.మీ రాబడి బాగుంటుంది,అయినప్పటికీ మీ ఖర్చులు అధికంగా ఉంటాయి,దీనివలన మీరుఆర్ధిక సమస్యలు ఏదురుకోవలసి ఉంటుంది.మీరు ఈ సంవత్సరం ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు.విదేశాలు వెళ్ళాలి అనుకునేవారు ఈ సంవత్సరము వారి కోర్కెలు నెరవేరే అవకాశము ఉన్నది.మీ సన్నిహితులను జాగ్రత్తగా చూసుకోండి.మీకు ఉద్యోగాలలో ఉన్నచోటు నుండి బదలీ అయ్యే అవకాశము ఉన్నది.లక్ష్యాలను సాధించటానికి విద్యార్థులు కష్టపడవలసి ఉంటుంది.మీ కుటుంబజీవితం కొంచం ఆదోళనను కలిగిస్తుంది.మీరు మీ ప్రియమైనవారితో మంచి సంబంధాన్ని కలిగిఉందంది.ప్రేమ విషయంలో సమయము మీకు అంత అనుకూలంగా లేదు.మీరు జాగురూపకతతో వ్యవహరించటం చెప్పదగిన సూచన.
మీనరాశి రాశి ఫలాలు 2020: (Meena Rasi Phalalu 2020)
మీనరాశి వారికి రాశి ఫలాలు 2020 ప్రకారము ఈ సంవత్సరము అనుకూలంగా ఉన్నది.అన్నిటా విజయము సాధిస్తారు,ఆర్థికాభివృద్ధి కూడా బాగుంటుంది.మీ ప్రాణస్నేహితులను,బంధువులను,ప్రియమైనవారిని కలుసుకునే అవకాశము లభిస్తుంది. మీరు ఏ పనిచేసిన ఆ పనిలో మీరు విజయము సాధిస్తారు.కుటుంబజీవితంలో కొన్ని సమస్యలు ఏదురుకొనవలసి ఉంటుంది.మీయొక్క వ్యూహాలతో వాటిని అధిగమిస్తారు.సమాజంలో ఉన్న వృద్ధుల ఆశీస్సులు పొందుతారు.మీ యొక్క పనిలో తీరికలేని సమయము వలన మీరు అనారోగ్యానికి గురిఅవుతారు. కాబట్టి పనిలో మీరు చిన్నచిన్న విరామాలు తీసుకోవటం చెప్పదగిన సూచన.సమాజంలో మీ పేరుప్రతిష్టలు వృద్ధి చెందుతాయి.మీరు తక్కువ ప్రయాణాలుచేసి ఆర్ధిక ప్రయోజనాలు పొందుతారు.వ్యాపారంలో ఊహించని విజయాలను అందుకుంటారు.