Personalized
Horoscope
  • Talk To Astrologers
  • Brihat Horoscope
  • Personalized Horoscope 2024
  • Live Astrologers
Home » 2014 » Rasi Phalalu 2014 - Telugu Astrology 2014 Published: November 26, 2013

Rasi Phalalu 2014 - Telugu Astrology 2014 - Telugu Horoscope 2014

To check out your Rasi Phalalu 2015, please click here - Rasi Phalalu 2015

Rasi Phalalu 2014 is bringing with it all the information you need to lead a good year. With our Telugu Astrology 2014 you will have an idea of what 2014 will pose in front of you. Whether it will a good year or will it be a problematic year, you can find out with the help of our Rasi Phalalu 2014. We have provided all the information about every aspect of your life, starting from career, family, Love life, finance, health and education. By giving our Telugu Astrology a read you can find out what the stars have in store for you in 2014.

All the predictions made here are for your Moon signs. Our best astrologers have put in their effort in writing these Horoscopes. So, you can totally rely on the information provided in our Rasi Phalalu 2014. If you see any bad times approaching for family or career, then you can take care of that. If you see some other area posing any problems then, you can take care of that as well. At the same time, if you see nay good times approaching you can bask in the happiness, all this with the help of your Rasi Phalalu 2014.

Note: These predictions are based on your Moon sign. If you are not sure about your moon sign, please visit the following page - AstroSage Moon Sign Calculator.

2014 జాతక ఫలితాలు

2014 జాతక ఫలితాలు ఇప్పుడు అస్ట్రోసేజ్ వద్ద లభిస్తున్నది. ప్రతి ఏడాది వలె మేము మీకు 2014 సంవత్సరానికి అత్యుత్తమైన జాతకఫలితాలను పొందుపరచడానికి మా ప్రయత్నాన్ని చేపడుతున్నాం. 2014 జాతక ఫలాలు వేదజ్యోతిష్యం ప్రాతిపదికగా రూపొందించబడినాయి.

జ్యోతిష్యం 2014 లో మీరు మీ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకొనవచ్చు. మీకు 2014 జాతకలను వివరించే ఎందరో జ్యోతిష్కులు, ఎన్నో సంస్థలు మరియు వెబ్ సైట్లు ఉండగా నమ్మదగిన, విశ్వసనీయమైన ఆధారాన్నిగుర్తించడం ఎంతో కష్టం. అస్ట్రోసేజ్ 2014 ఫలితాలు ప్రతి అంశాన్ని మదిలో ఉంచుకొని రూపొందించబడినాయి. ప్రపంచంలో లభించే 2014 జాతకాల రద్దీలో మేము మీకు సంతృప్తి కల్పించడానికి మా ప్రయత్నాలను పొందుపరచాం.

ఈ 2014 జాతక ఫలితాలు ద్వారా మీరు కొంత ప్రయోజనం సిద్దింపజేసుకొనగలరని ఆశిస్తున్నాం. జ్యోతిష్యం 2014 జాతక ఫలితాలు మీరు ప్రతి అంశాన్ని ముందుగా నిర్ణయించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇప్పుడు మీరు మీ భవిష్యత్తును ముందుగానే తెలుసుకొనగలరు. తద్వారా మీరు ముందుగా జాగ్రత్తపడి సుభద్రమైన భవిష్యత్తుకు సిద్ధం కావచ్చు. 2014 జాతక ఫలితాలు నిపుణులైన మా జ్యోతిష్కులచే రూపొందించబడింది. దీనిని మీకు అందించడానికై వారు ఏళ్లతరబడి సాధించిన తమ అనుభవాన్ని ఉపయోగించారు. ఈ జ్యోతిష్యంలో ఈ ఏడాది మీకు ఎలా ఉంటుందని మీరు తెలుసుకొనగలరు. అంతేకాకుండా ఇది మీ జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని మీకు వివరంగా వెల్లడిస్తుంది. ఆది ప్రేమ జీవితానికి లేదా వృత్తిపరమైనదానికి కావచ్చు లేదా ఉద్యోగానికి, ఆర్థిక స్థితిగతులకు సంబంధించినది గాని ఏ ఇతరమైన వాటికి కానీ సంబంధించినది కావచ్చు. వాటికి మార్గం కల్పిస్తుంది.ఈ 2014 జాతక ఫలితాలు మీరు చదవడం ప్రారంభిస్తే, అది మీకు ఈ సంవత్సరం గురించి ఒక నిర్దుష్టమైన అభిప్రాయాన్ని కలిగిస్తుంది. తర్వాత, 2014 జాతక ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాల వైపునకు తీసుకొని వెడుతుంది. తద్వారా మీరు ఇంటి వాతావరణం నుండి ఎదురయ్యే ఇబ్బందుల నుండి దూరంగా జరుగుతారు. దీనికి కారణం ఏదో జరగవచ్చనే ఆలోచన మీకు ముందుగానే కలగడమే.

ఆ తర్వాత 2014 జాతక ఫలితాలు మీ ప్రేమ సంబంధమైన అంశాలపై మనస్సును కేంద్రీకరింపజేస్తుంది. మెల్లమెల్లగా దృష్టిని మళ్లిస్తుంది. ప్రేమ అనేది ఏ వ్యక్తి జీవితంలోనైనా ఎంతో ప్రాధాన్యత సంతరించుకొన్న అంశం. మీ జీవితంలో ప్రేమ అనేది శూన్యమైనప్పుడు ప్రతి ఒక్కటీ అంతర్గతంగా ఖాళీగా ఉన్నట్టిదే. కాబట్టి మీ 2014 జాతక ఫలితాలు జ్యోతిష్యం పరమైన ముందు హెచ్చరికలు మీ ప్రేమ జీవితం రాబోయే రోజులలో ఎలా ఉంటుందో వెల్లడించి మీరు దానికి అనుగుణంగా జాగ్రత్తపడేలా చేస్తుంది. తరువాత మరో కీలకమైన అంశం వెలుగులోకి వస్తుంది. ఆది జీవన సరళికి , వృత్తికి సంబంధించినది. మన జీవితంలో ఈ అంశానికి గల విశిష్టత గురించి మనకందరికీ తెలుసు. తద్వారా మీ 2014 జాతక ఫలితాలు భవిష్యత్తు పోకడలు చక్కగా పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. ఆ తరువాత మనం మీరు పనిచేసే కార్యాలయం గురించి చర్చిస్తే, అది ఎంతో అనుకూలంగా చక్కగా ఉండాలని అనిపిస్తుంది. 2014 జాతక ఫలితాలు జోస్యం నిరంతరం మీకు ఓదార్పు, ఉపశమనం కలిగేలా చేస్తుంది. ఆ తర్వాత, మీ ఆర్థికస్థిక స్థితిగతులు ఎంతో ప్రాధాన్యత సంతరించుకొంటుంది. పెట్టుబడుల విషయంలో తీసుకొనే పొరబాటు నిర్ణయాల కారణంగా ఏవేవొ ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని మీకు ఎప్పటికీ తెలియదు. కాబట్టి 2014 జాతక ఫలితాలు మీ ఆర్థిక స్థితిగతులపై చేసే హెచ్చరికలు మీరు ఆస్తిపాస్తుల విషయంలో సముచిత నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తుంది.

గమనిక: ఈ ఫలితాలు మీ చాంద్రమాన రాశి ఆధారంగా పొందుపరచబడినాయి. ఇక్కడ క్లిక్ చేయండి: అస్ట్రోసేజ్ మూన్ సైన్ కాల్క్యులేటర్

మేష రాశికి 2014 జాతక ఫలితాలు (Mesha Rasi Phalalu 2014)

Aries Rasi Phalalu 2014

కుండలిలో మేషరాశి వారికి 2014 ఎంతో మంచి కాలం. 2014 జాతక ఫలితాలు చెబుతున్న ఫలితాలు: కుటుంబ జీవనం సవ్యంగా, సంతోషంగా ఉంటుంది.అయితే, శని మరియు రాహువు 7 వ ఇంటిలో ఉన్నారు. ఆ గ్రహాలు 2014 లో మీ జీవిత భాగస్వామితో అభిప్రాయభేదాలు తీసుకొని వస్తాయి. అలాగే 2014 జాతక ఫలితాలు ప్రకారం మీ భార్య/ భర్త ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే, 2014 జాతక ఫలితాల ప్రకారం మీరు కొన్ని ఒడుదుడుకులను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది. ఈ కారణంగా మీరు జబ్బులను నిరోధించడానికై అప్రమత్తంగా ఉండాలి. అలాగే, ప్రేమ జీవనానికి సంబంధించి ఈ సంవత్సరం చక్కటి సమయం. అయితే కులాంతర సంబంధాలకు ఇది తగిన సమయం కాదు. కాబట్టి మీ ప్రేమ వ్యవహారం మీ కులం వారితో కాని పక్షంలో మీరు వేసే ప్రతి అడుగుపై అదుపు ఉంచుకోండి. వృత్తి రంగాన్ని పరిశీలిస్తే ఈ ఏడాది మీకు ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థికంగా ఈ సంవత్సరం ప్రొత్సాహకరంగా ఉంటుందని 2014 జాతక ఫలితాలు ఫలితాలు చెబుతున్నాయి. మీరు ఉన్నత విద్యకు వెళ్లాలనుకొంటే మీకు ఎంతో చక్కటి ఫలితాలు ఎదురవుతాయి. హెచ్చు చదువుల కోసం విదేశాలకు వెళ్లదలచిన విద్యార్థులకు 2014 జూన్ తర్వాత సత్ఫలితాలు లభిస్తాయి. ఎదురయ్యే చిక్కుల పరిహారం కోసం నల్ల ఆవులను పూజించండి. ఇక మనం వృషభ రాశి గురించి చెప్పుకొందాం

వృషభ రాశి వారికి 2014 జాతక ఫలితాలు (Vrusha Rasi Phalalu 2014)

Taurus Rasi Phalalu 2014

కుండలిలో వృషభ రాశి వారికి 2014 ఎన్నో ఆశ్చర్యం కలిగించే సంఘటనలను చూపిస్తుంది. 2014 సంవత్సరానికి భవిష్యత్తు సూచనల మేరకు మీకు ప్రియమైన వారికి ఏదో ఒక ప్రత్యేకత గురించి ఆలోచిస్తారు. 2014 జాతక ఫలితాలు ప్రకారం ఆ చర్య మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది. మీరు ఏదైనా దీర్ఘకాలపు జబ్బుకు గురికానట్లయితే ఆరోగ్యం విషయంగా ఈ ఏడాది మీకు మంచిని కలిగిస్తుంది. ఆయితే మీరు దీర్ఘకాలిక జబ్బుతో బాధ పడుతున్నట్లయితే మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ ఏడాది ప్రేమ జీవితానికి ఎంతో మంచి కాలం అయితే కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఎదురవుతాయి. అన్ని విధములైన వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిదని 2014 భవిష్యత్తు సూచనలు వెల్లడిస్తున్నాయి. వృత్తికి, ఉద్యోగాలకు సంబంధించి ఈ ఏడాది అనువైన సమయం అని 2014 జాతక ఫలితాలు జోస్యం పేర్కొంటున్నది. ఉద్యోగం లేనివారికి ఉద్యోగం లభిస్తుంది. అయితే వాణిజ్య రంగంలోని వారు మరింత కృషి చేయవలసి వస్తుంది. దీనికి కారణం మీరు అధిక శ్రమకు లోనుకానట్లయితే సత్ఫలితాలు సాధించజాలరు. మీరు చక్కగా శ్రమిస్తే ఎక్కువ సంఖ్యలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికపరంగా 2014 మీకు ఎంతో సహకరిస్తుంది. 2014 జాతక ఫలితాలు ప్రకారం ఈ ఏడాది పూర్వార్ధంలో పొదుపు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఏడాది ఉత్తరార్ధంలో మీ ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. 2014 అస్ట్రాలజీ ముందుచూపు ప్రకారం విద్యార్థులు ప్రయోజనకరమైన ఫలితాలను పొందగలరు. పరిహారార్థం బాలికలకు మరింత హెచ్చుగా సేవలు కల్పించండి. ఇక మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం

మిథున రాశికి 2014 జాతక ఫలితాలు (Mithuna Rasi Phalalu 2014)

Gemini Rasi Phalalu 2014

మిథున రాశికి చెందిన వారికి ఈ ఏడాది ఎంతో ప్రయోజనకారి అని 2014 జాతక ఫలితాలు జోస్యం చెబుతున్నది. 2014 లో మీ ఇంటిలో ఒక ముఖ్యమైన సంబరం జరుగనున్నది. అలాగే మీ ఇంటిలో ఒక పెళ్లి గాని శిశు జననం గాని జరగడానికి మంచి అవకాశం ఉన్నది. ఏమయినా మీరు మీ ఆరోగ్యం పై ఒక కన్ను వేసి ఉంచడం మంచిది. మీకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆందోళన కలిగించే జబ్బు ఎదురుకాకపోయినా, కొన్ని సందర్భాలలో ఋతువుల అనుసరించి ఎదురయ్యే జబ్బులు మిమ్మల్ని పీడించవచ్చు. ప్రేమవ్యవహారానికి సంబంధించిన వాటిలో పట్టుపట్టి కూర్చోకుండా సరళంగా ఉండడం మంచిది. అలా కాని పక్షంలో మీ ప్రేమ భాగస్వామి మరొకరి ఆకర్షణకు గురికావచ్చు. 2014 జాతక ఫలితాల ప్రకారం మీరు సామాజికంగా మీకంటే వేరయిన వారి ఆకర్షణకు గురవుతున్నట్లు మీకు అనుభూతి కలుగుతుంది. ఈ ఏడాది వాణిజ్యానికి, ఉద్యోగానికి అనువైనది. మీరు నిరుద్యోగ సమస్య నుండి బయటపడగలరు లేదా ప్రమోషన్ పొందగలరు. ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలను సమకూర్చగలదు. 2014 హారోస్కోప్ ప్రకారం మీ ఆదాయం వనరులు పెరుగవచ్చు. ఒడుదుడుకులతో కూడినట్టి పెట్టుబడుల నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. 2014 విద్యార్థులకు మంచి కాలం. 2014 జాతక ఫలితాలు ప్రకారం ఉన్నత విద్యలకు ఈ ఏడాది ఎంతో విశిష్టమైనది. ఈ ఏడాదిలో మీకు మరింత మంచి జరగాలంటే ఏదైనా ఆలయంలో బాదామి గింజలను దానం చేయండి. ఇప్పుడు మనం కటక రాశివారికి 2014 సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం.

కటక రాశి వారికి 2014 జాతక ఫలితాలు (Kataka Rasi Phalalu 2014)

Cancer Rasi Phalalu 2014

కుండలిలో కటక రాశికి చెందినవారికి 2014 లో మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. 2014 జాతక ఫలితాలు ప్రకారం ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. నాల్గవ ఇంటిలోని రాహువు మరియు శని మీ మానసిక శాంతికి ఇబ్బంది కలిగించవచ్చు. 2014 జాతక ఫలితాల ప్రకారం కుటుంబ జీవన వ్యవస్థ కారణంగా మానసిక ఒత్తిడులకు గురి కావచ్చు. 2014 లో మీకు మీ కుటుంబ సభ్యులతో పడక పోవచ్చు. ఈ పరిస్థితి మీకు ఒత్తిడి కలిగిస్తుంది. ఈ సమయం మీకు ఆరోగ్యానికి, ఉద్యోగానికి, విద్యకు మరియు ప్రయాణాలకు సరియైనది కాదు. ఈ పరిస్థితిలో మీరు మీ ఆరోగ్యం గురించి సర్వదా జాగ్రత్తగా నిఘాతో ఉండడం అవసరం. 2014 జాతక ఫలితాలు చెప్పబోయేది ఏమిటంటే, మీ ఉద్యోగంలో మార్పు కలగవచ్చు. మీ సీనియర్లతో అనవసరమైన వాదం కట్టిపెట్టంది. అలాగే ప్రాధాన్యలేని ప్రయాణాలకు స్వస్తి చెప్పండి. అయితే ఏడాది రెండవ భాగం మరింత మంచిగా ఉంటుందని చెప్పవచ్చు. దశలవారీగా మీ కష్టాలు తీరిపోతాయి. 2014 జాతక ఫలితాలు ధార్మికమైన, ఆధ్యాత్మికమైన కార్యకలాపాలు మీకు మనశ్శాంతి కలిగిస్తాయని చెబుతుంది. ఏడాది రెండవ భాగంలో మీ విద్యా విషయం ప్రగతిలో నడుస్తుంది. ఉన్నత విద్యకై మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ కష్టాలు తొలగిపొవడానికి గాను ఆవుకు పాలతో కలిపిన అన్నాన్ని తినిపించండి. ఇప్పుడు మనం సింహరాశి గురించి చెప్పుకొందాం:

సింహరాశికి 2014 జాతక ఫలితాలు (Simha Rasi Phalalu 2014)

Leo Rasi Phalalu 2014

కుండలిలో సింహరాశి జాతకులారా ! ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో మీరు వివిధ రకాల మంచి ఫలితాలను పొందనున్నారు. 2014 జాతక ఫలితాలు చెప్పబోయేదేమిటంటే ఏడాది పూర్వార్ధంలో మీ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంతో గడుపుతారు. 2014 లో ఆదాయం వనరులు మెరుగు పడతాయి. మీకు బంధువుల నుండి మిత్రుల నుండి విస్తారంగా మద్దతు లభిస్తుంది. 2014 జాతక ఫలితాలు జోస్యం ప్రకారం మీకు ఈ ఏడాది సంతానం మరియు విద్య విషయంలో ఎంతో బాగుంటుంది. అయితే జాతకంలో సంతానం స్థానం అయిన ఐదవ ఇంటిపై శని వీక్షణ కారణంగా సంతానానికి సంబంధించిన ఒత్తిడులు పెరుగుతాయి. కాని అన్ని సమస్యలు కాలానుగతికి అనుగుణంగా నడుస్తాయి. ఆరోగ్యం సంబంధించి ఈ ఏడాది మంచి కాలం. ఇది ప్రేమ వ్యవహారాలకు, సంతానానికి చక్కటి సమయం. 2014 జాతక ఫలితాలు చెప్పేదేమిటంటె, లాభదాయకమైన అవకాశాలు ఎన్నో మీకు ఎదురవుతాయి. వృత్తిపరంగా మీరు బాగా పైకి వస్తారు. 2014 లో ప్రమోషన్లకు అవకాశం ఉన్నది. విద్యార్థులు తాము ఆశించిన ప్రవేశ పరీక్షలను అధిగమిస్తారు. అయితే రెండవ సగం ఏడాదిలో ఖర్చులు పెరుగుతాయి. అలాగే ఈ కాలం ఆరోగ్యానికి అనువైనది కాదు. మీరు కొన్ని ప్రయోజనరహితమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారానికిగాను రాగిచెట్టుకు (అశ్వత్థవృక్షం) నీరు పోయండి. ఇప్పుడు మనం కన్యా రాశి వారి ఫలితాల గురించి చర్చిద్దాం.

కన్యా రాశి 2014 జాతక ఫలితాలు (Kanya Rasi Phalalu 2014)

Virgo Rasi Phalalu 2014

కుండలిలో కన్యా రాశి వారికి మొత్తం మీద 2014 సంవత్సరం ఫలితం ఆశాజనకంగా ఉంటుంది. ఇంటి విషయంలో పరిస్థితి చక్కగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంటారు. అయితే మీరు మీ నాలుకను అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నాను.పైగా, మీరు అనవసరమైనట్టి ఖర్చులను అదుపు చేయవలసి ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈ ఏడాది రెండవ భాగం ప్రేమ వ్యవహారాలకు మరియు వివాహానికి ఎంతో బాగుంటుంది. 2014 జాతక ఫలితాలు ప్రకారం మీరు మీ వృత్తి ఉద్యోగంలో ఏదో విశిష్టమైనదానిని సాధిస్తారు. ప్రమోషం కూడా సాధ్యమే. 2014 లో మీకు ఎన్నెన్నో అవకాశాలు లభిస్తాయి. అయితే శని మరియు రాహువు రెండవ ఇంటిలో ఉన్నారు. దీనితో మీరు పైకాన్ని పొదుపు చేయడానికి ఇబ్బంది పడతారు. కానీ జూలైలో రాహువు కదలిక వల్ల మీరు పొదుపు జరపగలరు. పైగా రాహువు చలనం మీకు మంచి ఆరోగ్యం కూడా ఇవ్వగలదు. 2014 జాతక ఫలితాల ప్రకారం విద్యార్థులకు ప్రొత్సాహకరమైన ఫలితాలు లభిస్తాయి. పరిస్థితులు మీకు అనుకూలించేందుకుగాను నుదుటిపై సింధూర తిలకం ధరించండి. ఇప్పుడు మనం తులా రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం.

తులా రాశి వారికి 2014 జాతక ఫలితాలు (Tula Rasi Phalalu 2014)

Libra Rasi Phalalu 2014

కుండలిలో తులా రాశి వారికి ఫలితాలు: 2014 నుండి మీరు మిశ్రమ ఫలితాలను ఎదురుచూడవచ్చు. స్వాభావికముగా మీరు ఆధ్యాత్మిక మనోస్థితి కలిగినవారయితే మీరు మీ కుటుంబంలో ఆరోగ్యపరంగాసర్వసమ్మతమైన వాతావరణాన్ని సృష్టించగలరు. దీనికి కారణం మీ తొమ్మిదవ ఇంటిలోని గురుడు మీ అదృష్టానికి మద్దతు ఇస్తున్నాడు. మొదటి ఇంటిలోని శని రాహువు మీకు ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులను కల్పించవచ్చు. అయితే జూలై నెలలో రాహువు చలనం తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ ఏడాది ప్రేమ వ్యవహారాలకు సంబంధించి మంచి సమయం. కానీ మీ వైవాహిక జీవితంలో కొన్ని చిక్కులు తలెత్తవచ్చు. మీరు అత్యంత ప్రాధాన్యత లేనట్టి వ్యాజ్యాలకు దూరంగా ఉండాలని 2014 జాతక ఫలితాలు సూచిస్తున్నది. దానివల్ల మీకు ధనం, సమయం వృథా కావడమే కాకుండా, ప్రయాసలు ఎదురవుతాయి. 2014 లో మీరు వృత్తిపరమైన అంశాలలో కూడా సమస్యలను ఎదుర్కొంటారు. అయితే కొన్ని ఆటంకాల తర్వాత మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక విషయంగా 2014 సగటు ఏడాది అని చెప్పవచ్చు. విద్యార్థులు చక్కగా శ్రమిస్తే మంచి ఫలితాలు సాధించగలరు. విదేశాలలో విద్య అభ్యసించదలచిన వారికి మంచి సమయం. పరిష్కారానికి గానూ వానరములను సేవించండి. పైగా మాంసాహారాన్ని, మాదక ద్రవాలను సేవించకండి. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి చూద్దాం.

వృశ్చికరాశికి 2014 జాతక ఫలితాలు ఫలితాలు (Vrushchika Rasi Phalalu 2014)

Scorpio Rasi Phalalu 2014

2014 జాతక ఫలితాల ప్రకారం వృశ్చిక రాశికి గురుడు ఏడాది మొదట్లో ఎనిమిదవ ఇంటిలో ఉంటాడు. 2014 తొలి నెలలలో మీరు కొన్ని సత్ఫలితాలను పొందడానికై ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. 2014 ఫలితల ప్రకారం మీ కుటుంబ సభ్యులు విచిత్రంగా నడచుకొంటారు. అభద్రత అనే భావన కారణంగా మీ ఆరోగ్యం దెబ్బతినవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి న్యాయపరమైన వ్యాజ్యాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని 2014 ఫలితాలు సూచిస్తున్నాయి. అనవసరమైన ప్రయాణాలు కూడా మీకు మంచివి కావు. ప్రేమ వ్యవహారాలలో కూడా కొంత వ్యతిరేకత కనిపించవచ్చు. ఎంత శ్రమించినా కూడా ఆశించిన ఫలితాలు లభించక పోవచ్చు. అయితే ఈ ఏడాది రెండవభాగంలో గురుడు తొమ్మిదవ ఇంటిలో ఉన్న కారణంగా మీకు ప్రగతి కనిపిస్తుంది. రాహువు జూలైలో మీ తొమ్మిదవ ఇంటికి చేరుకొంటాడు. రాహువు చలనం మీకు ప్రయోజనం కల్పిస్తుంది. ఫలితంగా విద్యార్థులు చక్కటి ఫలితాలు లభిస్తాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మరింత మంచికోసం బంగాళాదుంపలు, నెయ్యి దానం చేయండి. ఇప్పుడు ధనుర్రాశి గురించి తెలుసుకొందాం.

ధనుస్సు రాశి కి 2014 జాతక ఫలితాలు (Dhanusu Rasi Phalalu 2014)

Sagittarius Rasi Phalalu 2014

కుండలిలో ధనుస్సు రాశి వారికి లభించే ఫలితాలు: 2014 మొదటి ఆరు నెలలు మీకు చాలా బాగుంటుంది. 2014 జాతక ఫలితాల ప్రకారం కుటుంబంలో సామరస్యత పెరుగుతుంది. కొత్తగా బలసమీకరణ జరిగినట్లు మీకు అనుభూతి కలుగుతుంది. పదకొండవ ఇంటిలోని శని రాహువులు మీకు అదనపు ప్రయోజనాలు కల్పిస్తారు. కాని లగ్నంపై శని ప్రభావం కారణంగా కొన్ని చెడులు కూడా ఎదురు కావచ్చు. కాబట్టి మీరు చెడు అలవాట్లను, చెడు కార్యకలాపాలను వదలివేయండి. ప్రేమ, వివాహానికి సంబంధించిన విషయాలలో మీరు ఊహించిన ఫలితాలు లభిస్తాయని 2014 ఫలితాలు చెబుతున్నాయి. అయితే, ఐదవ ఇంటిలో శని ఉన్న కారణంగా మీరు అప్పుడప్పుడు మీ ప్రేమ భాగస్వామితో వాదానికి దిగవచ్చు. చిన్నచిన్న అంశాలపై వాదోపవాదాలు జరపకపోవడం మంచిది. వృత్తిపరంగా ఈ ఏడాది మంచి సమయం. విద్యార్థులు వారి శ్రమ ఫలితంగా మంచి ఫలితం పొందుతారు. కానీ ఏడాది రెండవ భాగంలో మీరు ప్రతి విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. 2014 జాతక ఫలితాలు ప్రకారం జాగ్రత్తగా పెట్టుబడులు చేయడం శ్రేయం, వివేకం కాగలదు. దొడ్డిదారిలో నిమిషాలలో డబ్బు సంపాదించాలనే దురాశకు వెళ్లకండి. ఉద్యోగస్థులు ఎంతో జాగ్రత్తగా ఉండడం అవసరం. మీరు ఉద్యోగాన్ని మార్చుకోవలసి రావచ్చు లేదా మీకు ఇష్టంలేని ప్రాంతానికి బదిలీ జరగవచ్చు. పరిస్థితులు సరిపడేందుకుగానూ ప్రతి నాలుగు నెలలకు ఒకమారు ప్రవహించే నీటిలో కొబ్బెరకాయలను వదలండి. ఇక మకర రాశి ఫలితాలు:

మకర రాశికి 2014 జాతక ఫలాలు (Makara Rasi Phalalu 2014)

Capricorn Rasi Phalalu 2014

కుండలిలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఈ నెల మొదట్లో గురుడు మీ ఐదవ ఇంటిలో ప్రవేశిస్తాడు. ఆర్థికపరమైన విషయాలలో ఎగుడుదిగుడులు కనిపిస్తాయి. ఋణాలకు సంబంధించిన అంశాలపై మీరు ప్రత్యేక శ్రద్ధ చూపవలసి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఎదురు కావచ్చని ౨౦౧౪ జాతకఫలాలు చెబుతున్నాయి. పైగా ఆరోగ్యం అంత బాగా ఉండదు. అయితే వ్యాధులు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టవు. కొన్ని విభేదాలు, కోర్టు కేసులకు కొద్దిపాటి అవకాశం ఉన్నది. ఈతూరి కొన్ని ఇక్కట్ల తర్వాత అయినా మీకు కోర్టు వ్యాజ్యాలలో విజయం లభిస్తుంది. మీ శత్రువులు మిమ్ము కొంతవరకు ఇబ్బందుల పాలు చేయవచ్చు. కానీ చివరకు విజయం మీ హస్తగతమవుతుంది. ఏడాది రెండవ భాగంలో ప్రేమ వ్యవహారాలలో ప్రగతి కనిపిస్తుంది. వివాహం ఆనందం కలిగించవచ్చు. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగవచ్చు. మీరు భాగస్వామ్యంతో ఉంటే మీకు ప్రయోజనం కలుగుతుంది. సంపాదనలు మరియు విద్యారంగంలో మెరుగు కనిపిస్తుంది. ఒక ఆర్చకునికి పసుపుపచ్చ వస్త్రాలు దానం చేయడం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకొందాం

కుంభరాశి వారికి 2014 జాతక ఫలితాలు (Kumbha Rasi Phalalu 2014)

Aquarius Rasi Phalalu 2014

కుంభరాశి వారు 2014 లో మహత్తరమైన ప్రారంభానికి స్వాగతం పలుకుతారు. మీ కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు జరగవచ్చు. కుటుంబ సంక్షేమానికి ఎంతో అనువైన సమయం. ఈ ఏడాది విద్యారంగానికి కూడా ఎంతో అనువైనదని చెప్పవచ్చు. దూరప్రాంతాల ప్రయాణాలు లాభిస్తాయి. ప్రత్యేకంగా ఆధ్యాత్మిక పనులకు సంబంధించిన ప్రయాణాలకు సమయం చాల బాగుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆయితే మీ ఆహారం అలవాట్లపై నిఘా అవసరం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త అవసరం. మీకు మరింత మంచి ఉద్యోగం లభించవచ్చు. హెచ్చు లాభాలు ఆర్జించగలరని ఫలితాలు చెబుతున్నాయి. విద్య పరంగా ఇది మంచి సమయం. అయితే మీరు ఏడాది రెండవ భాగంలో కొన్ని చిక్కులను ఎదుర్కొనవలసి రావచ్చు. కొందరు వ్యక్తులు అకారణంగా మీకు వ్యతిరేకులుగా మరవచ్చు. ౨౦౧౪ లో ఋణాల లావేదేవీల విషయంలో చిక్కులు ఎదురు కావచ్చు. చెప్పుకోదగ్గ పెట్టుబడులకు దూరంగా ఉండడం ఎంతో మంచిది. జలమార్గంగా ప్రయాణం చేయవలసి వస్తే అట్టి ప్రయాణాన్ని నిలిపివేయడానికి ప్రయత్నించడం ఎంతో మంచిది. గ్రహాల నుండి ఎదురయ్యే వ్యతిరేక ఫలితాల నివారణ కోసం దేవాలయంలో బియ్యం, బెల్లం, పప్పుధాన్యలను దానం చేయండి. ఇప్పుడు మీన రాశి ఫలితాలు:

మీన రాశి వారికి 2014 ఫలితాలు (Meena Rasi Phalalu 2014)

Pisces Rasi Phalalu 2014

మీన రాశివారికి 2014 ఎంతో ప్రయోజనకరమైనదని రుజువవుతుంది. శని దుష్ప్రభావం ఉన్నప్పటికీ మీకు గురుని ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. మీరు చక్కని ఆరోగ్యం కలిగి ఉంటారు. కొత్త వాహనం లేదా కొత్త ఇల్లు కొనుగోలుకు వీలు కలుగుతుంది. 2014 జాతక ఫలితాల ప్రకారం ఏడాది రెండవ భాగం ప్రేమ వ్యవహారాలకు, వివాహనికి సుగమం చేస్తుంది. కానీ రాహువు జూలై నెలలో మీ ఏడవ ఇంటిలో ప్రవేశించననున్నందున వైవాహిక జీవితంలో ఒత్తిడులు పెరుగుతాయి. 2014 ఫలితాల ప్రకారం మీరు మీ వాణిజ్యాన్ని మెరుగు పరచడానికై కొంత పైకాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. సీనియర్లు మీకు సహాయం కల్పిస్తారు. మీ పథకాలను ఆచరణలో పెట్టే ప్రయత్నంలో మీరు కొత్త అంశాన్ని ప్రారంభిస్తారు. ఆదాయం పెరుగుతుందని ఫలితాలు పేర్కొంటున్నాయి. అయితే మీరు భాగస్వామ్యంలో ఉంటే జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులకు ఈ ఏడాది ఎంతో ప్రయోజకరమైనదని ఫలితాలు చెబుతున్నాయి. ఉన్నత విద్యలకు వెళ్లేవారికి సమయం మరింత బాగుంటుంది. హెచ్చు ప్రయోజనాల కోసం మీ జేబులో ఒక చతురస్రాకారపు వెండి రేకును ఉంచుకోండి.

పండిట్ హనుమాన్ మిశ్రా

2014 Articles

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

AstroSage TVSubscribe

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com

Reports

Live Astrologers