Rasi Phalalu 2016 - రాశి ఫలాలు 2016
Rasi Phalalu 2016, on the basis of Telugu astrology, provides a comprehensive analysis of upcoming year. Read your Telugu horoscope for 2016 to know what future holds for you...
కాస్తంత కిటికినీ తెరిచి, రాశి ఫలాలు 2016 ద్వారా మీ భవిష్యత్తును వీక్షించండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగేలా నిధులు వస్తాయా? మీ జీవితంలో ప్రేమ విరబూస్తుందా? మీ కుటుంబజీవితంలో సామరస్యం వెల్లివిరుస్తుందా? ఉచితంగా అందించబడ్డ దీనిని చదవడం ద్వారా ప్రతిదానికి సమాధానాలను పొందండి.
గమనిక: ఈ జ్యోస్యాలు మీ జన్మరాశిపై ఆధారంగా చెప్పబడ్డాయి. మీకు మీ జన్మరాశి గురించి తెలియకపోతే, దయచేసి ఈ పేజీని సందర్శించండి - AstroSage జన్మరాశి లెక్కింపు.
మేషం
ఈ సారివారికి 2016వ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. వైవాహిక జీవితంలో ఒత్తిడి
చోటు చేసుకోవచ్చు, వృత్తిగత జీవితంలో గొప్ప విజయాలను మీరు సాధిస్తారు. మేషరాశివారు
ఈ విషయంలో గొప్పగా సంతోషించాల్సిన పరిస్థితి కాదు, ఎందుకంటే ఈ విజయం ఎంతో ఆలస్యంగా
వస్తుంది. వ్యాపారవేత్తల విషయానికి వస్తే, పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టరాదని సలహా
ఇవ్వబడుతోంది. అనవసరమైన వాటిపై డబ్బు పెట్టుబడి పెట్టకుండా నియంత్రించుకోవడం ఈ సంవత్సరంలో
ఎంతో ముఖ్యం. మీ ప్రేమజీవితంలో ఏదీ కూడా ఆసక్తికంగా కనిపించదు. మీ లైంగికజీవితం సాన్నిహిత్యాన్ని
మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. అవసరమైన వాదనల పట్ల దృష్టి సారించవద్దు. మీరు ఎల్లప్పుడూ
తగదాలు పెట్టుకుంటారు, దీని వల్ల ఏదీ కూడా సానుకూలంగా జరగదు. షేర్ మార్కెట్ నుంచి దూరంగా
ఉండండి. ఆగస్టు తరువాత మీ జీవితంలో మంచి రోజులు ప్రవేశిస్తాయి, అయితే సంవత్సరం అంతా
కూడా జాగ్రత్తగా ఉండాలి.
వృషభం
వృషభరాశి వారికి ఈ ఏడాది ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది. జీవితభాగస్వామితో స్వచ్ఛమైన మరియు
అనురాగపూర్వక బంధాన్ని కలిగి ఉన్నట్లయితే ప్రతిదీ కూడా సజావుగా సాగుతుంది. ఈ ఏడాది
మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది మరియు మీ జీవితభాగస్వామితో మీరు సంతోషకర సందర్భాలను
పంచుకుంటారు. సేవారంగంలో ఉన్న వ్యక్తులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు. వ్యాపారులకు
తక్షణం లాభాలు రాకపోయినా, నిలకడగా ఉంటుంది. ప్రేమజీవితం వికసిస్తుంది, మరియు మీకు అన్నివిధాలుగా
సంతోషాన్ని అందిస్తుంది. అంతర్గత ఆనందం ఉన్నంత వరకు కూడా దేనినైనా సాధించడం తేలిక అవుతుంది.
అయితే, మీ లైంగిక వాంఛల కారనంగా మీ యొక్క దృష్టి పట్టు తప్పవచ్చు. దీని వల్ల వివాహేతర
సంబంధాలకు దారితీయవచ్చు. అటువంటి విషయాల యొక్క ఫలస్వరూపాలను మీరు అర్థం చేసుకోవచ్చు,
కనుక, వాటి నుంచి దూరంగా ఉండండి. చిట్టచివరగా, ఈ ఏడాది మీకు ఆర్థికంగా ఎంతో గొప్పగా
ఉంటుంది. మీరు పెద్దమొత్తంలో డబ్బు సంపాదిస్తారు. 2016 సంవత్సరం మీకు ఆర్థికంగా ఎన్నింటినో
అందిస్తుంది.
మిధున రాశి
ఈ ఏడాదిలో అధికభాగం మీకు అనుకూలంగా ఉంటుంది ప్రేమ మరియు అనురాగం మిమ్మల్ని మీ జీవితభాగస్వామిని
దగ్గరకు చేరుస్తుంది, తద్వారా సామరస్యం వెల్లివిరిస్తుంది. మరోవైపున, మీబంధువులకు మరియు
మీ జీవితభాగస్వామి మధ్య సంబంధాల్లో అటూఇటూ రెండుగా ఉంటాయి. మీ దేహమే దేవాలయం, కనుక,
దానిని తీవ్రంగా పట్టించుకునేలా చూడండి. ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం మీ రోజువారీ
జీవితంలో భాగం కావాలి. మీ ఖర్చుల్ని అదుపులో పెట్టుకోండి, ఎందుకంటే మీకు వచ్చే డబ్బు
విషయంలో కాస్తంత చికాకులు ఉండవచ్చు. ప్రతి ఆర్థిక వివాదం నుంచి దూరంగా ఉండటం కొరకు,
అప్పు తీసుకోవడం నుంచి దూరంగా ఉండండి. వేద జ్యోతిష్యం ప్రకారం, 2016 సంవత్సరం వ్యాపారవేత్తలకు
లాభాలను తీసుకొస్తుంది. డబ్బును సంపాదించడం కొరకు, వారు చట్టవ్యతిరేక మార్గాలను ఆశ్రయిస్తారు.
అయితే, ఈ అవసరాలను పరిహరించాల్సి ఉంటుంది. ప్రేమ విషయాలు పురోగామిగా కనిపిస్తాయి, శృంగారం
మీ జీవితంలో సంతోషాన్ని విరబూయిస్తుంది. సాధారణ విషయాలతో పోలిస్తే, ఎలాంటి గొప్ప సమస్యల్ని
మీరు ఎదుర్కొనరు.
కర్కటరాశి
వ్యక్తిగత జీవితపరంగా కర్కటరాశి వారికి గొప్ప జీవితం ఎదురు చూడబడుతోంది. అయితే, మీ
కుటుంబసభ్యులతో మీ సంబంధాలు అంత గొప్పగా ఉండవు. మీ ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి,
లేనిపక్షంలో ప్రధాన వ్యాధులు మీపై దాడి చేయవచ్చు. మీ ఆర్థిక విషయాలకు సంబంధించి జాగ్రత్తగా
ఉండండి ఎవరైనా గుడ్డిగా నమ్మడం వల్ల ఆర్థికాంశాల్లో నష్టం వాటిల్లుతుంది. ప్రతి విషయం
పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది, ఎందుకంటే ఎదుటివారు మీకు విరుద్ధంగా పథకాలను
రచించవచ్చు. ఉద్యోగం మారడానికి ఈ ఏడాది అద్భుతమైనది, కనుక, ఉద్యోగం మారడం కొరకు మీ
ప్రయత్నాలను ముమ్మరం చేయండి. కొంతమంది కర్కాటక రాశివారికి పనిభారం పెరగవచ్చు, దీని
వల్ల మీ జీతం సైతం పెరగవచ్చు. కొంతమంది కర్కాటక రాశివారు, ఇతర కులాలకు చెందినవారితో
ప్రేమలో పడవచ్చు. అయితే, ఈ సంబంధం బలంగా కనిపిస్తుంది. ఈ ఏడాది మీ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలని
మీకు సలహా ఇవ్వబడుతోంది. మీ లైంగిక జీవితాన్ని సంతోషమయంగా మార్చుకోవడం కొరకు, దీనిని
మీరు మీ మదిలో పెట్టుకోవాలి.
సింహం
సింహరాశి వారికి 2016 ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. మీ జీవితంలోని ప్రతి ఒక్క విషయం కూడా
సరైన పథంలో సాగుతుంది. మీ జీవితభాగస్వామి మరియు మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో మీకు
హార్థిక బంధనం ఉంటుంది. ఆరోగ్య విషయానికి వస్తే, మీ బరువు పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.
దీనిని నియంత్రణలో ఉంచుకోవడానికి మరియు వ్యాధులు దరి చేరకుండా ఉండటం కొరకు హెవీ ఫుడ్
తినడం ఆపివేయాలి. మద్యానికి దూరంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యంలో గొప్ప సంచలనాలు చోటు చేసుకుంటాయి,
మీ ఆర్థిక జీవితం గురించి మాట్లాడితే, ఈ ఏడాది కూడా మీకు ఆశాజనకంగా ఉంటుంది. మీ సంపద
పెరుగుతుంది, అంటే మీకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. మీకు స్వంత వ్యాపారం ఉన్నప్పుడు
లేదా ఏదైనా సంస్థలో పనిచేస్తున్నా,తప్పకుండా లాభాలు వస్తాయి. పేరు, ప్రఖ్యాతి, మరియు
ప్రశంసలు మీ వృత్తిగత జీవితంలోనికి ప్రవేశిస్తాయి. 2016 జాతకం ప్రకారం, ప్రేమ గ్రాఫ్
పైకి పోయేట్లుగా కనిపిస్తోంది. అవిహితులైన సింహరాశివారు ఈ ఏడాది మూడుముళ్లు వేస్తారు.
మీ లైంగిక జీవితంపై మీరు దృష్టి సారించడం ద్వారా మీ శారీర వాంఛలు తీరతాయి. మీ జీవితభాగస్వామితో
మనోహరమైన సందర్భాలను మీరు గడుపుతారు.
కన్య
దురదృష్టవశాత్తు, మీ జీవితభాగస్వామితో మీరు ఆశించిన మేరకు సంబందాన్ని ఆస్వాదించలేకపోతారు.
కుటుంబసభ్యుల మధ్య సైతం తేడాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జీవితంలో ప్రతి అంశం
కూడా మీకు సమస్యలను తెచ్చేట్లుగా కనిపిస్తుంది, మీ ఆరోగ్యం సైతం ప్రభావితం అవుతుంది.
మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, మీరు దాని గురించి తీవ్రంగా పట్టించుకుంటే మీ ఆరోగ్యం
అంత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలకు సంబంధించి నష్టాలు వచ్చే సంభావ్యత ఉంది. బృహస్పతి
12వ స్థానంలో ఉండటం వల్ల మీకు సమస్యలను వచ్చే సంభావ్యత ఉంది. ఆగస్టు వరకు, ఎక్కువగా
ఆశించవవద్దు. ఈ నెల తరువాత మాత్రమే మీకు మెరుగుదల కనిపిస్తుంది. అయితే, ఒకవేళ మీరు
ఉద్యోగం చేస్తున్నట్లయితే, ప్రధాన సమస్యలు వేటినీ మీరు ఎదుర్కొనరు. మీ ప్రేమజీవితం
గురించిన సంభావ్యతలను చర్చించినట్లయితే, విషయాలు గొప్పగాను మరియు సజావుగాను సాగుతాయి.
మీ ఆలోచనలను మీరు నియంత్రించుకోవడం వల్ల నిజంగానే మీకు మేలు కలుగుతుంది.
తుల
ఉమ్మడి కుటుంబంలో ఉండే తులా రాశివారికి మరియు వారి కుటుంబసభ్యులకు మధ్య ఎలాంటి సామరస్యం
ఉండదు. మరోవైపున, చిన్నకుటుంబాల్లో ఉండే తులా రాశివారు కుటుంబజీవితంలో ఎంతో సంతోషాన్ని
పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామిపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి. 2016లో ఈ రాశికి
చెందిన వారి యొక్క వైవాహిక జీవితం ముగిసేందుకు దారితీయవచ్చు. మీకు మరియు మీ పిల్లలకు
మధ్య సాన్నిహిత్యాన్ని చూసినట్లయితే, మీ పిల్లల వైపు నుంచి కొన్ని సమస్యలు చోటు చేసుకునే
సంభావ్యత ఉంది. సేవారంగంలో ఉన్న వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితం మెరుగ్గా ఉంటుంది,
అయితే, వ్యాపారవేత్తలు, తమ వ్యాపారాల్లో సమస్యల్ని ఎదుర్కొంటారు. ఆగస్టు 11 తరువాత
పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే సంభావ్యత ఉంది. ఊహించని ఖర్చులు పెరగవచ్చు. ఈ
ఖర్చులు బాగా ఎక్కువగా ఉండవచ్చు, ముందస్తుగానే జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఇవ్వడం మరియు
తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే దీని వల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ప్రేమ మరియు శృంగారం వంటి విషయాల్లో మీ సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు. మీకు మరియు
మీ జీవితభాగస్వామి మధ్య అవగాహన ఏర్పడిన తరువాత మిగిలినది ఏదీ కూడా మీకు అవసరం లేదు.
శారీరక ఆనందాలను పొందడం కొరకు, మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దు.
వృశ్చికం
ఈ ఏడాది వృశ్చిక రాశి వారు తమ జీవితంలోని ప్రతి అంశంలోనూ కూడా తమ జీవిత భాగస్వామితో
సమన్వయం నెరపాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితం నిరంతరం ఎత్తుపల్లాలతో సాగుతుంది. మీ
పిల్లల యొక్క ప్రవర్తన కొన్నిసార్లు మీకు ఒత్తిడి కలిగించవచ్చు. బద్ధకం మీద నియంత్రణ
సాధించి మీ అంతట మీరు యాక్టివ్‌గా ఉండాలని సిఫారసు చేయబడుతోంది. తక్కువ ఆసక్తిగా ఉండటం
మరియు విందు వినోదాల్లో సమయాన్ని వృధా చేయడం వల్ల మీ ప్రయత్నాలపై వ్యతిరేక ప్రభావాలు
చూపించబడతాయి. మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోండి మరియు ఆగస్టు వరకు సాధ్యమైనంత ఎక్కువ
డబ్బును పొదుపు చేయండి. ఈ నెల తరువాత మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ప్రేమ జీవితం గురించి
మాట్లాడితే, నిశ్శబ్ధంగా ఉండండి మరియు మీకు మరియు జీవిత భాగస్వామి మధ్య ఎలాంటి సందేహాలు
లేదా అవగాహనా లోపం ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. ఆగస్టు వరకు, మీ ప్రేమ జీవితం పట్ల
జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం అన్నివిధాలుగా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది మరియు
మీరు శారీరక సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తారు. అయితే, దానిని మీరు నియంత్రించుకోవాలి,
మరియు దాని గురించి తరచుగా ఆలోచించరాదు.
ధనుస్సు
ధనుస్సురాశివారు చాలాసార్లు తమ కుటుంబసభ్యులతో వాదనలకు దిగవచ్చు. తోబట్టువులతో సైతం
తగాదాలు రావొచ్చు. క్రిములు మరియు కలుషితాల వల్ల ఈ ఏడాది వ్యాధులకు దారితీయవచ్చు. ఉద్యోగం
చేసేవారికి ఈ ఏడాది ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు తరువాత మాత్రమే పురోభివృద్ధి కనిపిస్తుంది.
ఆగస్టు వరకు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని సూచించబడుతోంది. వివాదాలను పరిహరించడం
కొరకు మరియు ప్రతిఒక్కరితో పనులు సజావుగా సాగడం కొరకు, ఈ ప్రవర్తన ఎంతో ముఖ్యమైనది.
మీ ఆర్థిక జీవితం విషయానికి వస్తే, బాగుంటుంది, అయితే, మోసాలు మరియు వంచన నుంచి మిమ్మల్ని
మీరు కాపాడుకోవాల్సి ఉంటుంది. వ్యాపారవేత్తల యొక్క గమ్యస్థాన కార్డులు ఈ ఏడాది అనుకూలంగా
లేవు. మీ కార్యకలాపాలు మరియు నిర్ణయాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండండి, లేనిపక్షంలో
మీరు జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది. అటువంటి ప్రతికూల పరిస్థితులను పరిహరించడం కొరకు,
చట్టవ్యతిరేక వ్యవహారాల నుంచి దూరంగా ఉండండి. ఇక చివరి విషయం ఏమిటంటే ఈ ఏడాది మీ జీవితంలో
ప్రతి విషయం పట్ల అత్యుత్తమంగా శ్రమించండి.
మకరం
వ్యక్తిగత జీవితం మీరు ఆశించిన విధంగా మీకు సుఖశాంతులను ఇవ్వదు. కుటుంబసభ్యులు మరియు
జీవితభాగస్వామితో వైరుధ్యాలు చోటు చేసుకోవచ్చు, ఇది కుటుంబవాతావరణాన్ని దెబ్బతీస్తుంది.
మీరు మాట్లాడే తీరును నియంత్రించుకోవాలని నక్షత్రాలు కోరుతున్నాయి. ఈ సలహాను పాటించండి
లేదా పరిణామాలకు మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోండి. అజీర్ణం, తలనొప్పి మరియు మానసిక
ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కేతు దశ లేనట్లయితే వ్యాపారంలో మీరు బాగా లాభాలు
సంపాదిస్తారు. మీ ఉద్యోగం ద్వారా మీకు గొప్ప లాభాలుంటాయి, గౌరవం, మరియు మర్యాదలు పెరుగుతాయి.
మీలో కొంతమంది కొత్త మరియు మెరుగైన ఉద్యోగాన్ని పొందుతారు. వ్యాపారవేత్తలకు సైతం ఇదే
తరహా లాభాలు మరియు ఫలితాలు చోటు చేసుకోవచ్చు. వారి కొరకు, ఈ ఏడాది ఎంతో అదృష్టవంతంగా
ఉంటుంది. ప్రభుత్వ డీల్స్ లేదా అగ్రిమెంట్‌లను మీరు పొందవచ్చు. మీ ప్రేమజీవితానికి
సైతం 2016 అద్భుతంగా ఉంటుంది. దీనిని సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ ఏడాది మీ జీవితంలోని
అత్యుత్తమ సంవత్సరాల్లో ఒకటి.
కుంభం
కుటుంబజీవితం సాధారణంగా ఉంటుంది. కొన్ని సాధారణ సమస్యలు చోటు చేసుకున్నప్పటికీ, బృహస్పతి
ఏడో స్థానంలో ఉండటం వల్ల పరిస్థితులు అదుపు తప్పవు. మెదడుపరంగా మీరు కొన్ని ఆరోగ్య
సమస్యల్ని ఎదుర్కొనవచ్చు. 2016సంవత్సరంలో మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు. ఆర్థికపరంగానే
కాకుండా మీ స్నేహితులు కూడా మీకు ఎంతో విలువను ఇస్తారు. మంచిది, సెంటిమెంట్స్‌కు దూరంగా
వెళ్లడం ద్వారా మీ స్నేహాలు మరియు బంధాలకు హాని జరుగుతుంది. కుంభరాశి వారు, ఈ ఏడాది
పేరుప్రఖ్యాతులు, గౌరవం మరియు హోదాపరంగా గొప్ప సంతోషాన్ని పొందుతారు. మీ సీనియర్లు
లేదా మీ సహోద్యోగులు, ప్రతి ఒక్కరూ కూడా మీలోని నైపుణ్యం ఉన్న ఉద్యోగిని చూస్తారు,
మరియు మీ పట్ల ప్రశంసలు కురిపిస్తారు. గుండె దిటవు చేసుకోండి, వ్యాపారవేత్తగా 2016
అనేది మీకు ఆశాజనకంగా ఉంటుంది. చిట్టచివరి విషయం ఏమిటంటే, మీ ప్రేమజీవితం సరైన మార్గంలో
సాగుతుంది.
మీనం
మీనరాశివారికి ఈ ఏడాది చెడ్డ ఫలితాలు చోటు చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులు అంత ఆశాజనకంగా
ఉండవు. జాగ్రత్తగా ప్రవర్తించడం మరియు తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ పథం నుంచి
సమస్యలు దూరం అవుతాయి. మీ వల్ల చేయబడే ఏదైనా తప్పు వల్ల ప్రధాన పరిణామాలకు దారితీస్తుంది;
ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. పొట్ట, కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు
రావొచ్చు. ఆర్థికాంశాలు సాధారణంగా ఉంటాయి. మీ ఉద్యోగం మొదటి రోజుల్లో సమస్యల్ని చూడవచ్చు,
అయితే, దాని తరువాత మీ జీవితంలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ జీవితంలో పురోభివృద్ధి
సాధించడం అనేది మీకు అదృష్టం మరియు సంతోషాన్ని మీకు అందిస్తుంది. వ్యాపారం చేసే మీనరాశి
వారు ఆగస్టు తరువాత గొప్ప విజయాలను సాధిస్తారు. మీరు కొత్త వ్యాపార భాగస్వాములను కలవవచ్చు.
ఆగస్టు తరువాత ప్రేమ జీవితం సరైన మార్గంలో నడుస్తుంది దానిముందు ప్రేమ విషయాల గురించి
ఆలోచించవద్దు.
2016 కు సంబంధించిన గ్రహఫలితాలు మీకు సహాయపడ్డాయని మేం ఆశిస్తున్నాం, ఇది విజయం మరియు సంవృద్ధికరమైన మార్గంలోనికి మిమ్మల్ని నడిస్తాయని ఆశిస్తున్నాం.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024