వృషభరాశిలో శుక్ర సంచార ప్రభావము - రాశి ఫలాలు
సంతోషాలకు, భోగాలకు, ఉన్నతస్థాయికి మరియు ముఖ్యమైన ప్రేమకు చిహ్నము అయినటువంటి శుక్రుడు దానియొక్క సొంత రాశి అయినటువంటి వృషభరాశిలోకి 28మార్చ్ మధ్యాహ్నము 15:36 నిమి ప్రవేశిస్తాడు. వేద జ్యోతిష్యశాస్త్ర ప్రకారము, ఈ సంచారము యొక్క ప్రభావము 12రాశులపై ఉంటుంది. ఫలితముగా వృషభరాశి వారికి, సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. మీరుకూడా ఈవిధమైన ఫలితములు పొందుటకు మీరు అవసరమైన పద్ధతులనుఅవలంభించవలసి ఉంటుంది.కావున ఎటువంటి ఆలస్యము చేయకుండా 12 రాశుల యొక్క ఫలాలు తెలుసుకోండి.
ఈఫలితాలు చంద్రునియొక్క సంచారము ఆధారముగా గణించబడినది.మీకు ఒకవేళ చంద్రరాశి గణన తెలియనట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి. చంద్రరాశి కాలిక్యులేటర్
మేషరాశి ఫలాలు:
వృషభరాశిలోకి శుక్ర సంచారము వలన, శుక్రుడు మీయొక్క 2వఇంట సంచరిస్తాడు. అంతేకాకుండా
మీయొక్క 7వ ఇంట కూడా సంచరిస్తాడు. ఈసంచార ఫలితముగా, మీయొక్క మాటతీరులో మాధుర్యము మరియు
చాతుర్యము పెరుగుతుంది. ఇది ఇతరులను మంత్రముగ్ధులను చేస్తుంది. దీనితోపాటుగా, మీయొక్క
స్నేహితుల సర్కిల్ పెరగడమే కాదు, మీయొక్క సామాజిక స్థాయి కూడా పెరుగుతుంది. మీరు మంచి
రుచికరమైన ఆహారమును సేవిస్తారు. మీరు ఈ సమయములో మీరు కొత్త వస్తువులను మరియు బంగారు
ఆభరణములను కొనుగోలు చేస్తారు. కొన్ని గృహోపకరణములను కొనుగులు చేస్తారు. మీయొక్క రాబడి
పెరుగుతుంది మరియు మీరుచెప్పుకోదగిన లాభాలను పొందుతారు. మీకు వివాహముఅయినట్లయితే, మీయొక్క
భాగస్వామి మీ ఆనందమునకు కారణమవుతారు. మీయొక్క ఆర్ధిక పరిస్థితి దృఢమవుతుంది. మొత్తముగా
చూసుకుంటే ఈసంచారము మీకు అనుకూలతను కలిగిస్తుంది. అంతేకాకుండా మీరు అదనంగా విలాసాలను
మరియు సౌకర్యములను పొందుతారు. కానీదేనికైనా ఒకహద్దు ఉంటుందని గుర్తుంన్చుకొంది మరియు
అతి సౌకర్యము వలన మీరు అనారోగ్య సమస్యలను ఎదురుకొనవల్సి ఉంటుంది. మీయొక్క పేరుప్రఖ్యాతలు
సంఘములో పెరుగుతాయి.
పరిహారము : శివలింగమునకు శుక్రవారము అన్నముతో అభిషేకము చేయుట చెప్పదగిన సూచన.
కుజ సంచార ప్రభావము మేషరాశిపై ఎలాంటి ప్రభావము చూపెడుతున్నదో తెలుసుకుందాము: కుజ సంచారము
వృషభరాశి ఫలాలు:
వృషభరాశికి అధిపతి శుక్రుడు. అంతేకాకుండా ఈ సంచార సమయములో శుక్రుడు మీయొక్క సొంత రాశిలోకి
లగ్న స్థానంలోకి ప్రవేసిస్తాడు మరియు 6వఇంట కూడా సంచరిస్తాడు. శుక్రుడు మీయొక్క లగ్నస్థానంలోకి
ప్రవేశించుటద్వారా మీరు ఆరోగ్య పరముగా కొన్ని ఎత్తుపల్లాలను చూస్తాడు. మీరు మీయొక్క
ఆహారనియమాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. సరైన ఆహార నియమములు పాటించుటవలన మీరు మీయొక్క
అనారోగ్య సమస్యలకు దూరముగా ఉండవచ్చును. మీయొక్క వ్యక్తిత్వము మరింత మధురముగా ఇతరులను
ఆకట్టుకునే విధముగా ఉంటుంది. వైవాహిక జీవితము మరింత ఆనందముగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఇద్దరు కలిసి ఆనందకర క్షణములను గడుపుతారు. మీయొక్క వైవాహిక జీవితములో ఏమైనా సమస్యలు
ఉన్నట్టయితే అవి సమసిపోతాయి. వ్యాపారపరముగా మీరు అనుకూల ఫలితములను పొందుతారు మరియు
లాభాలను పొందుతారు. మీరు ఆడవారికి తగినంత గౌరవము ఇవ్వాలి. వారి ఎదుట తప్పుగా మాట్లాడకూడదు.ఇది
మీరు మనస్సులో ఉంచుకుని ప్రవర్తించుట చెప్పదగిన సూచన. లేనిచో భయంకరమైన సమస్యలను ఎదురుకుంటారు.
మీరు మీయొక్క భావాలను మరియు కోర్కెలను నియంత్రణలో ఉంచుకొనుట మంచిది. మీరు ఎక్కువగా
వివాదాలపైఆసక్తిని చూపుతారు.మీయొక్క ప్రత్యర్థులపై జాగ్రత్త వహించుట చెప్పదగిన సూచన.
లేనిచో వారు మీయొక్క పేరుప్రతిష్టలను భంగం కలిగించే అవకాశము ఉన్నది.
పరిహారము : ఒపెల్ జాతిరత్నము ధరించుట చెప్పదగిన సూచన.
కుజ సంచార ప్రభావము వృషభరాశిపై ఎలాంటి ప్రభావము చూపెడుతున్నదో తెలుసుకుందాము: కుజ సంచారము
మిథునరాశి ఫలాలు:
వృషభరాశిలో శుక్ర సంచారము వలన, మిథునరాశిలో శుక్రుడు మీయొక్క 12వ ఇంట సంచరిస్తాడు.
అంతేకాకాకుండా మీయొక్క 5వ ఇంట సంచరిస్తాడు. ఈయొక్క సంచార ప్రభావంవలన, మీయొక్క ఖర్చులు
విపరీతముగా ఆకస్మికముగా పెరుగుతాయి. తద్వారా మీయొక్క ఆర్ధిక కష్టములు కూడా పెరుగుతాయి.
అయినప్పటికీ, మీయొక్క రాబడి పెరుగుతుంది. కావున, మీరు మీయొక్క అధిక ఖర్చులను తట్టుకుని
నిలబడగలరు. చట్టపరంగా మీరు ఆనందములను మరియు సౌకర్యములను పొందుటకు మీకు అవకాశము మీకు
లభిస్తుంది. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యాసిస్తున్న విద్యార్థులు ఉన్నారో,
వారికి ఈ సంచార సమయము అనుకూలముగా ఉంటుంది. మీరు కోరుకున్న విద్యాసంస్థలో మీరు విజయాలను
అందుకుంటారు. మీయొక్క ప్రత్యర్ధులు మీయొక్క గౌరవమర్యాదలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు.
కావున మీరు జాగ్రత్తగాఉండుట చెప్పదగిన సూచన. అతి సౌకర్యవంతమైన జీవితమువలన మీరు కొన్ని
అనారోగ్య సమస్యలను ఎదురుకొనవలసి ఉంటుంది.కావున మీరు ఆరోగ్య విషయములో జాగ్రత్తగా వ్యవహరించుట
చెప్పదగిన సూచన. మీయొక్క సంతానము కూడా అనవసరముగా మీచేత ఖర్చు చేయించడానికి ప్రయత్నిస్తారు,
కావున మీరు వాటికి సిద్ధముగా ఉండాలి.
పరిహారము : ప్రతిరోజు ఆవుకు మీరు గడ్డిని ఆహారముగా వేయాలి.
కుజ సంచార ప్రభావము మిథునరాశిపై ఎలాంటి ప్రభావము చూపెడుతున్నదో తెలుసుకుందాము: కుజ సంచారము
కర్కాటకరాశి ఫలాలు:
వృషభరాశిలో శుక్ర సంచారము కారణముగా, శుక్రుడు మీయొక్క 11వఇంట సంచరిస్తాడు మరియు మీయొక్క
4వఇంటిపై సంచరిస్తాడు. శుక్రుడు మీయొక్క సొంతఇంటిలో సంచరించుట వలన మీరు ఆర్ధిక లాభాలను
మరియు ప్రయోజనములను పొందుతారు. మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమును పొందుతారు. మొత్తముగా
చూసుకుంటే మీయొక్క ఆర్ధికపరిస్థితి దృఢపడుతుంది. మీయొక్క రాబడి పెరుగుతుంది మరియు సమాజములో
పెద్దవారిని మీరు కలుసుకుంటారు. తద్వారా మీరు జీవితములోఉన్నత స్థానములకు చేరుకుంటారు.
వ్యాపార పరముగా చూసుకుంటే, మంచి లాభాలను అందుకుంటారు మరియు మీయొక్క ట్రేడ్ రంగాలను
విస్తరించడానికి ప్రణాళికలను రూపొందించుకుంటారు.ఆస్తిపరంగా మీరు అద్భుతమైన ఫలితములను
అందుకుంటారు. కొన్ని స్థిరాస్తులను అద్దెకు ఇవ్వటం ద్వారా మీరు రాబడిని పొందుతారు.
కార్యాలయాల్లో మీయొక్క ఉన్నతాధికారులతో, సంబంధములు మెరుగుపడతాయి.తద్వారా మీరు మంచి
ఫలితములను పొందుతారు. మీరు మీయొక్క జీవిత భాగస్వామితో ఆనందకర క్షణములను గడుపుతారు మరియు
మీయొక్క బంధము మరింత వృద్ధి చెందుతుంది. వృషభరాశిలో శుక్ర సంచారము మీయొక్క కలలను మరియు
ఆశయములను నెరవేర్చుకొనుటలో మీకు సహకరిస్తుంది. మీయొక్క కోర్కెలు నెరవేరుతాయి. విద్యాపరముగా
మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. మీకు వివాహము అయ్యి సంతానము ఉన్నట్టయితే మీరు మీయొక్క
సంతాన అభివృద్ధికి సంతృప్తి చెందుతారు.
పరిహారము : శ్రీ సూక్తం శుక్రవారం రోజున పఠించుట మంచిది.
కుజ సంచార ప్రభావము కర్కాటకరాశిపై ఎలాంటి ప్రభావము చూపెడుతున్నదో తెలుసుకుందాము: కుజ సంచారము
సింహరాశి ఫలాలు:
వృషభరాశిలో శుక్ర సంచారము వలన, శుక్రుడు మీయొక్క మూడోవ మరియు పదోవఇంటకి అధిపతి. ఈ సంచార
ప్రభావము వలన, మీరు అన్నింటా విజయాలను అందుకుంటారు. మీయొక్క పనితీరు వలన మీరు సమాజములో
గౌరవాన్ని మరియు పేరును పొందుతారు. అయినప్పటికీ, మీరు గాసిప్ లకు మరియు వివాదాలకు దూరముగా
ఉండండి. లేనిచొ, మీయొక్క సీనియర్ అధికారులకు వ్యతిరేకముగా మాట్లాడినట్టు అవుతారు మరియు
మీమీద వ్యతిరేక భావాలను తెలియచేస్తుంది.ఈయొక్క సంచార ప్రభావంవలన మీయొక్క కుటుంబ జీవితము
ఆనందముగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబసభ్యులు కొత్త వాహనములను లేదా స్థిరాస్తిని
కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యుల మధ్య ప్రేమానురాగాలు వృద్ధిచెందుతాయి. మీయొక్క తోబుట్టువులు
మీకు సహాయసహకారములను అందిస్తారు. మీతండ్రిగారు కూడా మీకు సహాయసహకారములు అందించుటవలన
మీరు వృత్తిపరంగా విజయాలను అందుకుంటారు. కుటుంబములో శుభప్రదమైన కార్యక్రమము చోటుచేసుకుంటుంది.తద్వారా
కుటుంబములో ఆనందము మరియు ఉల్లాసము మరియు ఉత్సాహము చోటుచేసుకుంటాయి.
పరిహారము : మీరు మహాలక్ష్మిదేవిని పూజించుటద్వారా మరింత అనుకూల ఫలితములను పొందవచ్చును.
కుజ సంచార ప్రభావము సింహరాశిపై ఎలాంటి ప్రభావము చూపెడుతున్నదో తెలుసుకుందాము: కుజ సంచారము
కన్యారాశి ఫలాలు:
శుక్రుడు కన్యారాశివారికి, రెండొవ మరియు తొమ్మిదొవ ఇంటి అధిపతి. వృషభరాశిలో సంచార సమయములో
మీయొక్క 9వఇంట సంచరిస్తాడు.ఈస్థానము అదృష్టమును సూచిస్తుంది. ఫలితముగా మీరుచేసే ప్రతిపనిలో
మీరు అదృష్టమును కలిగిఉంటారు. చాలా కాలమునుండి సాగుతున్న పనులు ఊపందుకుంటాయి. ఆర్ధిక
ప్రయోజనాలను పొందుటకు మీకు కొత్త దారులు ఏర్పడతాయి. తద్వారా ఆర్ధికలాభాలను పొందుతారు.
చాలా కాలమునుండి అందవలసిన ధనము మీకు అందుతుంది. మీయొక్క గౌరవమర్యాదలు పపెరుగుతాయి.
విహార యాత్రలు చేస్తారు. కుటుంబముతో కలిసి విహారయాత్రలు మరియు దూరపు ప్రయాణములు చేస్తారు.
ఉద్యోగాల్లో స్దానచలనము పొందే అవకాశమున్నది. ఇదిమీకు అనుకూల ప్రయోజనములను కలిగిస్తుంది.
వ్యాపారస్తులు మంచి లాభాలను మరియు విజయాలను అందుకుంటారు. మీయొక్క రాబడి పెరుగుతుంది.
మీకంటే చిన్నవారైన మీయొక్క తోబుట్టువులు వారియొక్క వృత్తిలో మంచి ప్రయోజనములు పొందుతారు
తద్వారా విజయాలను అందుకుంటారు. కుటుంబములో పెళ్లిసందడి నెలకొనే అవకాశమున్నది. మీయొక్క
స్నేహితుల సమూహము వృద్ధిచెందుతుంది. ప్రయాణాలలో మీరుకొత్త స్నేహితులను కలుసుకుంటారు.
పరిహారము : ఆరుముఖముల రుద్రాక్షను ధరించుటద్వారా మీరు మరిన్ని అనుకూల ఫలితములను పొందగలరు.
కుజ సంచార ప్రభావము కన్యరాశిపై ఎలాంటి ప్రభావము చూపెడుతున్నదో తెలుసుకుందాము: కుజ సంచారము
తులారాశి ఫలాలు:
వృషభరాశిలో శుక్ర సంచారమువలన, శుక్రుడు వృశ్చికరాశిలో మీయొక్క 8వఇంట సంచరిస్తాడు. దీనితోపాటుగా
శుక్రుడు మీయొక్క రాశికి అధిపతి మరియు 8వఇంటికి కూడా అధిపతిగా ఉంటాడు. శుక్రుడు మీయొక్క
8వఇంట సంచారమువలన కొన్ని ప్రత్యేకమైన ఫలితములు మీకు సంప్రాప్తిస్తాయి. ఆకస్మిక ధనలాభము
మీకు కలిసివస్తుంది. అనేక అనుకూలఫలితములు మీకు సంప్రాప్తిస్తాయి. మీకు విలాసవంతమైన
మరియు సౌకర్యవంతమైన జీవితాన్ని పొందాలనే మీయొక్క కోర్కెలు నెరవేరుతాయి. మీరు ఇతరులకంటే
పనిమంతులు అని నిరూపించుకోవటానికి, మీరు కష్టపడి పనిచేస్తారు.కొన్ని అనారోగ్య సమస్యలు
తలెత్తే అవకాశమున్నది. కావున మీయొక్క ఆహారపు అలవాట్లపైన మీరు జాగ్రత్తగా వ్యవహరించుట
చెప్పదగిన సూచన. మీకు వివాహము అయినట్లయితే, మీరు మీయొక్క అత్తమావయ్యలతో కలిసి, వివాహ
వేడుకకు లేదా కుటుంబ శుభకార్యక్రమమునకు హాజరు కావాల్సిఉంటుంది. తద్వారా వారితో మీయొక్క
బంధము మరింతగా దృఢపడుతుంది. కుటుంబములో ప్రేమానురాగాలు వృద్ధిచెందుతాయి. అనవసర మరియు
ఆకస్మిక ప్రయాణములు చేయవలసి ఉంటుంది.కానీ, చివరగా ఇదిమీకు లాభాలను తెచ్చి పెడుతుంది.మొత్తముగా
చూసుకుంటే మీకు చాలా అనుకూలముగా ఉంటుంది.మీరు మీయొక్క అసందర్భ ఆహారపు అలవాట్లను మార్చుకొనవల్సి
ఉంటుంది. లేనిచో మీరు అనారోగ్య సమస్యలను ఎదురుకోనవలసి ఉంటుంది.వృత్తిపరమైన జీవితవిషయానికి
వస్తే, మీకు అనుకూలముగా ఉంటుంది. మీయొక్క శక్తి సామర్ధ్యములను నిరూపించుకునేందుకు మీకు
అనేక అవకాశములు లభిస్తాయి.
పరిహారము : ఓం శుం శుక్రాయ నమః" అనే శుక్రబీజ మంత్రమును ప్రతిరోజు జపించుట చెప్పదగిన సూచన.
కుజ సంచార ప్రభావము తులారాశిపై ఎలాంటి ప్రభావము చూపెడుతున్నదో తెలుసుకుందాము: కుజ సంచారము
వృశ్చికరాశి ఫలాలు:
వృషభరాశిలో శుక్ర సంచారమువలన, వృశ్చికరాశి వారికి ఈసంచారము అనుకూలముగా ఉంటుంది.మీయొక్క
7వమరియు 11వఇంటికి అధిపతిగా ఉంటాడు. ఈసమయములో మీయొక్క 7వస్థానములో సంచరిస్తాడు. మీయొక్క
వైవాహికజీవితము అనుకూలముగా మరియు ఆనందముగా ఉంటుంది. మీయొక్క బంధములో ఏమైనా సమస్యలు
ఉన్నట్టయితే, అవి తొందరలోనే సమసిపోతాయి.ఇద్దరిమధ్య ప్రేమనురాగాలు దృఢమవుతాయి. విదేశీ
వ్యవహారములనుండి మీరు లాభాలను అందుకుంటారు. ఎగుమతులు మరియు దిగుమతుల వ్యాపారము చేస్తున్నవారికి
అత్యంత అనుకూల సమయముగా చెప్పవచ్చును. వీరు మంచి లాభాలను అందుకుంటారు.ఈసమయములో అదృష్టము
మీవెన్నంటె ఉంటుంది. ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. మీయొక్క వ్యక్తిత్వములో అనుకూల మార్పులను
కనుగొంటారు. సమాజములో మీరు గుర్తింపబడతారు. కొంతమంది వారియొక్క జీవితభాగస్వాములకొరకు
ఎక్కువగా ఖర్చుచేస్తారు. ఇది వారియొక్క ఆనందమునకు కారణమవుతుంది.
పరిహారము : మరిన్ని అనుకూల ఫలితములుకొరకు మీరు రోజు కుబేరమంత్రమును పఠించండి..
కుజ సంచార ప్రభావము వృశ్చికరాశిపై ఎలాంటి ప్రభావము చూపెడుతున్నదో తెలుసుకుందాము: కుజ సంచారము
ధనస్సురాశి ఫలాలు:
వృషభరాశిలో శుక్ర సంచారమువలన, శుక్రుడు మీయొక్క 6వఇంట సంచరిస్తాడు.అనగా శుక్రుడు దానియొక్క
సొంత స్థానములో సంచరిస్తాడు.దీనితోపాటుగా 11వ ఇంటకూడా సంచారము ఉంటుంది. ఈస్థానము అంత
అనుకూలముగా ఉండదు. ఇదిమీకు అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అనేక అనారోగ్య సమస్యలు
తలెత్త వచ్చును. మీయొక్క రాబడి కూడా తగ్గుతుంది.అంతేకాకుండా మీయొక్క ఖర్చులుకూడా మీయొక్క
ఆర్ధికస్థితిపై భారమును చూపెడతాయి. మీయొక్క ప్రత్యర్ధులు మీపై ఆధిపత్యమును చెలాయించడానికి
ప్రయత్నిస్తారు. కావున, మీరు జాగ్రత్తగా ఉండుట చెప్పదగిన సూచన. ఎటువంటి వివాదాల్లో
మరియు గొడవల్లో తలదూర్చకండి. ఆడవారిని గౌరవించండి.మీయొక్క బంధువుల్లో ముఖ్యముగా ఆడవారిని
గౌరవించండి. లేనిచో, మీరు వివాదాలలో ఇరుక్కుపోవలసి ఉంటుంది. మీయొక్క కోర్కెలను నెరవేర్చుకొనుటకు
మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. పోటీపరీక్షల్లో కష్టపడి చదువుటద్వారా మాత్రమే మీరు మంచి
ఫలితాలను అందుకుంటారు. అంతేకాకుండా మీరు నీటిసంబంధిత వ్యాధులతో భాదపడే అవకాశమున్నది.
పరిహారము : శుక్రవారం పంచదార మరియు బియ్యమును దానము చేయండి..
కుజ సంచార ప్రభావము ధనస్సురాశిపై ఎలాంటి ప్రభావము చూపెడుతున్నదో తెలుసుకుందాము: కుజ సంచారము
మకరాశి ఫలాలు:
వృషభరాశిలోకి శుక్ర సంచారము వలన, శుక్రుడు మీయొక్క 5వఇంట సంచరిస్తాడు.శుక్రుడు మీకు
యోగకారక స్థానములో ఉన్నాడు.ఫలితముగా మీకుఈసంచారము యొక్క ఫలాలు అద్భుతముగా ఉంటాయి. మీయొక్క
రాబడి పెరుగుతుంది. సమాజములో మీయొక్క పేరుప్రఖ్యాతలు వృద్ధిచెందుతాయి. విద్యాసంబంధిత
విషయాల్లో మీకు అనుకూల ఫలితాలువస్తాయి. మీరు మీయొక్క మంచి భవిష్యత్తుకొరకు సరైన దారిలో
మీరు నడుస్తారు. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో మీరు మంచిఫలితములను పొందుతారు. మీరు
మీయొక్క ప్రియమైంవారితో కల్సి ఆనందకర సమయమును గడుపుతారు. ఇద్దరిమధ్య బంధము మరింత దృఢ
పడుతుంది. వైవాహిక జీవితము వారియొక్క సంతానమునకు అనుకూలముగా ఉంటుంది. ఇంకొంతమందికి
ఈసమయములో సంతానము కలుగుతుంది.మీరు ఉద్యోగమార్పు పొందే అవకాశమున్నది. ఇదే సమయములో మీరు
అనేక మంచి అవకాసములను పొందుతారు. ఇప్పటికే కొత్త ఉద్యోగాల్లో చేరినవారు మంచి ఫలితాలను
అందుకుంటారు. వ్యాపారస్తులకు అత్యంత అనుకూల సమయముగా చెప్పవచ్చును.
పరిహారము : మంచి నాణ్యత కలిగిన ోపాల్ రాయిని మీరు ధరించండి.
కుజ సంచార ప్రభావము మకరరాశిపై ఎలాంటి ప్రభావము చూపెడుతున్నదో తెలుసుకుందాము: కుజ సంచారము
కుంభరాశి ఫలాలు:
వృషభరాశిలో శుక్ర సంచారము వలన, మీయొక్క జీవితములో ఆనందము మరియు ఆహ్లాదము నిండుకుని
ఉంటుంది. అంతేకాకుండా, మీరు అనేక సౌకార్యములను మరియు సుఖాలను పొందుతారు. శుక్రుడు మీయొక్క
4వఇంట సంచరిస్తాడు. అంతేకాకుండా మీయొక్క 9వఇంట కూడా సంచరిస్తాడు. ఈస్థానము అదృష్టమును
సూచిస్తుంది. ఫలితముగా మీయొక్క అదృష్టము వృద్ధి చెందుతుంది. తద్వారా, మీరు మీయొక్క
కొత్తఇంటిని నిర్మించుకునే అవకాశమున్నది. ఈ సంచార సమయములో మీరు కొత్తవాహనములు కొనుగోలు
చేసే అవకాశమున్నది. మీకు ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నట్టయితే, మీరు ఇంటి సుదరీకరణ కొరకు
మీరు మీయొక్క ధనమును ఖర్చుచేస్తారు. కుటుంబములో ఆనందకర వాతావరణము చోటుచేసుకుంటుంది.
ఇంట్లో శుభప్రదమైన కార్యక్రమము చేస్తారు. ఈసమయములో మీయొక్క తల్లిగారు ఆనందముగా ఉంటారు.
వృత్తిపరంగా మీకు అనుకూలముగా ఉంటుంది. మీరు మీయొక్క వృత్తులలో దూసుకు వెళ్తారు. కార్యాలయాల్లో
మీయొక్క పనిరీత్యా మీరు గుర్తించబడతారు మరియు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీరు
ఇంతకముందు ఏదైనా స్థిరాస్థి మీద పెట్టుబడులు పెట్టినట్టైతే, అవి వృద్ధి చెందుతాయి.
మీకు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. విదేశాల్లో ఉన్నవారికి ఇంటికి తిరిగివచ్చే అవకాశములు
లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకర సమయము గడపటంవలన మీరు మరింత ఉత్సాహముగా ఉంటారు.
మీయొక్క మానసిక ఒత్తిడులుకూడా దూరమవుతాయి.
పరిహారము : శుక్రుడి యొక్క మరింత అనుకూలతకొరకు మీరు ఆరుముఖముల రుద్రాక్షను ధరించండి.
కుజ సంచార ప్రభావము కుంభరాశిపై ఎలాంటి ప్రభావము చూపెడుతున్నదో తెలుసుకుందాము: కుజ సంచారము
మీనరాశి ఫలాలు:
వృషభరాశిలోకి శుక్రసంచార కారణముగా, శుక్రుడు మీనరాశిలో మూడోవ ఇంట మరియు ఎనిమిదొవ ఇంట
సంచరిస్తాడు. ఫలితముగా జీవితములో అనేక ఒడిదుడుకులను ఎదురుకుంటారు.కావున, మీరు జాగ్రత్తగా
వ్యవహరించుట చెప్పదగిన సూచన. ఆరోగ్యపరముగా చూసుకుంటే, మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించుట
చెప్పదగిన సూచన.మీరు అనేక అనారోగ్య సమస్యలతో భాదపడే అవకాశమున్నది. ప్రయాణములు చేయుట
మీకు కలసి వస్తాయి. మీరు అనేక ప్రయోజనములను పొందుతారు. ఈయొక్క ప్రయాణములలో మీరు మీయొక్క
ప్రత్యేకమైనవారిని కలుసుకుంటారు. ఇదే సమయములో మీయొక్క రాబడి పెరుగుతుంది. మీయొక్క తోబుట్టువులుకూడా
ఆర్థికపరమైన ప్రయోజనములను పొందుతారు. అయినప్పటికీ , మీరుకొంత ఒత్తిడికర పరిస్థితులను
ఎదురుకుంటారు . మీరు మీయొక్కసహుద్యోగులపై మీయొక్క పనులకొరకు ఆధార పడతారు. మంచి విషయము
ఏమిటంటే, వారుమీకు ఎల్లవేళలా సహాయపడతారు మరియు వారితో మీయొక్క బంధము దృఢపడుతుంది. ఇది
మీయొక్క వృత్తిపరమైన జీవితముపై అనుకూల ప్రభావము ఉంటుంది. మీరు కళలపట్ల ఆసక్తిని కనపరుస్తారు
మరియు సృజనాత్మకంగా ఆలోచిస్తారు. ఇదిమీకు ఆర్ధిక ప్రయోజనాలను అందివ్వకపోయిన, సంఘములో
పేరుప్రఖ్యాతలను సాధించిపెడుతుంది.
పరిహారము : శుక్రవారం ఏదైనా గుడిని సందర్సించి అలంకరణ సంబంధిత వస్తువులను దానము చేయండి.
కుజ సంచార ప్రభావము మీనరాశిపై ఎలాంటి ప్రభావము చూపెడుతున్నదో తెలుసుకుందాము: కుజ సంచారము
జ్యోతిష్య శాస్త్ర అన్ని పరిష్కారములకు, రుద్రాక్షలు మరియు జాతిరత్నములకొరకు, మాయొక్క ఆస్ట్రోసేజ్ని సందర్శించండి.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada